ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర లోని పుణె లో లోక్ మాన్య తిలక్ జాతీయపురస్కారాన్ని ప్రధాన మంత్రి కి ఇవ్వడమైంది
పురస్కారాన్ని 140 కోట్ల మంది పౌరుల కు ఆయన అంకితంచేశారు
నగదు బహుమతి ని ‘నమామి గంగే’ పథకాని కి విరాళం గా ఇచ్చారు
‘‘లోక్ మాన్య తిలక్గారు భారతదేశం యొక్క సాతంత్య్ర పోరాటానికి ‘తిలకం’ గా ఉన్నారు’’
‘‘లోక్ మాన్య తిలక్గారు ఒక గొప్ప సంస్థ ను నిర్మించారు; సంప్రదాయాల ను పెంచి పోషించారు కూడాను’
‘‘భారతదేశం పౌరులలో ఆత్మన్యూనత భావం తాలూకు అపోహ ను తిలక్ గారు ఛేదించడంతోపాటు గా వారి సామర్థ్యాల పట్లవారికి విశ్వాసాన్ని పాదుగొల్పారు’’
‘‘భారతదేశం విశ్వాసం సంబంధి లోటు నుండి విశ్వాసం సంబంధి మిగులు వైపు తరలింది’’
‘‘ప్రజల లోవిశ్వాసాన్ని వృద్ధి చెందింప చేయడం అనేది భారతదేశం ప్రజల పురోగతి మాధ్యం గా మారుతోంది’’
Posted On:
01 AUG 2023 2:01PM by PIB Hyderabad
లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మహరాష్ట్ర లోని పుణె లో ఈ రోజు న ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారాన్ని లోక్ మాన్య తిలక్ గారి వారసత్వాన్ని సమ్మానించడం కోసం తిలక్ స్మారక్ మందిర్ ట్రస్టు 1983 వ సంవత్సరం లో ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి తన కు లభించిన నగదు బహుమతి ని ‘నమామి గంగే’ పథకాని కి విరాళం గా ఇచ్చారు.
ప్రధాన మంత్రి కార్యక్రమ స్థలాని కి చేరుకొని లోక్ మాన్య తిలక్ గారి ప్రతిమ కు పుష్పాంజలి ని సమర్పించారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, లోక్ మాన్య తిలక్ గారి వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ఈ రోజు తనకు ఒక విశిష్ఠమైనటువంటి రోజు అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో తన లో కలిగిన అనుభూతుల ను ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, ఈ దినం లోక్ మాన్య తిలక్ గారి వర్ధంతి, ఈ రోజు న అన్నాభావూ సాఠే జయంతి కూడా అని పేర్కొన్నారు. ‘‘లోక్ మాన్య తిలక్ గారు భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటం లో ‘నుదుటి తిలకం’ గా నిలచారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం యొక్క సంస్కరణ దిశ లో అన్నాభావూ సాఠే గారు అందించిన తోడ్పాటు అసాధారణమైంది, సాటి లేనటువంటిది అని కూడా ఆయన నొక్కి పలికారు. ఛత్రపతి శివాజి గారు, చాఫేకర్ సోదరులు, జ్యోతిబా ఫులే గారు మరియు సావిత్రిబాయి ఫులే గారు లకు జన్మ ను ఇచ్చిన ఈ పవిత్రమైనటువంటి గడ్డ కు ప్రధాన మంత్రి వందనాన్ని ఆచరించారు. అంతక్రితం ప్రధాన మంత్రి దగ్ డూ శేఠ్ ఆలయాన్ని దర్శించి దైవాన్ని దీవెన లు కోరారు.
లోక్ మాన్య గారి తో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగివున్నటువంటి స్థలం మరియు సంస్థ ల ద్వారా ఈ రోజు న తనకు దక్కిన సమ్మానం ‘మరచిపోలేని అటువంటిది’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. కాశీ కి మరియు పుణె కు మధ్య ఉన్న పోలికల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ఈ రెండు ప్రజ్ఞ కేంద్రాలు గా ఉన్నాయన్నారు. ఎవరైనా ఒక పురస్కారాన్ని అందుకొన్న వేళ, ప్రత్యేకించి ఆ పురస్కారం లోక్ మాన్య తిలక్ గారి పేరు తో ముడిపడి ఉన్నప్పుడు, ఆ పురస్కార గ్రహీత తాలూకు బాధ్యత లు కూడా వెంట వస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. లోక్ మాన్య తిలక్ పురస్కారాన్ని భారతదేశం లోని 140 కోట్ల మంది పౌరుల కు అంకితం చేస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలియ జేశారు. ప్రజల ఆకాంక్షల ను, కలల ను వారు నెరవేర్చుకోవడం లో వారి కి సాయపడేందుకు ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది అని ఆయన హామి ని ఇచ్చారు. తనకు ఇచ్చిన నగదు బహుమతి ని ‘నమామి గంగే’ ప్రాజెక్టు కు దానం గా ఇవ్వాలని తాను నిర్ణయించుకొన్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు.
