వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
7వ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
స్టార్టప్ లు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య సహకారాన్ని సులభతరం చేయడానికి భారతదేశం 2023లో బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్ ను ప్రారంభిస్తుంది... : శ్రీ పీయూష్ గోయల్
ప్రపంచ సంక్షేమం "వసుధైక కుటుంబకం" స్ఫూర్తితో భారతదేశం పనిచేస్తుంది.. శ్రీ పీయూష్ గోయల్
బ్రిక్స్ దేశాల మధ్య డిజిటలైజేషన్, పారిశ్రామీకరణ, సృజనాత్మకత, సమ్మిళిత విధానం, పెట్టుబడుల ఆవశ్యకతను ప్రస్తావించిన బ్రిక్స్ పరిశ్రమల మంత్రులు
Posted On:
08 AUG 2023 12:19PM by PIB Hyderabad
దక్షిణాఫ్రికా అధ్యక్షతన వర్చువల్ విధానంలో నిన్న వర్చువల్ విధానంలో జరిగిన "7వ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల" సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, జౌళి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు. 2023లో బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్ ను భారత్ ప్రారంభిస్తుందని శ్రీ గోయల్ ప్రకటించారు స్టార్టప్ లు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం, ఉత్తమ విధానాలు పంచుకునే లక్ష్యంతో బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్ ను ప్రారంభించాలని నిర్ణయించామని శ్రీ గోయల్ తెలిపారు.
భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని శ్రీ గోయల్ వివరించారు. దేశంలో స్టార్టప్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపిన శ్రీ గోయల్ ప్రస్తుతం దాదాపు 100,000 స్టార్టప్ లు ఏర్పాటయ్యాయని వివరించారు. దేశంలో అమలు జరుగుతున్న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఆయన వివరించారు. ఉత్పత్తి విధానంలో భారతదేశం తీసుకు వచ్చిన మార్పులు వివరించిన మంత్రి తన అనుభవాలను బ్రిక్స్ దేశాలు, ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని తెలిపారు.
"వసుధైక కుటుంబకం" ('ప్రపంచం ఒకే కుటుంబం') స్ఫూర్తితో భారతదేశం పనిచేస్తుందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన దేశంగా పనిచేస్తూ మరింత సమ్మిళిత, సహనశీల, పరస్పర అనుసంధానిత ప్రపంచం కోసం పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.
బ్రిక్స్ దేశాల పరిశ్రమల మంత్రులు (బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా) కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సంయుక్త ప్రకటనను ఆమోదించింది.
బ్రిక్స్ దేశాల మధ్య డిజిటలైజేషన్,పారిశ్రామికీకరణ, ఆవిష్కరణలు, సమగ్ర విధానం అవసరమని మంత్రులు స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆవశ్యకతను మంత్రులు పునరుద్ఘాటించారు.ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ప్రాధాన్యత, పరిశ్రమ 4.0 అవసరాన్ని మంత్రులు వివరించారు.అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలను ఆర్థిక రంగంలో ప్రవేశ పెట్టాలన్నారు. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్రిక్స్ దేశాల మంత్రులు తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.నైపుణ్యాభివృహ్ది, అభివృద్ధి రంగాలలో కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలు గుర్తించాలని మంత్రులు అంగీకరించారు. .బహిరంగ, నిష్పాక్షిక, శక్తివంతమైన, స్థితిస్థాపక మరియు వివక్ష రహిత వాతావరణాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించాలని సమావేశం నిర్ణయించింది. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధిని వేగవంతం చేయడానికి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు అంగీకరించారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కీలక పాత్రను, ప్రపంచ పారిశ్రామిక , సరఫరా వ్యవస్థ, విలువ ఆధారిత వాటి ఏకీకరణ, వైవిధ్యత ప్రాముఖ్యతను మంత్రులు గుర్తించారు.
మహిళలు, యువత యాజమాన్యంలో/నిర్వహించే ప్రాజెక్టుల సమ్మిళిత వృద్ధి కోసం బ్రిక్స్ దేశాల్లో మార్కెట్ అవకాశాలను కల్పించాల్సి ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు.
***
(Release ID: 1946651)
Visitor Counter : 104