ప్రధాన మంత్రి కార్యాలయం

మహిళల సశక్తీకరణ పై జి-20 మంత్రుల స్థాయి సమావేశం గుజరాత్ లోని గాంధీనగర్ లోజరుగ గా ఆ కార్యక్రమం లోవీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం

Posted On: 02 AUG 2023 12:19PM by PIB Hyderabad

మహానుభావులారా, మహిళ లు మరియు సజ్జనులారా, నమస్కారం.

గాంధీ మహాత్ముని పేరిట ఏర్పాటైన గాంధీనగర్ లోకి మీకు అందరికి గాంధీనగర్ ఏర్పాటైన రోజు న నేను స్వాగతం పలుకుతున్నాను. అహమదాబాద్ లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించే అవకాశం మీకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం, యావత్తు ప్రపంచం జలవాయు పరివర్తన ను గురించి, గ్లోబల్ వార్మింగు ను గురించి మరియు దీర్ఘకాలం మనుగడ లో ఉండే పరిష్కార మార్గాల ను వెతకవలసిన అత్యావశ్యకత ను గురించి చర్చిస్తున్నది. గాంధీ ఆశ్రమం లో మీరు గాంధీ గారి సీదాసాదా జీవన శైలి ని గురించి మరియు దీర్ఘకాలం మనుగడ లో ఉండేటటువంటి ఆయన దూరదర్శి ఆలోచనల ను గురించి ఆత్మనిర్భరత గురించి మరియు సమానత్వం గురించి ప్రత్యక్ష అనుభూతి ని పొందవచ్చు. ఆ విషయాలు మీకు తప్పక ప్రేరణదాయకమైనవి గా ఉంటాయి అని నేను అనుకొంటున్నాను. దాండి కుటీర్ మ్యూజియమ్ లో సైతం మీరు ఇదే తరహా అనుభూతి ని పొందవచ్చును, ఈ అవకాశాన్ని మీరు జారవిడుచుకోకండి. గాంధీ గారి కి చెందిన ప్రసిద్ధమైనటువంటి చరఖా.. అదే నూలు ను వడికే చక్రాన్ని దగ్గరలో ఉన్న ఒక పల్లె లో గంగాబెన్ అనే మహిళ మొదట కనుగొన్న సంగతి ని నేను ప్రస్తావించడం అసందర్భం అయిందేమీ కాదు. మీకు అందరికి తెలిసిన విషయం ఏమిటి అంటే అది అప్పటి నుండి గాంధీ గారు ఎల్లవేళ ల ఖాదీ దుస్తుల ను ధరిస్తూ వచ్చారు అనేదే. ఖాదీ ఆత్మనిర్భరత కు మరియు సస్టేనబలిటీ కి ఒక సంకేతం గా మారిపోయింది.

మిత్రులారా,

ఎప్పుడైతే మహిళ లు సమృద్ధం అవుతారో అప్పుడు ప్రపంచమూ సమృద్ధం గా అయిపోతుంది. ఆర్థికం గా వారు సశక్తీకరణ చెందడం వృద్ధి కి ఊతాన్ని ఇస్తుంది. వారి కి అందుబాటు లోకి విద్య వచ్చిందా అంటే ప్రపంచ ప్రగతి కి చోదకం గా నిలుస్తుంది. వారి యొక్క నాయకత్వం అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు సాగిపోయేందుకు స్ఫూర్తి ని ప్రసాదిస్తుంది. మరి వారి అభిప్రాయాలు సకారాత్మకమైనటువంటి పరివర్తన కు ప్రేరణ ను అందిస్తాయి. మహిళల సారధ్యం లో అభివృద్ధి సాధన అనేటటువంటి మార్గాన్ని అనుసరించడం ద్వారా మహిళల సశక్తీకరణ కు అది ఒక అత్యంత ప్రభావంతం అయినటువంటి పద్ధతి గా ఉంటుంది. భారతదేశం ఈ దిశ లో పెద్ద అంగలను వేసుకొంటూ సాగిపోతున్నది.

మిత్రులారా,

భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము స్వయం గా ఒక ప్రేరణ దాయకమైనటువంటి ఉదాహరణ ను ఇచ్చారు. ఆవిడ ఒక వినమ్రమైనటువంటి ఆదివాసి నేపథ్యం కలిగినటువంటి వారు. అయితే, ప్రస్తుతం ప్రపంచం లో అతి పెద్దది అయిన ప్రజాస్వామ్యాని కి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ప్రపంచం లో కెల్లా రెండో అతి పెద్దది అయినటువంటి రక్షణ బలగాలకు సర్వోన్నత కమాండర్ గా కూడా సేవల ను అందిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జనని అయినటువంటి ఈ దేశం లో వోటు వేసే హక్కును భారతదేశ రాజ్యాంగం ఆది నుండి మహిళలు సహా దేశ పౌరులు అందరికీ సమానం గా ధారదత్తం చేసింది. ఎన్నికల లో పోటీ చేసేందుకు హక్కు ను కూడా సమ ప్రాతిపదికన కల్పించడం జరిగింది. ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఆర్థికపరమైన, పర్యావరణం సంబంధమైన మరియు సామాజిక పరివర్తన తాలూకు కీలక ప్రతినిధులు గా ఉంటూ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల లో ఎన్నికైన ప్రతినిధుల లో 46 శాతం మంది ప్రతినిధులు గా మహిళలే ఉన్నారు. వారి సంఖ్య 1.4 మిలియన్ గా ఉంది. స్వయం సహాయ సమూహాల లో మహిళల ను సభ్యత్వం తీసుకొనేటట్లుగా చూడడం వల్ల కూడా మార్పున కు ఒక శక్తివంతమైనటువంటి దళాన్ని ఏర్పరచినట్లయింది. మహమ్మారి విజృభించిన కాలంలో ఈ స్వయం సహాయ సమూహాల కు తోడు ఎన్నికైన మహిళా ప్రతినిధులు మా సముదాయాల కు ప్రధానమైన సమర్థన ను అందించారు. వారు మాస్కుల ను మరియు శానిటైజర్ లను తయారు చేయడం తో పాటు సంక్రమణ నిరోధాన్ని గురించిన చైతన్యాన్ని కూడా వ్యాప్తి చేశారు. భారతదేశం లో నర్సుల లో మరియు ప్రసూతి సంబంధి వైద్య చికిత్స ను అందిస్తున్న వారిలో 80 శాతాని కి పైగా మహిళలే ఉన్నారు. మహమ్మారి కాలం లో వారు మాకు రక్షణ తాలూకు ప్రథమ పంక్తి వలే మెలగారు. మరి వారి కార్యసాధనల ను చూసుకొని మేం గర్వపడుతున్నాం.

మిత్రులారా,

మహిళల నాయకత్వం లో అభివృద్ధి సాధన అనేది భారతదేశం లో మాకు ఒక కీలకమైన ప్రాధాన్య అంశం గా ఉంది. ప్రధాన మంత్రి ముద్ర యోజన లో భాగం గా దాదాపు గా 70 శాతం రుణాల ను మహిళల కు మంజూరు చేయడమైంది. ఈ రుణాలు సూక్ష్మ స్థాయి యూనిట్ లకు అండదండల ను అందించడాని కి ఉద్దేశించిన ఒక మిలియన్ రూపాయల లోపు రుణాలు అని చెప్పాలి. అదే విధం గా స్టాండ్-అప్ ఇండియా లో 80 శాతం మంది లబ్ధిదారులు గా మహిళలే లెక్క కు వస్తున్నారు. వారు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుండి రుణాల ను తీసుకొంటున్నారు. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన లో భాగం గా ఇంచుమించు ఒక వంద మిలియన్ వంట గ్యాస్ కనెక్శన్ లను గ్రామీణ ప్రాంతాల మహిళల కు అందించడమైంది. స్వచ్ఛమైన వంట ఇంటి ఇంధనం అందుబాటు లోకి వచ్చిందా అంటే అది నేరు గా పర్యావరణాన్ని ప్రభావితం చేయడం తో పాటుగా మహిళల ఆరోగ్యాన్ని కూడాను మెరుగు పరుస్తుంది. పారిశ్రామిక శిక్షణ సంస్థల లో సాంకేతిక విద్య ను అభ్యసిస్తున్న మహిళల సంఖ్య 2014 వ సంవత్సరం తరువాత నుండి రెట్టింపు అయింది.

