ప్రధాన మంత్రి కార్యాలయం

రెండుకోట్ల లక్షాధికారి దీదీల ను తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా ఉంది; డ్రోన్ ల నుఎగురవేసే శక్తి ని మహిళా స్వయం సహాయ సమూహాల కు ప్రదానం చేయడం జరుగుతుంది:ప్రధాన మంత్రి

Posted On: 15 AUG 2023 12:42PM by PIB Hyderabad

ఈ రోజు న 77వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, గ్రామాల లో రెండు కోట్ల మంది ‘లక్షాధికారి దీదీల’ను తీర్చిదిద్దాలనే లక్ష్యం తో మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్) తో కలసి ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. ప్రస్తుతం పది కోట్ల మంది మహిళ లు మహిళా స్వయం సహాయ సమూహాలతో అనుబంధాన్ని కలిగివున్నారు అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘పల్లెల లో ఇవాళ, ఎవరికైనా బ్యాంకు లో ఒక దీదీ, ఆంగన్ వాడీ లో ఒక దీదీ మరియు మందుల ను అందజేయడం లో మరొక దీదీ ఎదురుపడేందుకు అవకాశం ఉంది.’’ అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి వ్యవసాయ సంబంధి విజ్ఞానశాస్త్రాన్ని గురించి మాట్లాడారు. శాస్త్రవిజ్ఞానం యొక్క మరియు విజ్ఞానశాస్త్రం యొక్క సామర్థ్యాన్ని గ్రామీణ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి అని ఆయన అన్నారు. 15,000 మహిళా స్వయం సహాయ సమూహాల కు డ్రోన్ ల ను పనిచేయంచడం కోసం మరియు వాటి కి మరమ్మతులు చేయడం కోసం రుణాల ను మరియు శిక్షణ ను అందించడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ మహిళా స్వయం సహాయ సమూహాల వారు ‘‘డ్రోన్ కీ ఉడాన్’’ ను ఆచరణ లోకి తెస్తారు అని ప్రధాన మంత్రి తెలియజేశారు.

 

***



(Release ID: 1948933) Visitor Counter : 115