భారతదేశం యొక్క స్వాతంత్య్రం సాధన లో లోక్ మాన్య తిలక్ గారి తోడ్పాటు ను కొన్ని మాటల కో, లేదా కొన్ని ఘట్టాల కో పరిమితం చేయజాలం. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటం తాలూకు నాయకుల అందరి మీదా మరియు స్వాతంత్య్ర పోరాటం సంబంధి ఘట్టాలన్నిటి మీదా లోక్ మాన్య తిలక్ గారి ప్రభావం స్పష్టం గా ఉంది కాబట్టి అని ప్రధాన మంత్రి అన్నారు. చివరకు బ్రిటిషు వారు సైతం ఆయన ను ‘‘భారతదేశం యొక్క అలజడి తాలూకు పిత’’ అని వ్యవహరించవలసి వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. లోక్ మాన్య తిలక్ గారు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని వాదించడం ద్వారా స్వాతంత్య్ర పోరాటం యొక్క దిశ ను మార్చివేశారు అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. భారతదేశం లో సంప్రదాయాలు దేశాన్ని వెనుక కు తీసుకు పోయేవి గా ఉన్నాయంటూ బ్రిటిషు వారు ముద్ర వేయడం తప్పు అని తిలక్ నిరూపించారు. గాంధీ మహాత్ముడే స్వయం గా ఆయన ను ఆధునిక భారతదేశం శిల్పి అని పేర్కొన్నారు అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.
లోక్ మాన్య తిలక్ గారి కి సంస్థాగత నిర్మాణం తాలూకు సామర్థ్యాలు ఉన్నాయంటూ ప్రధాన మంత్రి ఆయన కు నమస్సుల ను అర్పించారు. లాలా లాజ్ పత్ రాయ్ గారు మరియు బిపిన్ చంద్ర పాల్ గారు లతో లోక్ మాన్య తిలక్ గారు కలసి పని చేయడం భారతదేశం స్వాతంత్య్ర పోరాటం లో ఒక సువర్ణ అధ్యాయం అని ప్రధాన మంత్రి అన్నారు. తిలక్ గారు వార్తాపత్రికల ను మరియు పత్రికారచన ను ఉపయోగించుకొన్న తీరు ను కూడా ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. కేసరి పత్రిక ఈనాటికీ కూడాను అచ్చవుతోంది; మరి ఈ పత్రిక ను పాఠకులు చదువుతూ వస్తున్నారు. ‘‘ఇది అంతా లోక్ మాన్య తిలక్ గారు కనబరచినటువంటి బలమైన సంస్థాగత నిర్మాణ సామర్థ్యాని కి నిదర్శన గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
తిలక్ గారు సంప్రదాయాల ను పెంచి పోషించారు అని కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ఛత్రపతి శివాజి గారి ఆదర్శాల ను ఉత్సవాల రూపం లో స్మరించుకోవడం కోసం గణపతి మహోత్సవాన్ని మరియు శివ జయంతి వేడుకల నిర్వహణ కు పూనుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో తెలియ జేశారు. ‘‘ఈ కార్యక్రమాలు భారతదేశాన్ని ఒక సాంస్కృతిక బంధం లో పెనవేసేందుకు ఉద్దేశించిన ప్రచార ఉద్యమాలు గానే కాకుండా పూర్ణ స్వరాజ్యం తాలూకు సంపూర్ణ భావన ను ఆవిష్కరించాయి అని ప్రధాన మంత్రి అన్నారు. నాయకులు అనే వారు స్వాతంత్య్రం వంటి ప్రధాన లక్ష్యాల కోసం పోరాడుతూ, అదే కాలం లో సాంఘిక సంస్కరణ ల తాలూకు ప్రచార ఉద్యమాన్ని వారి భుజాల కు ఎత్తుకోవడం అనేది భారతదేశం లో ఒక ప్రత్యేకత గా నిలచింది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
దేశ యువత పట్ల లోక్ మాన్య తిలక్ గారి కి ఉండినటువంటి నమ్మకాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, వీర్ సావర్ కర్ కు ఆయన గురువు గా ఉండి, లండన్ లో రెండు ఉపకార వేతనాలు-ఒకటోది ఛత్రపతి శివాజీ స్కాలర్ శిప్, రెండోది మహారాణా ప్రతాప్ స్కాలర్ శిప్ – ను అందిస్తున్నటువంటి శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ కు సావర్ కర్ పేరు ను సిఫారసు చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. న్యూ ఇంగ్లిష్ స్కూల్, ఫర్గుసన్ కాలేజీ మరియు డెక్కన్ ఎజుకేశన్ సొసైటీ లను పుణె లో నెలకొల్పడం ఇదే దృష్టికోణం లో ఓ భాగం అని ఆయన అన్నారు. ‘‘వ్యవస్థ నిర్మాణం మొదలుకొని సంస్థ నిర్మాణం వరకు, అలాగే సంస్థ నిర్మాణం మొదలుకొని వ్యక్తి నిర్మాణం వరకు, మరియు వ్యక్తి నిర్మాణం మొదలుకొని దేశం నిర్మాణం వరకు చూస్తే ఒక దేశం యొక్క భవిష్యత్తు కు ఉద్దేశించిన ఒక మార్గసూచీ వంటిది అని చెప్పవచ్చు; ఇదే మార్గాన్ని దేశం ప్రస్తుతం ప్రభావశీలమైనటువంటి రీతి లో అనుసరిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
మహారాష్ట్ర ప్రజల కు లోక్ మాన్య తిలక్ గారి తో ఉన్నటువంటి ప్రత్యేకమైన బంధాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఆయనతో గుజరాత్ ప్రజల కు కూడా ఇదే తరహా అనుబంధం ఉంది అన్నారు. లోక్ మాన్య తిలక్ గారు అహమదాబాద్ లోని సాబర్ మతీ జైలు లో సుమారు గా ఒకటిన్నర నెలల పాటు ఉన్న సంగతి ని ఆయన జ్ఞప్తి కి తెస్తూ, తిలక్ గారి కి స్వాగతం పలకాలని 40,000 కు పైగా ప్రజలు తరలివచ్చారు. వారి లో సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ కూడా ఉన్నారు. వారంతా 1916 వ సంవత్సరం లో తిలక్ గారి ఆలోచనల ను ఆలకించారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. లోక్ మాన్య తిలక్ గారి ప్రసంగం సర్ దార్ పటేల్ పై ఎంతటి ప్రభావాన్ని చూపింది అంటే పటేల్ గారు అహమదాబాద్ పురపాలక సంఘాని కి సారథ్యం వహించిన కాలం లో లోక్ మాన్య తిలక్ గారి విగ్రహాన్ని అహమదాబాద్ లో నెలకొల్పేటంత గా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘లోక్ మాన్య తిలక్ గారి కి చెందినటువంటి ఉక్కు పిడికిలి తాలూకు అస్తిత్వాన్ని మనం సర్ దార్ పటేల్ గారి లో చూడవచ్చును’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. విక్టోరియా గార్డెన్ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆ మైదానాన్ని 1897 వ సంవత్సరం లో మహారాణి విక్టోరియా యొక్క వజ్రోత్సవ సందర్భాన్ని స్మరించుకోవడం కోసం బ్రిటిషు వారు అభివృద్ధి పరచారు, మరి అక్కడ లోక్ మాన్య తిలక్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సర్ దార్ పటేల్ గారు ఒక విప్లవాత్మకమైన చర్య కు నడుం కట్టారు అని ప్రధాన మంత్రి చెప్పారు. బ్రిటిషు వారి నుండి ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఆ విగ్రహాన్ని గాంధీ మహాత్ముడు 1929 వ సంవత్సరం లో ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది ఒక బ్రహ్మాండమైన విగ్రహం, అది ఎలా కనిపిస్తుందంటే తిలక్ గారు విశ్రాంతి తీసుకొంటున్న భంగిమ లో ఉంటూ స్వాతంత్య్ర భారతదేశం యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు ను గురించి యోచిస్తున్నారా ఏమిటి అని చూపరుల కు అనిపిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘బానిసత్వం కాలం లో సైతం భారతదేశం యొక్క పుత్రుడి ఆదరణార్థం సర్ దార్ సాహెబ్ యావత్తు బ్రిటిషు పాలన కు సవాల్ విసిరారు’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అలాంటిది, ప్రస్తుత కాలం లో ప్రభుత్వం ఏదైనా ఒక రహదారి కి ఉన్నటువంటి విదేశీ ఆక్రమణదారు పేరు ను మార్చివేసి భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి పేరు ను పెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసిందా అంటే అప్పుడు కొంత మంది గగ్గోలు పెట్టడాన్ని ఆరంభించే స్థితి నెలకొనడం శోచనీయం అని ఆయన అన్నారు.