 

మరి భారతదేశం లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, ఇంకా గణిత శాస్త్రం (ఎస్ టిఇఎమ్) పట్టభద్రుల లో 43 శాతం పట్టభద్రులు గా మహిళలు ఉన్నారు. భారతదేశం లోని అంతరిక్ష శాస్త్రవేత్తల లో ఇంచుమించు నాలుగింట ఒక వంతు మంది అంతరిక్ష శాస్త్రవేత్తలు గా మహిళ లు ఉన్నారు. చంద్రయాన్, గగన్ యాన్ యు మిశన్ మార్స్ వంటి మా ప్రతిష్టాత్మక కార్యక్రమాల సాఫల్యం వెనుక మహిళా శాస్త్రవేత్తల ప్రతిభ మరియు కఠోర శ్రమ లు దాగి ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు భారతదేశం లో ఉన్నత విద్య లో ప్రవేశాల ను స్వీకరిస్తున్నారు. పౌర విమానయాన రంగం లో మేం అత్యధిక శాతం మహిళా పైలట్ లను కలిగి ఉన్న దేశాల లో ఒక దేశం గా ఉన్నాం. ఇంకా, భారతీయ వాయు సేన లో పనికి కుదిరిన మహిళా పైలెట్ లు ప్రస్తుతం యుద్ధ విమానాల ను నడుపుతున్నారు. మా సాయుధ దళాల లో మహిళా అధికారుల ను నిర్వహణ భూమికల లోను, పోరాట వేదికల లోను మోహరించడం జరుగుతోంది.

మిత్రులారా,

భారతదేశం లో మరియు గ్లోబల్ సౌథ్ దేశాల లో మహిళ లు గ్రామీణ వ్యవసాయ కుటుంబాల కు వెన్నెముక వంటి కీలక పాత్ర ను పోషించడం, అలాగే చిన్న వ్యాపారులు గా మరియు దుకాణాదారులు గా ఉండడం జరుగుతోంది. ప్రకృతి తో వారికి గల సన్నిహిత అనుబంధాన్ని పట్టి చూసినప్పుడు మహిళ లు జలవాయు పరివర్తన కు వినూత్న పరిష్కారాల ను కనుగొనడంలో కీలక భూమిక ను పోషించ గలుగుతారు. భారతదేశం లో 18 వ శతాబ్దం లో మొట్ట మొదటిసారి గా చెప్పుకోదగినటువంటి శీతోష్ణస్థితి సంబంధి కార్యాచరణ కు నడుం బిగించింది మహిళలే అని నాకు స్ఫురణ కు వస్తున్నది. రాజస్థాన్ లోని బిష్ణోయి సముదాయం అమృత దేవి గారి నాయకత్వం లో చిప్ కో ఆందోళనను మొదలు పెట్టారు. ఆ ఉద్యమం లో అడ్డూ ఆపు లేని విధం గా చెట్ల కాండాల ను నరికి వేయడాన్ని ప్రతిఘటించడం కోసం మహిళలు వృక్షాల ను హత్తుకొని నిలబడేవారు. అనేక మంది ఇతర పల్లెవాసుల తో పాటుగా ఆమె ప్రకృతి సంరక్షణ ఆశయ సాధన లో తన జీవనాన్ని అర్పణం చేసివేశారు. భారతదేశం లో మహిళ లు మిశన్ లైఫ్ - లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్కు ప్రధాన ప్రచారకర్తలు గా కూడా ఉంటూ వచ్చారు. వారు సాంప్రదాయిక జ్ఞానం పై ఆధారపడి, రెడ్యూస్, రీ యూస్, రీ సైకిల్, ఇంకా రీ-పర్పస్ లకై ముందడుగులను వేస్తున్నారు. అనేక కార్యక్రమాల లో భాగం గా మహిళ లు సౌర ఫలకాల తయారీ లో మరియు దీపాల తయారీ లో చురుకు గా శిక్షణ ను పొందుతున్నారు. సోలర్ మామాస్గ్లోబల్ సౌథ్ లోని మా భాగస్వామ్య దేశాల తో ఫలప్రదం అయినటువంటి సహకారాన్ని అందిస్తున్నారు.

