వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఉల్లి బఫర్ నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలను విడుదల చేసిన కేంద్రం
- ఉల్లి ధరల హెచ్చుతగ్గులను నియంత్రించే ధరల స్థిరీకరణ నిధి కింద భారత ప్రభుత్వం ఉల్లి బఫర్‌ను నిర్వహిస్తోంది
Posted On:
11 AUG 2023 12:33PM by PIB Hyderabad
ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడిన 3.00 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల బఫర్ నుండి తాజాగా నిల్వలను విడుదల చేయడాన్ని ప్రారంభించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ 10.08.2023న నాఫెడ్ మరియు ఎన్.సి.సి.ఎఫ్. మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. మార్కెట్ డిస్పోజల్ సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు. రిటైల్ ధరలు ఆల్-ఇండియా సగటు కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాలలో కీలక మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ఉల్లి నిల్వలను విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గత నెల మరియు సంవత్సరంలో ధరల పెరుగుదల రేట్లు థ్రెషోల్డ్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇ-వేలం ద్వారా డిస్పోజల్ మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో రిటైల్ విక్రయాలు కూడా అన్వేషించబడుతున్నాయి. వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిపాయలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ధరలు మరియు లభ్యత పరిస్థితులతో డిస్పోజల్ యొక్క పరిమాణం మరియు వేగం కూడా క్రమాంకనం చేయబడుతుంది. మార్కెట్ డిస్పోజల్ కాకుండా, రాష్ట్రాలకు వారి వినియోగదారుల సహకార సంఘాలు మరియు కార్పొరేషన్ల రిటైల్ అవుట్లెట్ల ద్వారా విక్రయించడానికి తగ్గింపు ధరలకు అందించాలని కూడా నిర్ణయించారు. మార్కెట్ డిస్పోజల్ కాకుండా రాష్ట్రాలకు వారి వినియోగదారుల సహకార సంఘాలు మరియు కార్పొరేషన్ల రిటైల్ అవుట్లెట్ల ద్వారా విక్రయించడానికి.. తగ్గింపు ధరలకు అందించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుత సంవత్సరంలో, బఫర్ కోసం మొత్తం 3.00 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని సేకరించారు, పరిస్థితిని బట్టి దానిని మరింత పెంచవచ్చు. రెండు కేంద్ర నోడల్ ఏజెన్సీలు.. అవి నాఫెడ్ మరియు ఎన్.సి.సి.ఎఫ్. మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ నుండి జూన్ మరియు జూలైలో ఒక్కొక్కటి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని సేకరించాయి. ఈ సంవత్సరం, నిల్వ నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సహకారంతో పైలట్ ప్రాతిపదికన ఉల్లికి రేడియేషన్ కూడా చేపట్టారు. సుమారు 1,000 ఎంటీలు రేడియేషన్ చేయబడింది మరియు నియంత్రిత వాతావరణ నిల్వలో నిల్వ చేయబడింది .ఉల్లి ధరల అస్థిరతను తనిఖీ చేసేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద ప్రభుత్వం ఉల్లి బఫర్‌ను నిర్వహిస్తోంది. లీన్ సీజన్లో ప్రధాన వినియోగ కేంద్రాలలో విడుదల చేయడానికి రబీ పంట నుండి ఉల్లిపాయలను సేకరించడం ద్వారా వార్షిక బఫర్లను నిర్మించారు. గత నాలుగు సంవత్సరాలలో ఉల్లిపాయ బఫర్ పరిమాణం మూడు రెట్లు పెరిగింది; 2020-21లో 1.00 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2023-24లో 3.00 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిపాయల లభ్యతను నిర్ధారించడంలో మరియు ధర స్థిరత్వాన్ని కొనసాగించడంలో ఉల్లి బఫర్ కీలక పాత్ర పోషిస్తోంది.
*****
(Release ID: 1948045)
Visitor Counter : 165