ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

భారతదేశం విశ్వసనీయ ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ భాగస్వామిగా ఎదుగుతోంది: సెమికాన్ఇండియా 2023 చివరి రోజున ఈ ఏ ఎం డాక్టర్ ఎస్ జైశంకర్


సెమీకండక్టర్ నిపుణులు ప్రపంచ భాగస్వామ్యాలు, నైపుణ్య అభివృద్ధి మరియు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ల పాత్రను భారతదేశంలో సెమీకండక్టర్ ఆవరణం యొక్క కీలక చోదక శక్తులని నొక్కిచెప్పారు

Posted On: 31 JUL 2023 9:12AM by PIB Hyderabad

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మూడు రోజుల సెమీకాన్ఇండియా 2023 చివరి రోజున ప్రసంగించారు. క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో భారతదేశం పాత్రను మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో, ముఖ్యంగా సెమీకండక్టర్లలో దేశవృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. విశ్వసనీయ ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ భాగస్వామిగా భారతదేశం పెరుగుతున్న ఉనికిని ఆయన నొక్కి చెప్పారు. ఈ విషయంలో యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ సహకారాలు మరియు ఇతర సారూప్య దేశాలతో రాబోయే అవకాశాలు గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

 

మూడు రోజుల సెమికాన్ఇండియా 2023 కాన్ఫరెన్స్ చివరి రోజు పరిశ్రమ, స్టార్ట్-అప్‌లు, విద్యాసంస్థలు మరియు ప్రభుత్వం నుండి వైవిధ్య భాగస్వామ్యాన్ని ఆకర్షించింది. అంతర్దృష్టితో కూడిన సెషన్‌లు మరియు ఆకర్షణీయమైన చర్చలు సెమీకండక్టర్ తయారీకి సంబంధించిన క్లిష్టమైన అంశాల యొక్క ప్రాముఖ్యతను మరియు బలమైన, నిలకడగల మరియు సుస్థిరమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలను ప్రదర్శించాయి.

 

భారతదేశం "వసుధైవ కుటుంబకం" లేదా "ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు", అంటే, సమానమైన వృద్ధిని అందరికీ మంచిభవిష్యత్తును పంచాలని దృఢంగా విశ్వసిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఎన్ ఎస్ సీ ఎస్ సభ్యుడు శ్రీ అన్షుమాన్ త్రిపాఠి నేతృత్వంలో "విశ్వసనీయ మరియు నిలకడైన సెమీకండక్టర్ సప్లై చైన్ కోసం అంతర్జాతీయ సహకారం" అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ప్యానెలిస్టులు మైక్ హాంకీ, కాన్సుల్ జనరల్, అమెరికన్ ఎంబసీ; క్యోకో హోకుగో, మంత్రి, ఆర్థిక మరియు అభివృద్ధి, జపాన్; ఆస్ట్రేలియన్ హై కమీషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీమతి జార్జినా రోజ్ మెకే మరియు జార్జియా టెక్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అరిజిత్ రేచౌదరి సెమీకండక్టర్ పరిశ్రమను పెంపొందించడంలో ప్రపంచ భాగస్వామ్యాల సామర్థ్యాన్ని గురించి మాట్లాడారు. సెమీకండక్టర్ తయారీ, పరిశోధన, ప్రతిభ, స్వచ్ఛమైన శక్తి పరివర్తనాలు మరియు క్లిష్టమైన ఖనిజాల అన్వేషణ ప్రధాన పాత్ర పోషించడంలో భారతదేశం యొక్క పాత్రపై ప్రత్యేక దృష్టి సారించారు. 

 

టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లోని శ్రీ సంతోష్ కుమార్‌తో సహా, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో అవకాశాలు మరియు సవాళ్లపై జరిగిన చర్చా కార్యక్రమంలో  జయ జగదీష్, ఏఎండీ; శ్రీ హితేష్ గార్గ్, ఎన్ ఎక్స్ పీ సెమీకండక్టర్స్, మరియు ప్రొఫెసర్ ఉదయన్ గంగూలీ, ఐ ఐ టీబాంబే ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు.సెమీకండక్టర్స్‌లో కీలక ఆవిష్కరణలు, ఆటోమోటివ్ సెమీకండక్టర్ల భవిష్యత్తు, సెమీకండక్టర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో విద్యా సంస్థల పాత్ర మరియు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో స్థిరత్వం గురించి చర్చ జరిగింది.

