ఉక్కు మంత్రిత్వ శాఖ
జులై 2023లో రికార్డు స్థాయి ఉత్పత్తి, విక్రయాలను సాధించిన ఎంఒఐఎల్
प्रविष्टि तिथि:
03 AUG 2023 11:53AM by PIB Hyderabad
భారత్‌లో మాంగనీస్ ధాతువు అతిపెద్ద ఉత్పత్తిదారు అయిన ఎంఒఐఎల్ లిమిటెడ్, దానిని ప్రారంభించిన నాటి నుంచి జులై మాసంలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది.గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 71% వృద్ధిని నమోదు చేస్తూ జులై 2023లో కంపెనీ 1.20 లక్షల టన్నుల మాంగనీసును ఉత్పత్తి చేసింది. తన చరిత్రలో ఎంఒఐఎల్ జులై మాసంలో చేసిన ఉత్పత్తిలో ఇది అత్యధికం.
అంతేకాకుండా, 2023 జులై మాసంలో 0.94 లక్షల టన్నుల అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 69% ఆకట్టుకునే వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన మాంగనీస్ ధాతువుకు గల డిమాండ్‌ను విక్రయాలు ప్రతిఫలిస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 1945599)
आगंतुक पटल : 143