మిత్రులారా,

మహిళా నవ పారిశ్రమికులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు గణనీయమైన తోడ్పాటు ను అందిస్తున్నారు. భారతదేశం లో మహిళా నవ పారిశ్రమికుల భూమిక క్రొత్తది ఏమీ కాదు. దశాబ్దాల క్రిందటే, 1959 వ సంవత్సరం లో, ముంబయి లోని గుజరాత్ కు చెందిన మహిళ లు ఏడుగురు కలసి ఒక చరిత్రాత్మకమైనటువంటి సహకార ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అదే శ్రీ మహిళా గృహ ఉద్యోగ్. అప్పటి నుండి అది మిలియన్ ల కొద్దీ మహిళల మరియు వారి కుటుంబాల జీవనం రూపు రేఖల ను మార్చివేసింది. వారి అత్యంత ప్రసిద్ధి ని పొందిన ఉత్పత్తి ‘లిజ్జత్ పాపడ్’ గుజరాత్ లో మీరు ఆరగించే ఆహార పదార్థాల లో బహుశా చేరే ఉంటుంది. మా సహకార ఉద్యమం తాలూకు మరొక విజయ గాథ పాడి రంగం లో నమోదు అయింది. దీనిని కూడా మహిళలే లిఖించారు. ఒక్క గుజరాత్ రాష్ట్రం లోనే 3.6 మిలియన్ మహిళలు పాడి రంగం లో భాగస్వాములు ఉన్నారు. భారతదేశం అంతటా చూసినట్లయితే అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు ఎన్నెన్నో ఉన్నాయి. భారతదేశం లో దాదాపు గా 15 శాతం యూనికార్న్ స్టార్ట్-అప్స్ సభ్యుల లో కనీసం ఒక మహిళ కూడా ఉంటారు. మహిళల నాయకత్వం లోని ఈ యూనికార్న్ ల ఉమ్మడి విలువ 40 బిలియన్ డాలర్ లకు మించిపోయింది. ఏమైనప్పటికీ మన లక్ష్యమల్లా మహిళా కార్యసాధకులు ఒక రివాజు గా ఉండేటటువంటి ఒక సమతలమైన వేదిక ను ఏర్పాటు చేయాలి అనేదే కావాలి. బజారుల కు, గ్లోబల్ వేల్యూ చైన్ లకు మరియు భరించ గలిగే ఖర్చు లో ఆర్థిక సహాయం లభించేటందుకు వారికి ఎటువంటి అడ్డంకులు ఎదురవకుండా చూసేందుకు మనం తప్పక కృషి చేయాలి. అదే కాలం లో, సంరక్షణ భారం మరియు గృహ సంబంధ కార్యాల భారం .. ఈ అంశాలకు సముచితమైన రీతి న పరిష్కారం లభించే విధం గా మనం పూచీ పడవలసి ఉంది.

మహానుభావులారా,

మహిళలు నవ పారిశ్రమికవేత్తలు గా కొనసాగడం, మహిళల సారథ్యం మరియు మహిళల విద్యార్జన అనే అంశాల పై మీరు శ్రద్ధ వహిస్తుండడం అభినందనీయం. మహిళల లో డిజిటల్ లిటరసీ ని, ఇంకా ఫినాన్శల్ లిటరసీ ని వృద్ధి చెందింప చేయడం కోసం టెక్-ఎక్విటి ప్లాట్ ఫార్మ్ను మీరు ప్రవేశపెట్టడం చూస్తే నాకు కూడా సంతోషం కలుగుతున్నది. జి-20 కి భారతదేశం అధ్యక్ష స్థానం వహిస్తున్న కాలం లో మహిళల సశక్తీకరణఅంశం లో ఒక క్రొత్త వర్కిగ్ గ్రూపు ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం కూడా నాకు సంతోషాన్నిస్తోంది. గాంధీనగర్ లో మీరు అవిశ్రాంతం గా చేస్తున్న ప్రయాస లు ప్రపంచవ్యాప్తం గా మహిళల కు ఎంతో ఆశ ను మరియు ఆత్మవిశ్వాన్ని అందించగలుగుతాయి. ఒక సార్థకమైన మరియు ఫలప్రదమైన సమావేశం జరగాలని కోరుకొంటూ మీకు అందరి కి ఇవే నా శుభాకాంక్ష లు.

మీకు ధన్యవాదాలు.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

***



(Release ID: 1946971) Visitor Counter : 94