పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశంలో పర్యావరణ అనుకూల ఇంధనాన్ని వినియోగిస్తున్న 86 విమానాశ్రయాలు
55 విమానాశ్రయాల మొత్తం ఇంధన వినియోగంలో పర్యావరణహిత ఇంధన వాటా 100%
పునరుత్పాదక / పర్యావరణహిత వినియోగంపై నిరంతరం దృష్టిని సారిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు
Posted On:
03 AUG 2023 12:56PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 86 విమానాశ్రయాలు పర్యావరణ అనుకూల ఇంధనాన్ని (గ్రీన్ ఎనర్జీ) ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయాల మొత్తం ఇంధనం వినియోగంలో 55 విమానాశ్రయాలకు పర్యావరణ అనుకూల ఇంధనం వినియోగ వాటా 100% ఉంది. ఈ విమానాశ్రయాల జాబితా అనుబంధంలో జతపరచడమైంది.
ఏది ఏమైనప్పటికీ, సాంప్రదాయ ఇంధన వనరులను ఉపయోగించడం విమానాశ్రయాలలో కార్బన్ ఉద్గారానికి ప్రధాన వనరుగా ఉంది. అందువల్ల పునరుత్పాదకం కాని ఇంధనానికి బదులుగా పర్యావరణ అనుకూల ఇంధనాన్ని అందించడం విమానాశ్రయం కార్బన్ జాడలను తగ్గించడంలో సహాయపడుతోంది.
కనుక, ఎంఒసిఎ షెడ్యూల్డ్ కార్యకలాపాలతో కూడిన అన్ని కార్యాచరణ విమానశ్రయాలు, నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను నిర్మిస్తున్నవారు పర్యావరణ అనుకూల ఇంధనంతో కర్బన తటస్తను & నెట్ జీరోను సాధించే దిశగా పని చేయాలని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు నిరంతరం పునరుత్పాదక/ పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ఉపయోగించడంపై నిరంతరం దృష్టి పెడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ) అక్రెడిటేషన్ కార్యక్రమం ప్రకారం హీత్రూ, బ్రిస్టల్, యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లోని లండన్ గాట్విక్, నెదర్లాండ్స్ అమ్‌స్టర్‌డామ్, గ్రీసులో ఏథెన్స్, నార్వేలోని ఓస్లో, బెల్జియంలోని బ్రుసెల్స్, హంగరీలోని బుడాపెస్ట్, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్, యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ డీగో, కెనెడాలోని వాంకూవర్, యునైటెడ్ ఎమిరైట్స్‌లోని షార్జా తదితర విమానాశ్రయాలు పర్యావరణ అనుకూల/ పునరుత్పాదక ఇంధనం సహా పలు చర్యలను తీసుకోవడం ద్వారా కర్బన తటస్తను సాధించాయి.
ఈ సమాచారాన్ని పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) లోక్‌సభలో గురువారం అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1945600)
Visitor Counter : 150