ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపుర్ ప్రజల వెన్నంటి భారతదేశం నిలుస్తున్నది:ప్రధాన మంత్రి

Posted On: 15 AUG 2023 8:42AM by PIB Hyderabad

ఈ రోజు న 77 వ స్వాతంత్ర్య దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగిస్తూ, మణిపుర్ ప్రజల వెన్నంటి భారతదేశం నిలబడుతోందన్నారు. అక్కడి సమస్యల కు శాంతియుక్తమైన పరిష్కారం లభించ గలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

మణిపుర్ లో అశాంతి మరియు హింస ల కాలమంటూ వచ్చింది, మరి మహిళ ల గౌరవం పై దాడులు జరుగుతున్న వార్త లు వినవస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మణిపుర్ ప్రజలు గత కొద్ది కాలం నుండి శాంతి ని పరిరక్షిస్తూ వస్తున్నారు కూడా అని ఆయన అంటూ, శాంతి ప్రక్రియ ను ముందుకు తీసుకు పోవాలి అని విజ్ఞ‌ప్తి చేశారు. ‘‘ఆ సమస్యల ను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం లు కలసికట్టు గా కృషి చేస్తున్నాయి, ఇక ముందూ ఇదే విధం గా కృషి చేస్తూ ఉంటాయి.’’ అని ఆయన అన్నారు.

****

DS

 

 


(Release ID: 1948839) Visitor Counter : 119