సహకార మంత్రిత్వ శాఖ

ఆగస్టు 6 ఆదివారం పూణేలో సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సిఆర్‌సిఎస్) కార్యాలయ డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించనున్న కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశంలో "సహకార్ సే సమృద్ధి"పై దృఢ విశ్వాసాన్ని చూపుతూ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిన సహకార మంత్రిత్వ శాఖ

సహకార రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కార్యాలయ కంప్యూటరీకరణ

సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం యొక్క కంప్యూటరీకరణ యొక్క ప్రధాన లక్ష్యాలు పూర్తిగా కాగిత రహిత అప్లికేషన్, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ (ఎంఎస్‌సిఎస్‌ చట్టం) మరియు నియమాలకు స్వయంచాలకంగా సమ్మతించడం, సులభంగా వ్యాపారాన్ని నిర్వహించడం, డిజిటల్ కమ్యూనికేషన్ మరియు పారదర్శక ప్రాసెసింగ్

ఈ కంప్యూటరీకరణ ప్రాజెక్ట్ కొత్త ఎంఎస్‌సిఎస్ నమోదులో సహాయకరంగా ఉంటుంది మరియు వాటి పనితీరును సులభతరం చేస్తుంది

Posted On: 05 AUG 2023 12:26PM by PIB Hyderabad

కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఆదివారం ఆగస్ట్ 6న పూణేలో సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సిఆర్‌సిఎస్‌) కార్యాలయ  డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క "సహకార్ సే సమృద్ధి" విజన్‌పై దృఢ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ దిశలో భాగంగా సహకార రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని కంప్యూటరీకరిస్తున్నారు.

సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం యొక్క కంప్యూటరీకరణ ప్రధాన లక్ష్యాలు:

i. పూర్తి పేపర్‌లెస్ అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్

ii. సాఫ్ట్‌వేర్ ద్వారా మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ (ఎంఎస్‌సిఎస్‌ చట్టం) మరియు నియమాలకు స్వయంచాలకంగా సమ్మతి

iii. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరుస్తుంది

iv. డిజిటల్ కమ్యూనికేషన్

v. పారదర్శక ప్రాసెసింగ్

vi. మెరుగైన విశ్లేషణలు మరియు ఎంఐఎస్ (నిర్వహణ సమాచార వ్యవస్థలు)

కింది మాడ్యూల్స్ సెంట్రల్ రిజిస్ట్రార్ పోర్టల్‌లో చేర్చబడతాయి:

i. నమోదు

ii. బై చట్టాల సవరణ

iii. వార్షిక రిటర్న్ ఫైలింగ్

iv. అప్పీల్ చేయడం

v. ఆడిట్

vi. తనిఖీ

vii. విచారణ

viii. మధ్యవర్తిత్వం

ix. వైండింగ్ అప్ & లిక్విడేషన్

x అంబుడ్స్‌మన్

xi ఎన్నికలు

కొత్త పోర్టల్ ఎంఎస్‌సిఎస్ చట్టం, 2002 మరియు దాని నియమాలకు ఇటీవల ఆమోదించబడిన సవరణలను కూడా కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్ వర్క్ ఫ్లో ద్వారా పోర్టల్ సమయానుకూలంగా అప్లికేషన్‌లు/సేవా అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తుంది. ఇది ఓటిపి ఆధారిత వినియోగదారుల నమోదు,ఎంఎస్‌సిఎస్ చట్టం మరియు నిబంధనలకు అనుగుణంగా ధ్రువీకరణ తనిఖీలు, వీడియో కాన్ఫరెన్స్ , రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కోసం నిబంధనలను కలిగి ఉంటుంది. కంప్యూటరీకరణ యొక్క ఈ ప్రాజెక్ట్ కొత్త ఎంఎస్‌సిఎస్ నమోదులో సహాయకరంగా ఉంటుంది మరియు వాటి పనితీరును సులభతరం చేస్తుంది.

దేశంలో 1550 కంటే ఎక్కువ మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు (ఎంఎస్‌సిఎస్) నమోదయ్యాయి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎంఎస్‌సిఎస్) చట్టం, 2002 నిర్వహణకు సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం బాధ్యత వహిస్తుంది. బహుళ రాష్ట్ర సహకార సంస్థల కార్యకలాపాలన్నింటినీ సులభతరం చేయడానికి మరియు కొత్త వాటి నమోదుతో సహా డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం కంప్యూటరైజ్ చేయబడింది.

కొత్తగా అభివృద్ధి చేసిన సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోర్టల్ డ్యాష్‌బోర్డ్‌ను నిర్మించడంలో యువత భాగస్వామ్యాన్ని మరియు ఆలోచనలను ఆహ్వానించడానికి 'హ్యాకథాన్' పోటీ కూడా నిర్వహించింది. దీనితో పాటు కొత్త సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోర్టల్ కోసం అన్ని నేషనల్ కోఆపరేటివ్ సొసైటీలు మరియు మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల నుండి సూచనలు మరియు ఫీడ్‌బ్యాక్‌లు ఆహ్వానించబడ్డాయి.


 

****



(Release ID: 1946174) Visitor Counter : 120