గీత పట్ల లోక్ మాన్య తిలక్ గారి కి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. మాండలే లో ఖైదు చేసిన కాలం లో సైతం లోక్ మాన్య తిలక్ గారు గీత పఠనాన్ని మానుకోలేదు; అంతేకాదు, గీత రహస్యం అంటూ ఒక అమూల్యమైనటుంటి కానుక ను కూడా ఇచ్చారు అని ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రతి ఒక్క వ్యక్తి లో ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగిన సత్తా లోక్ మాన్య తిలక్ గారి లో ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం ప్రజలు ఉద్యమించేటట్లు గా తిలక్ గారు వారి లో విశ్వాసాన్ని రగుల్కొల్పారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ను, శ్రమికుల ను మరియు నవ పారిశ్రామికవేత్తల ను తిలక్ గారు నమ్మారు. ‘‘భారతీయుల లో ఆత్మన్యూనత భావం తాలూకు అపోహ ను తిలక్ గారు ఛేదించారు, మరి వారి కి ఉన్న సామర్థ్యాల ను ఆయన రుజువు పరచారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
అపనమ్మకం తో కూడిన పరిస్థితుల లో దేశాభివృద్ధి సాధ్యం కాదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పుణె కు చెందిన ఒక సజ్జనుడు శ్రీ మనోజ్ పోచాట్ గారు ప్రధాన మంత్రి కి ఆయన పుణె ను సందర్శించిన సంగతి ని గురించి ఒక ట్వీట్ లో గుర్తు చేయడాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అప్పట్లో, తిలక్ గారు ఫర్గుసన్ కాలేజీ ని స్థాపించిన కాలం లో భారతదేశం లో విశ్వాస లోపం ఏర్పడ్డ సంగతి ని గురించి నేను (ప్రధాన మంత్రి) మాట్లాడాను. విశ్వాస లోపం అంశాన్ని తిరిగి లేవనెత్తినందుకు ప్రధాన మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. దేశం విశ్వాస లోపం స్థాయి నుండి విశ్వాసాని కి సంబంధించిన మిగులు స్థాయి కి చేరుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు.
- తొమ్మిది సంవత్సరాల లో తెర మీదకు వచ్చిన ప్రధానమైన మార్పుల లో విశ్వాసం సంబంధి మిగులు యొక్క ఉదాహరణల ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. భారతదేశం అయిదో అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థ గా రూపుదిద్దుకొంటూ ఉండడం అనేది ఈ యొక్క విశ్వాసం తాలూకు ఫలితం అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం పట్ల దేశాని కి ఉన్న నమ్మకాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భం లో భారతదేశం లో తయారైన కరోనా టీకామందు వంటి సాఫల్యాల ను గురించి ఆయన వివరించారు. కరోనా టీకామందు విషయం లో పుణె ఒక ప్రధాన పాత్ర వహించింది అని ఆయన అన్నారు. భారతదేశం పౌరుల యొక్క కఠోర శ్రమ మరియు సమైక్యత పట్ల గల నమ్మకం వల్లనే ముద్ర యోజన లో భాగం గా పూచీకత్తు యొక్క అవసరం ఉండని విధం గా రుణాల ను మంజూరు చేయడం జరుగుతున్నది అని కూడా ఆయన చెప్పారు. ఇదే కోవ లో ప్రస్తుతం చాలా వరకు సేవ లు మొబైల్ లో అందుబాటు లో ఉన్నాయి. ప్రజలు వారి ముఖ్య పత్రాల ను వారంతట వారు గా ప్రమాణీకరించుకోవచ్చును అని ఆయన అన్నారు. ఈ విశ్వాసం సంబంధి మిగులు కారణం గానే స్వచ్ఛత ప్రచార ఉద్యమం, మరియు ‘బేటీ బచావో బేటి పఢావో’ లు ప్రజా ఉద్యమాలు గా రూపుదిద్దుకొన్నాయి అని ఆయన అన్నారు. ఇవన్నీ కలసి దేశం లో ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి అని ఆయన అన్నారు.
