ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ , దేశవ్యాప్తంగా రెండోదశ వార్షిక జాతీయ సామూహిక బోధకాలు వ్యాధి నిరోధక ఔషధ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


ఇండియా బోధకాలు వ్యాధిని 2027 నాటికి నివారించాలని పట్టుదలతో ఉంది. బహుళపక్ష భాగస్వామ్యం, బహుళపక్ష లక్షిత కార్యక్రమాల , బహుళ భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ లక్ష్యానికి మూడు సంవత్సరాల ముందే దీనిని సాధించాలని ఇండియా సంకల్పించింది: మన్ సుఖ్ మాండవీయ.

ప్రజలలో చైతన్యం కల్పించేకార్యక్రమాలు చేపట్టడం, గ్రామస్థాయిలో ప్రచారం, పంచాయితీలలో ఉద్యమ తరహాలో ప్రచారం వంటి వాటి ద్వారా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తారు.

‘‘ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ అన్ని విభాగాల సహకారం, సమాజ భాగస్వామ్యంతో మనం ఈ దేశం నుంచి ఈ వ్యాధిని తరిమికొట్టగలం ’’

Posted On: 10 AUG 2023 2:21PM by PIB Hyderabad

“ఇండియా లింఫాటిక్ ఫైలేరియాసిస్ వ్యాధిని 2027నాటికి నిర్మూలించేందుకు కట్టుబడి ఉంది. అంతర్జాతీయ నిర్దేశిత లక్ష్యం కంటే మూడు సంవత్సరాల ముందే దీనిని నిర్మూలించాలని, ఇందుకు దృఢ సంకల్పంతో పనిచేయాలని,
బహుళ పక్ష భాగస్వామ్యంతో, వివిధ రంగాల వారితో కలిసి కృషి చేస్తున్నట్టు’’ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా రెండో దశ వార్షిక సామూహిక  ఔషధ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు.
ఈ కార్యక్రమానికి  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీన్ పవార్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ భగెల్లు కూడా హాజరయ్యారు.

జన భాగస్వామ్యం, మొత్తం ప్రభుత్వం, మొత్తం సమాజం ఇందులో భాగస్వాములయ్యే విధానంతో , దేశం నుంచి ఈ వ్యాధిని నిర్మూలించవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రెండో దశ ఔషధ  పంపిణీ దేశవ్‌యాప్తంగా
9 రాష్ట్రలలోని 81 జిల్లాలలో ఆగస్టు 10,2023 నుంచి ప్రారంభమవుతుంది. ( ఇవి అస్సాం, బీహర్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు)
  ఛత్తీస్గడ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ టి.ఎస్.సింగ్దేవ్, ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బ్రిజేష్ పాఠక్, ఒడిషా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ నిరంజన్ పూజారి, అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కేశబ్ మహంత, జార్ఖండ్
ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ బన్న గుప్త దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన ఈ ఔషధ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ మాండవీయ, కేవలం మందులు తీసుకోవడంతోనే పని  పూర్తి అయినట్టు కాదని, దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి కాకుండా చూడాలని, అది జరగకుంటే ఈ విషయంలో మన ప్రగతి పరిమితమవుతుందని అన్నారు.

శంలోని  అందరికీ మంచి ఆరోగ్యం ఉండేలా చూసేందుకు కేంద్ర , రాష్ట్రప్రభుత్వాల మధ్య మరింత మెరుగైన సమన్యయం అవసరమని కేంద్ర మంత్రి అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలలో
ప్రజల భాగస్వామ్యం గురించి మంత్రి ప్రస్తావించారు. ని–క్షయ్ మిత్రవంటి వాటి గురించి వివరించారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయడం వల్ల ఈ కార్యక్రమంలో  క్షేత్ర స్థాయినుంచి ప్రజల భాగస్వామ్యానికి వీలు కలుగుతుందని తెలిపారు.
ప్రజాప్రచారం, పెద్దఎత్తున ప్రజలలోకి వెళ్లవలసిన ఆవశ్యకతను, ప్రముఖంగా ప్రస్తావిస్తూ, అవగాహన కల్పించడం, గ్రామస్థాయిలో ప్రచారం కల్పించడం, పంచాయితీలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం అన్నిప్రాంతాలకూచేరగలుగుతుంది. ఈ కృషిని మరింత పటిష్టం చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సంరక్షకుల ఎదుటే వీటిని వాడే విధంగా ప్రోత్సహించాలి. దీనివల్ల వ్యాధిని సత్వరం నివారించవచ్చు. అని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా డెంగూ జ్వరం , చికెన్గున్యా జ్వరం నిరోధానికి  క్లినికల్ మేనేజ్మెంట్ 2023 జాతీయ మార్గదర్శకాలను కూడా డాక్టర్ మాండవీయ  విడుదల చేశారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశు పంత్ మాట్లాడుతూ, ఫైలేరియాసిస్ నిరోధానికి , ప్రజలకు మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం, దేశ ఆరోగ్య అజెండాలో కీలకమైనదని అన్నారు.
ఫైలేరియాసిస్ను నిర్మూలించే ప్రయత్నంలో , ఈ వ్యాధి గల జిల్లాలను గుర్తించి విస్తృతంగా వ్యాధి నిర్మూలన చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు.
అన్ని పక్షాల సమష్టి కృషి, లింఫాటిక్ ఫైలేరియాసిస్ వ్యాధిగ్రస్తుల జీవితాలలో మార్పునుకు దారితీస్తుందన్నారు.

డైరక్టర్జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్, 9 రాష్ట్రాల ప్రన్సిపల్ సెక్రటరీలు, మిషన్ డైరక్టర్లు,
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనకు కార్యదర్శి, మిషన్ డైరక్టర్ శ్రీమతి లాంఛోంగోయ్ స్వీటీ చాంగ్సన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రాజీవ్ మాంఝి,
వివిధ అనుబంధ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శులు, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్ డైరక్టర్ డాక్టర్ తను జైన్,  కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డైరక్టరేట్,  డైరక్టర్ డాక్టర్ ఎం. ఇందుమతి
సీనియర్ రీజనల్ డైరక్టర్లు, 9  రాష్ట్రాల రీజనల్ డైరక్టర్లు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 1949297) Visitor Counter : 102