ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశం అధ్యక్షతన జీ-20 సమావేశం
మా విధానం స్పష్టం.. మా లక్ష్యాలు ప్రతిష్టాత్మకం.. లక్ష్య సాధన మా సంకల్పం.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
"ఆరోగ్య సంరక్షణ అనేది ఒక రంగం కాదు, ఒక లక్ష్యం"
"ప్రపంచ వ్యాక్సిన్ అవసరాలలో 60% , సాధారణ ఎగుమతుల్లో 20-22% అవసరాలు తీరుస్తున్న భారతదేశం ప్రపంచానికి అధిక-నాణ్యత ఔషధాలు సరఫరా చేసి ఆరోగ్య సంరక్షణకు అంకిత భావంతో పని చేస్తుంది"
జీ-20 ఆరోగ్య శాఖ మంత్రులు,, ఆరోగ్య రంగ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణలు, ప్రపంచ సహకారంపై భారతదేశం విధానాన్ని వివరించిన డాక్టర్ మాండవీయ
డాక్టర్ మాండవీయ నేతృత్వంలో జన ఔషధ కేంద్రాలను సందర్శించిన జీ-20 ప్రతినిధుల బృందం
డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఇండోనేషియా ఆరోగ్య మంత్రి శ్రీ బుడి జి సాదికిన్ ల మధ్య విజయవంతంగా ముగిసిన ద్వైపాక్షిక చర్చలు
నెదర్లాండ్స్‌లో, యూరప్‌లో, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను భారతదేశంలో తయారైన మందులు రక్షిస్తున్నాయి..నెదర్లాండ్స్ ఆరోగ్య మంత్రి డాక్టర్ ఎర్నెస్ట్ కైపర్స్
ప్రజలకు నాణ్యమైన ఔషధాలను సరసమైన ధరలకు అందించడానికి భారతదేశం అమలు చేస్తున్న జన్ ఔషధీ విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమ
Posted On:
20 AUG 2023 12:51PM by PIB Hyderabad
గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న జీ-20 ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశంలో కేంద్ర రసాయనాలు , ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. జీ-20 దెహస్లా ఆరోగ్య శాల మంత్రులు, ప్రతినిధులు, భారత ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన ప్రముఖులు, ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ మాండవీయ 'మా విధానం స్పష్టం.. మా లక్ష్యాలు ప్రతిష్టాత్మకం.. లక్ష్య సాధన మా సంకల్పం" అని ప్రకటించారు.
ఫార్మాస్యూటికల్స్ వైద్య పరికరాల రంగంలో భారతదేశం సాధించిన అభివృద్ధిని, నైపుణ్యాన్ని డాక్టర్ మాండవీయ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఔషధాల నైపుణ్యానికి ప్రపంచ కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందిందన్నారు. "ప్రపంచ ఫార్మాస్యూటికల్ రంగంలో భారతదేశం ఒక మూల స్తంభం గా గుర్తింపు పొందింది" అని ఆయన పేర్కొన్నారు. సరసమైన, అధిక-నాణ్యత కలిగిన ఔషధాలను అందించడానికి ప్రభుత్వం అంకితభావంతో చర్యలు అమలు చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన ఔషధాలను తక్కువ ధరకు అందించడంలో భారతదేశం విజయం సాధించింది అని డాక్టర్ మాండవీయ అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ అవసరాలలో 60% సాధారణ ఎగుమతుల్లో 20-22% అవసరాలను తీరుస్తున్న భారతదేశం ఫార్మాస్యూటికల్ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు.
ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం భారతదేశం కృషి చేస్తుందని డాక్టర్ మాండవీయ హామీ ఇచ్చారు. కోవిడ్-19 సమయంలో భారతదేశం అనేక దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి తన నిబద్ధత చాటిందన్నారు.
"మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో, భారతదేశం సుమారు 185 దేశాలకు అవసరమైన మందులు సరఫరా చేసింది," అని మంత్రి తెలిపారు. ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రపంచ శక్తిగా భారతదేశం గుర్తింపు పొందిందని మంత్రి అన్నారు.
పరిమాణం -ఆధారిత విధానం నుంచి విలువ-ఆధారిత విధానం అనుసరించి ప్రపంచ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని డాక్టర్ మాండవీయ వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని తెలిపిన డాక్టర్ మాండవీయ "ఆరోగ్య సంరక్షణలో నాణ్యత, ప్రాప్యత మరియు స్థోమత అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు అమలు జరుగుతాయి,"అని డాక్టర్ మాండవీయ అన్నారు.