ఎర్ర కోట మీద నుండి తాను ప్రసంగిస్తూ, వీలు కుదిరిన వారు వారి యొక్క గ్యాస్ సబ్సిడీ ని వదులుకోవాలంటూ పిలుపునిచ్చిన మీదట లక్షల కొద్దీ పౌరులు ప్రతిస్పందించిన విషయాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెస్తూ, అనేక దేశాల లో ఒక సర్వేక్షణ ను నిర్వహించగా భారతదేశం లో ప్రజల కు ప్రభుత్వం పట్ల అత్యంత విశ్వాసం ఉంది అని తేలింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. అంతకంతకు అధికం అవుతున్న సార్వజనిక విశ్వాసం భారతదేశం లో ప్రజల కు ఒక పురోగతి మాధ్యం గా రూపుదాల్చుతోంది అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించేటప్పుడు, స్వాతంత్య్రం సాధన కు 75 సంవత్సరాలు అయిన అనంతరం దేశం ‘అమృత కాలాన్ని’ ‘కర్తవ్య కాలం’ గా భావిస్తున్నదని, ఈ కాలం లో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పౌరురాలు దేశం యొక్క సంకల్పాల ను మరియు స్వప్నాల ను దృష్టి లో పెట్టుకొని ఎవరికి వారు వారి వంతు గా పాటుపడుతున్నారని నొక్కి చెప్పారు. ఈ కారణం గానే ప్రస్తుతం ప్రపంచం సైతం భవిష్యత్తు ను భారతదేశం లో చూసుకొంటోంది, ఇలా ఎందుకంటే ఇవాళ మనం చేస్తున్న ప్రయాస లు యావత్తు మానవాళి కి ఒక భరోసా గా ఉంటున్నాయి కాబట్టి అని ప్రధాన మంత్రి అన్నారు. లోక్ మాన్య తిలక్ గారి ఆలోచన ల మరియు ఆశీర్వాదాల శక్తి తో పౌరులు ఒక బలమైనటువంటి మరియు సమృద్ధమైనటువంటి భారతదేశ కల ను నెరవేరుస్తారని ప్రధాన మంత్రి అన్నారు. లోక్ మాన్య తిలక్ గారి యొక్క ఆదర్శాల తో ప్రజల ను జత పరచడం లో హింద్ స్వరాజ్య సంఘ్ ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేశ్ బైస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్, శ్రీ అజీత్ పవార్, పార్లమెంటు సభ్యుడు శ్రీ శరద్ చంద్ర పవార్, తిలక్ స్మారక్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ శ్రీ దీపక్ తిలక్, తిలక్ స్మారక్ ట్రస్టు ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీ రోహిత్ తిలక్, తిలక్ స్మారక్ ట్రస్టు యొక్క ట్రస్టీ శ్రీ సుశీల్ కుమార్ శిందే మరియు ఇతరులు ఉన్నారు.
పూర్వరంగం
లోక్ మాన్య తిలక్ గారి వారసత్వాన్ని సమ్మానించడం కోసం తిలక్ స్మారక్ మందిర్ ట్రస్టు 1983 వ సంవత్సరం లో లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారాన్ని దేశం యొక్క పురోగతి కి మరియు అభివృద్ధి కి కృషి చేసిన వ్యక్తుల కు ఇస్తూ వస్తున్నారు. ఆ వ్యక్తుల సేవల ను విశేషమైనవిగాను, అసాధారణమైనవిగాను చూడడం జరుగుతుంది. ఈ పురస్కారాన్ని ఏటా లోక్ మాన్య తిలక్ గారి వర్ధంతి ఆగస్టు 1 వ తేదీ నాడు ప్రదానం చేస్తుంటారు.
ఈ పురస్కారాన్ని అందుకొన్న వారిలో 41 వ వారు గా ప్రధాన మంత్రి ఉన్నారు. ఈ పురస్కారాన్ని ఇదివరకు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, శ్రీ ప్రణబ్ ముఖర్జీ, శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి, శ్రీమతి ఇందిరా గాంధీ, డాక్టర్ శ్రీ మన్ మోహన్ సింహ్, శ్రీ ఎన్.ఆర్. నారాయణ మూర్తి, డాక్టర్ శ్రీ ఇ. శ్రీధరన్ వంటి ప్రముఖుల కు ఇవ్వడం జరిగింది.
***
DS/TS
(Release ID: 1944770)
Visitor Counter : 138
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam