ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం స్వాతంత్ర్య సంగ్రామం లో పాలుపంచుకొన్నటువంటిప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కి, స్వాతంత్ర్య దినం నాడు ప్రధాన మంత్రి తాను ఇచ్చినఉపన్యాసం లో శ్రద్ధాంజలి ని ఘటించారు


దేశం లోని 140 కోట్ల మంది ప్రజలను ఆయన తన కుటుంబ సభ్యులుఅని పేర్కొన్నారు

Posted On: 15 AUG 2023 8:44AM by PIB Hyderabad

ఈ రోజు న 77వ స్వాతంత్ర్య దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగిస్తూ, తన 140 కోట్ల మంది ‘కుటుంబ సభ్యుల’ కు శుభాకాంక్షల ను తెలియ జేశారు. ఈ వేళ దేశం లో విశ్వాసం తన శిఖర స్థాయి లో ఉంది అని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క స్వాతంత్ర్య సమరం లో పాలు పంచుకొన్న ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. గాంధి మహాత్ముని ఆధ్వర్యం లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి, సత్యాగ్రహ ఉద్యమాన్ని గురించి మరియు భగత్ సింహ్, సుఖ్ దేవ్, ఇంకా రాజ్ గురు లు సహా ఎంతో మంది శూరుల ప్రాణ సమర్పణ ను

గురించి ఆయన గుర్తు కు తీసుకువస్తూ, ఆ తరం లో దాదాపు గా ప్రతి ఒక్కరు కూడాను స్వాతంత్ర్య సంగ్రామం లో పాలుపంచుకొన్నారన్నారు.

ఈ మహత్వపూర్ణ సంవత్సరం లో జరుగబోయే ప్రముఖ వార్షికోత్సవాల ను గురించి ఆయన నొక్కిచెప్పారు. ఈ రోజు తో గొప్ప క్రాంతికారి మరియు ఆధ్యాత్మిక ప్రముఖుడు శ్రీ అరబిందో యొక్క 150వ జయంతి సంవత్సరం ముగిసింది. స్వామి దయానంద జయంతి యొక్క 150వ సంవత్సరం గురించి, రాణి దుర్గావతి యొక్క 500వ జయంతి ని గురించి ఆయన ప్రస్తావించి ఈ ఉత్సవాల ను హర్షోల్లాసాల తో పాటించడం జరుగుతుందన్నారు. భక్తి యోగానికి చెందినటువంటి అత్యుత్తమ వ్యక్తి సంత్ మీరా బాయి యొక్క 525 సంవ్సరాల పూర్వపు గాథ ను గురించి సైతం ఆయన ప్రస్తావించారు. ‘‘రాబోయే గణతంత్ర దినం కూడాను 75వ గణతంత్ర దినం కానుంది’’ అని ఆయన అన్నారు. అనేక కోణాల లో, అనేక అవకాశాలు, అనేక సంభావ్యత లు, ప్రతి ఒక్క క్షణం సరిక్రొత్త ప్రేరణ, అనుక్షణం నూతన చైతన్యం, క్షణ క్షణం కలలు, ప్రతి ఒక్క క్షణమూ సంకల్సం, బహుశా దేశం నిర్మాణం లో తలమునుకలు అయ్యేటందుకు దీని ని మించినటువంటి మరే సందర్భం తటస్థించదేమో.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

***



(Release ID: 1948834) Visitor Counter : 98