హెచ్‌ఎస్‌బిసి ఇండియా ఎండి శ్రీ అమితాబ్ మల్హోత్రా మరియు మోర్గాన్ స్టాన్లీ ఎండి శ్రీ రిధమ్ దేశాయ్‌తో “క్యాటలైసింగ్ న్యూ ఇండియాస్ టెకేడ్” అనే అంశంపై జరిగిన చర్చ లోభారతదేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ఉన్న ఉత్తేజకరమైన అవకాశాలను ప్రతిబింబించింది. దేశం ఎలక్ట్రానిక్స్ వినియోగం మరియు ఉత్పత్తి రెండింటినీ బట్వాడా చేయడం బహుళజాతి కంపెనీలకు ఆకర్షణీయంగా చేస్తుంది. సెమీకండక్టర్ పరిశ్రమలో వృద్ధికి మూలధన ప్రాప్యత కీలకమైనదని  బాహ్య వాణిజ్య రుణాలు మరియు ఈక్విటీ పెట్టుబడులతో సహా వివిధ ఫైనాన్సింగ్ మార్గాలు చర్చించబడ్డాయి.

 

సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ కోసం సంసిద్ధత అంచనాపై ప్యానెల్ చర్చలు నిర్వహించబడ్డాయి. ఇ సీ ఈ ఐ చైర్మన్ శ్రీ పంకజ్ మొహింద్రూ, ఎలక్ట్రానిక్స్ జీ వీ సి లలో భారతదేశం పెరుగుతున్న ఉనికిపై సెషన్‌ను మోడరేట్ చేశారు. ప్యానెలిస్టులు, శ్రీ సుధీర్ పిళ్లై, ఎం డి, కార్నింగ్ ఇండియా; శ్రీ అమన్ గుప్తా, సీ  ఎం ఓ మరియు సహ వ్యవస్థాపకుడు, బీ ఓ ఏ టి;  శ్రీ రమీందర్ సింగ్, రేడియంట్ చైర్మన్; నందిని టాండన్, వెంచర్ క్యాపిటలిస్ట్ మరియు డాక్టర్ రవి భత్కల్, ఎలిమెంట్ సొల్యూషన్స్ ఎలక్ట్రానిక్స్ రంగం యొక్క అద్భుతమైన వృద్ధి మరియు సంభావ్యత గురించి చర్చించారు. భారతీయ ఛాంపియన్ బీ ఓ ఏ టి దేశీయ బ్రాండ్‌ను నిర్మించడం మరియు దిగుమతుల నుండి దేశీయ తయారీకి మారడం వంటి దశలవారీ తయారీ కార్యక్రమంతో సహా ప్రభుత్వ విధానాలు మరియు పథకాల మద్దతుతో  వారి ప్రయాణాన్ని పంచుకుంది. కార్నింగ్ ఇండియా 'మేక్ ఇన్ ఇండియా''స్లోగన్' నుండి 'నమ్మకం'కి మారడాన్ని నొక్కి చెప్పింది.బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి తయారీ వ్యూహం కోసం పిలుపునిచ్చింది. సమగ్ర తయారీ వ్యూహాలు, ఏకరీతి లేబర్ కోడ్‌లు మరియు బీమా రక్షణ ఆవశ్యకతతో సహా రంగంలోని సవాళ్లను చర్చించారు.

 

ఐ ఈ ఎస్ ఐ ఛైర్మన్ శ్రీ సంజయ్ గుప్తా మరియు ఇతర గౌరవ ప్యానలిస్టులు, శ్రీ అక్షయ్ త్రిపాఠి, యూ పీ ప్రభుత్వం నేతృత్వంలోని ప్యానెల్; శ్రీ విజయ్ నెహ్రా, గుజరాత్ ప్రభుత్వం; డా . ఈ వీ రమణా రెడ్డి, కర్ణాటక ప్రభుత్వం; తెలంగాణ ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధి శ్రీ సుజై కరంపురి ఈ రంగంలో భారతదేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, పెట్టుబడులను ఆకర్షించడానికి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరియు ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ పరిశ్రమలలో ప్రతిభను పెంపొందించడానికి వివిధ భారతీయ రాష్ట్రాల సంసిద్ధతను ప్రదర్శించారు. సెమీకండక్టర్ కంపెనీలకు ఆర్థిక మరియు  ఆర్థికేతర ప్రాముఖ్యత, పారిశ్రామిక వ్యవస్థాపకత అవసరం మరియు స్టార్టప్‌లకు మద్దతుగా రాష్ట్ర నిధుల సృష్టి గురించి కూడా ప్యానలిస్టులు చర్చించారు.