ఆరోగ్య సంరక్షణ పురోగతిలో పరిశోధన , అభివృద్ధి అత్యంత పాత్ర పోషిస్తాయని డాక్టర్ మాండవీయ అన్నారు. ఫార్మాస్యూటికల్ రంగం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.. ఫార్మా-మెడికల్ పరికరాల రంగాల్లో పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి త్వరలో జాతీయ విధానాన్ని రూపొందిస్తామని మంత్రి తెలిపారు.
ఫార్మాస్యూటికల్ రంగం అభివృద్ధికి భారతదేశం చేస్తున్న ప్రయతనాలకు శాలు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ప్రముఖులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పరిశోధకులు సహకరించాలని డాక్టర్ మాండవీయ కోరారు. సమిష్టి కృషితో ఫార్మాస్యూటికల్ రంగం ఆకాశమే హద్దుగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు. “భారతదేశం దృష్టిలో ఆరోగ్య సంరక్షణ అనేది ఒక రంగం మాత్రమే కాదు. ప్రతి పౌరునికి అత్యున్నత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడం లక్ష్యంగా అమలు జరుగుతున్న ఒక బృహత్తర కార్యక్రమం. దేశ ఫార్మాస్యూటికల్, వైద్య పరికరాల పరిశ్రమ ఈ మిషన్‌లో కీలక భాగస్వామిగా ఉంటాయి " అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇండోనేషియా ఆరోగ్య మంత్రి శ్రీ బుడి జి సాదికిన్ , నెదర్లాండ్స్ మంత్రి డాక్టర్ ఎర్నెస్ట్ కైపర్స్ వారి ప్రారంభ వ్యాఖ్యలలో ఆరోగ్యం , ఫార్మకాలజీ రంగాలలో భారతదేశం సాధించిన విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్యం , ఫార్మకాలజీ రంగాలలో దేశాల మధ్య సహకారం అవసరం అన్నారు. “భారతదేశంలో తయారయ్యే మందులు నెదర్లాండ్స్‌లో, యూరప్‌లో, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు రక్షిస్తున్నాయి. భారతదేశం తో కలిసి పని చేయడానికి నెదర్లాండ్స్ సిద్ధంగా ఉంది. . వినూత్న ఔషధాలలోకలిసి పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. జెనరిక్, నిర్దిష్ట ఔషధాలలో భారతదేశానికి ఉన్న సామర్థ్యం, పరిజ్ఞానం నెదర్లాండ్స్ కు ఎంతగానో ఉపయోగపడతాయి" అని డాక్టర్ కైపర్స్ చెప్పారు.
ఈరోజు ఇండోనేషియా ఆరోగ్య మంత్రి తో డాక్టర్ మాండవియా జరిపిన ద్వైపాక్షిక చార్వ్చాలు విజయవంతం అయ్యాయి. ఆరోగ్య రంగంలో సహకారానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.
సమావేశంలో రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్ అపర్ణ మాట్లాడుతూ ఇలాంటి వేదిక పరిశ్రమలకు, వివిధ దేశాలకు అభిప్రాయాలు పంచుకోవడానికి సహకరించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి అనుభవాలు ప్రసవించిన శ్రీమతి అపర్ణ "ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందనను వెంటవెంటనే అభివృద్ధి చేయడం సాధ్యం కాదు అని భారతదేశం గుర్తించింది. దీర్ఘకాలిక అభివృద్ధి మరియు పెట్టుబడి అవసరమని మహమ్మారి గుర్తుచేసింది." అని అన్నారు.
డాక్టర్ మాండవీయ నేతృత్వంలో జన ఔషధ కేంద్రాలను జీ-20 ప్రతినిధుల బృందం సందర్శించింది. బృందంలో ఇండోనేషియా ఆరోగ్య మంత్రి బుడి జి సాదికిన్ , నెదర్లాండ్స్ మంత్రి డాక్టర్ ఎర్నెస్ట్ కైపర్స్, ఇతర దేశాలకు చెందిన మంత్రులు, ప్రతినిధులు ఉన్నారు.
సందర్శన అనంతరం శ్రీ బుడి గుణది సాదికిన్ మాట్లాడుతూ " దేశ ప్రజలకు ఇండోనేషియా ప్రభుత్వం ఉత్తమమైన మందులు అందించడానికి కృషి చేస్తోంది. దీనికోసం వివిధ దేశాలకు చెందిన అనేక నమూనాలను పరిశీలించాము. ప్రజలకు నాణ్యత గల మందులను సరసమైన ధరలకు అందించడానికి భారతదేశం అమలు చేస్తున్న జన్ ఔషధి కేంద్రం విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది." అని అన్నారు.
****
(Release ID: 1950667)
Visitor Counter : 193