ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

భారతదేశం లోనిగ్రామీణ ప్రాంతాల లో మరియు పట్టణ ప్రాంతాల లో సాంప్రదాయిక చేతి వృత్తి శ్రమికుల కు,హస్తకళ ల నిపుణుల కు అండగా నిలవడం కోసం ఉద్దేశించిన నూతన కేంద్రీయ రంగ పథకం ‘పిఎమ్ విశ్వకర్మ’ కు ఆమోదాన్ని తెలిపిన కేంద్ర మంత్రిమండలి


ఈ పథకాని కి 13,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది

పిఎమ్ విశ్వకర్మలో భాగం గా మొదటి విడత లో పద్దెనిమిది సాంప్రదాయిక వ్యాపారాలు లబ్ధి ని పొందనున్నాయి

Posted On: 16 AUG 2023 4:21PM by PIB Hyderabad

ఒక క్రొత్త కేంద్రీయ రంగ పథకం ‘‘పిఎమ్ విశ్వకర్మ’’ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ పథకాని కి 13,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. ఈ పథకాన్ని అయిదు సంవత్సరాల కాలం పాటు (2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం మధ్య) అమలు చేయాలని ఉద్దేశించడమైంది. ఈ పథకం గురు-శిష్య పరంపర లేదా చేతివృత్తుల వారు మరియు హస్తకళల ప్రవీణుల కు అండదండల ను అందజేసి, వారిని పెంచి పోషించాలనేది ఈ పథకం యొక్క లక్ష్యం గా ఉంది. చేతివృత్తుల ను అనుసరిస్తున్నటువంటి వారు మరియు హస్తకళల నిపుణులు రూపొందించే వస్తువులు మరియు సేవల యొక్క నాణ్యత ను మరియు వ్యాప్తి ని మెరుగు పరచి, ఆయా విశ్వకర్మ లు దేశీ మరియు విదేశీ వేల్యూ చైన్ లతో ముడిపడేటట్లు చూడాలి అనేది కూడా ఈ పథకం యొక్క ధ్యేయం గా ఉంది.

 

పిఎమ్ విశ్వకర్మ పథకం లో భాగం గా, చేతివృత్తుల వారి కి మరియు హస్తకళల నిపుణుల కు పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెటు ను, గుర్తింపు కార్డు ను, ఒక లక్ష రూపాయల వరకు (ఒకటో దఫా లో) మరియు 2 లక్షల రూపాయల వరకు (రెండో దఫా లో) రుణ సమర్థన ను 5 శాతం తగ్గింపు వడ్డీ రేటు తో అందించి, వారి కి ఒక గుర్తింపు ను ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం లో భాగం గా నైపుణ్యాల ఉన్నతీకరణ, పనిముట్టుల సంబంధి ప్రోత్సాహకం, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ ఎండ్ మార్కెటింగ్ సపోర్ట్ సంబంధి ప్రోత్సాహకం లను కూడాను అందజేయడం జరుగుతుంది.

 

భారతదేశం అంతటా పల్లె ప్రాంతాల లో మరియు పట్టణ ప్రాంతాల లో చేతివృత్తుల వారికి, హస్తకళల నిపుణుల కు ఈ పథకం దన్ను గా నిలబడుతుంది. పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో పద్దెనిమిది సాంప్రదాయిక వ్యాపారాల ను లెక్క లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆయా వ్యాపారాల లో.. (1) వడ్రంగులు; (2) పడవల తయారీదారులు; (3) ఆయుధ /కవచ తయారీదారులు; (4) కమ్మరులు; (5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు; (6) తాళాల తయారీదారులు; (7) బంగారం పని ని చేసే వారు; (8) కుమ్మరులు; (9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు; (10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు; (11) తాపీ పనివారు; (12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు; (13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు); (14) క్షురకులు (నాయీ వృత్తిదారులు); (15) మాలలు అల్లే వారు; (16) రజకులు; (17) దర్జీలు మరియు; (18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు.. భాగం గా ఉంటాయి.

 

 

***



(Release ID: 1949531) Visitor Counter : 291