 

 

"గ్లోబల్ సెమీకండక్టర్ టాలెంట్ క్యాపిటల్"పై జరిగిన చర్చలు భారతదేశాన్ని సెమీకండక్టర్ టాలెంట్ దేశంగా మార్చడానికి సెమికాన్ ఇండియా భవిష్యత్ నైపుణ్య అభివృద్ధి ప్రణాళిక అమలును అన్వేషించాయి. జయ జగదీష్, ఏ ఎం డీ ఇండియా; ప్రొఫెసర్ టీ జీ సీతారాం, ఏ ఐ సీ టీ ఈ చైర్మన్; శ్రీ బినోద్ నాయర్, గ్లోబల్ ఫౌండ్రీస్; శ్రీ శ్రీనివాస్ సత్య, అప్లైడ్ మెటీరియల్స్; శ్రీ రంగేష్ రాఘవన్, లామ్ రీసెర్చ్; ప్రొఫెసర్ ఉద్యాన్ గంగూలీ, ఐ ఐ టీ బాంబే మరియు డాక్టర్ విజయ్ రఘునాథన్, పర్డ్యూ విశ్వవిద్యాలయం వ్యూహాత్మక ప్రణాళిక, సహకారం మరియు శ్రామికశక్తి పెట్టుబడి ద్వారా సెమీకండక్టర్ టాలెంట్ దేశంగా మారడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రదర్శించారు.

 

డీ పీ ఐ ఐ టీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, ప్రపంచవ్యాప్తంగా పోటీ సమ్మతి మరియు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంపై సెషన్‌ను మోడరేట్ చేశారు. రాష్ట్రాల స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించి, వ్యాపార సౌలభ్యం మరియు ఎఫ్‌డిఐ ప్రక్రియలలో వేగవంతమైన మార్పులను ఆయన హైలైట్ చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను హ్యాండ్‌హోల్డింగ్ చేయడం, పన్ను సంస్కరణలు, మొత్తం ప్రభుత్వ విధానం మరియు పెట్టుబడిదారుల కోసం నిర్ణయాత్మక ప్రక్రియలో విధాన స్థిరత్వం యొక్క ప్రాముఖ్యతను ఎం ఈ ఐ టీ వై కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ నొక్కిచెప్పారు. సీ బీ డీ టీ సభ్యురాలు శ్రీమతి ప్రజ్ఞా సహాయ్ సక్సేనా, పరిశ్రమ సంప్రదింపులు మరియు అవసరాల ఆధారంగా నిర్మాణాత్మక మార్పులను అమలు చేయడంలో ప్రభుత్వం ఎలా చురుగ్గా వ్యవహరిస్తుందో హైలైట్ చేశారు. కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ మరియు ఫేస్‌లెస్ కస్టమ్స్ ప్రక్రియలపై దృష్టి సారిస్తూ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి సీ బీ ఐ సీ సభ్యుడు శ్రీ రాజీవ్ తల్వార్ లక్షణాలను వివరించారు. శ్రీ గుర్శరణ్ సింగ్, ఎస్ వీ పీ మైక్రోన్, అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్‌కు ప్రభుత్వం వేగవంతమైన విధానాన్ని ప్రశంసించారు. శ్రీ హరి ఓం రాయ్, ఎం డి, లావా 2033 నాటికి గ్లోబల్ ఎలక్ట్రానిక్స్‌లో 50 శాతం భారతదేశం తయారు చేస్తుందనే పరిశ్రమ దృష్టిని హైలైట్ చేశారు.

 

జయ జగదీష్, ఏ ఎం డీ ఇండియా సెమీకాన్ఇండియా 2023లో ముగింపు వ్యాఖ్యలు చేసారు. సెమీకండక్టర్ పరిశ్రమలో "భారతదేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి" నుండి "భారతదేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు" అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశ్నతో సెమీకాన్ఇండియా రెండవ ఎడిషన్ గణనీయమైన మార్పును గుర్తించింది. పెరుగుతున్న చిప్ డిమాండ్‌ను తీర్చడానికి చిప్లెట్ ఆర్కిటెక్చర్ మరియు మెటీరియల్ సైన్సెస్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి పెట్టడం చాలా కీలకమని ఆమె పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన ప్రతిభ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరియు స్టార్టప్‌లు మరియు ఆర్ & డీ మద్దతు ఈ రంగంలో ఆవిష్కరణలకు ఆజ్యం పోస్తుంది.

 

సెమీకాన్ఇండియా రెండవ ఎడిషన్ గ్లోబల్ కంపెనీలను అత్యున్నత స్థాయి నాయకత్వం మరియు విద్యారంగంలో నిమగ్నం చేయడం  సాంకేతికత  భవిష్యత్తు మరియు ముఖ్యంగా సెమీకండక్టర్ల భవిష్యత్తుపై సంభాషణలో భారతదేశాన్ని కేంద్రంగా ఉంచింది. ఇది భారతదేశం యొక్క సెమీకండక్టర్ ప్రయాణం యొక్క అధికారిక లాంచ్ ప్యాడ్‌ను సూచిస్తుంది. ఇది భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్లకు ప్రపంచ కేంద్రంగా మారుస్తుంది.

 

***



(Release ID: 1944340) Visitor Counter : 107