ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లేహ్‌ సమీపాన దుర్ఘటనలో సైనిక సిబ్బంది మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 19 AUG 2023 11:50PM by PIB Hyderabad

   లేహ్‌ సమీపాన సంభవించిన దుర్ఘటనలో భారత సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“లేహ్ సమీపాన దుర్ఘటనలో మన సైనిక సిబ్బందిని కోల్పోవడం నన్నెంతో బాధించింది. దేశానికి వారి అసమాన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండిపోతాయి.  మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను PM @narendramodi” అని ఆకాంక్షించారు.

 

***

DS/ST


(Release ID: 1950678) Visitor Counter : 175