ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం కొత్త వ్యూహాత్మక శక్తిగా అవతరించింది .. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
సరిహద్దులు గతంలో కంటే మరింత సురక్షితంగా ఉన్నాయి .. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
" సాయుధ దళాలను ఆధునీకరించి భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోడానికి శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
15 AUG 2023 2:00PM by PIB Hyderabad
"ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం కొత్త వ్యూహాత్మక శక్తిగా అవతరించింది. నేడు మన సరిహద్దులు గతంలో కంటే మరింత సురక్షితంగా ఉన్నాయి" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రపంచ స్థాయిలో భద్రతా పరంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రత పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. సాయుధ బలగాల ఆధునీకరణకు అనేక సైనిక సంస్కరణలుఅమలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి సాయుధ బలగాలను పటిష్టం చేసి యుద్ధానికి సిద్ధం చేస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.
ఉగ్రవాదుల దాడులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని ప్రధాని ఉద్ఘాటించారు. దేశం శాంతియుతంగా, భద్రంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త అభివృద్ధి లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన డిఫెన్స్ పెన్షనర్ల చిరకాల డిమాండ్ అయిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. “వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేది మన దేశ సైనికులకు దేశం ఇచ్చిన గౌరవం. అధికారంలోకి రాగానే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు అమలు చేసింది. పథకం వల్ల .70,000 కోట్ల రూపాయలు మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఈ రోజు చేరాయి." అని ప్రధానమంత్రి తెలిపారు. ”అన్నారాయన.
దేశ సరిహద్దుల రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సాయుధ దళాల సిబ్బందికి ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
***
(Release ID: 1948932)
Visitor Counter : 144
Read this release in:
Tamil
,
Kannada
,
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam