కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రిపీలింగ్ రెగ్యులేషన్స్, 2023 ని విడుదల చేసిన ట్రాయ్

Posted On: 27 JUL 2023 1:16PM by PIB Hyderabad

 డయల్-అప్, లీజుకు తీసుకున్న ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీస్ (420) సేవల నాణ్యత నియంత్రణకు సంబంధించి  అమలులో ఉన్న ఇంటర్నెట్ యాక్సెస్   సర్వీస్,2001 (4 ఆఫ్ 2001)  ను రద్దు చేస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రిపీలింగ్  రెగ్యులేషన్స్, 2023 (02 ఆఫ్ 2023) ను 2023 జూలై 25 న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసింది.  అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ట్రాయ్ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. 

 డయల్-అప్, లీజుకు తీసుకున్న సేవల నాణ్యతపై నియంత్రణ కోసం ట్రాయ్ 2001 డిసెంబర్ 10వ తేదీన  లైన్ ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీస్, 2001 (4 ఆఫ్ 2001) విడుదల చేసింది. ఈ నియంత్రణ  నిబంధన అన్ని ప్రాథమిక సేవా ఆపరేటర్‌లు , ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లకు వర్తిస్తుంది. బిఎస్ఎన్ఎల్, ఎంటిన్ఎల్ , విఎస్ ఎన్ఎల్ లకు నియంత్రణ వర్తించే విధంగా ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించేందుకు నెట్ వర్క్ అందిస్తున్న సంస్థ పాటించాల్సిన ప్రమాణాలు, సంస్థ పనితీరు, పనితీరు విశ్లేషణ, నిబంధనల్లో పొందుపరిచిన విధంగా సేవా సంస్థలు పనిచేసేలా చూసేందుకు లైన్ ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీస్, 2001 జారీ అయ్యింది. 

తక్కువ వేగంతో పనిచేసే  ఇంటర్నెట్‌ సేవలు పొందడానికి  డయల్ అప్ సేవ మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో ఈ నిబంధనలు జారీ అయ్యాయి. కాలక్రమేణా  వైర్‌లైన్, వైర్‌లెస్ వ్యవస్థల ద్వారా టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు పనిచేయడం ప్రారంభించాయి.  xDSL, FTTH, LTE, 5G మొదలైన సాంకేతికతలపై హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి సంస్థలు చర్యలు తీరుకోవడం ప్రారంభించాయి.  లీజుకు తీసుకున్న లైన్ యాక్సెస్ సేవలను  ISP లైసెన్స్‌ని కలిగిన  ఇంటర్నెట్ గేట్‌వే సర్వీస్ ప్రొవైడర్లు  అందిస్తున్నారు.  సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (SLA) ఆధారిత సేవగా ఈ సేవ అమలు జరుగుతోంది. . SLA ఆధారిత సేవ అయినందున నాణ్యతకు సంబంధించి  కాంట్రాక్టు పక్షాల మధ్య ఒప్పందం కుదురుతుంది. అంగీకరించిన విధంగా తప్పనిసరిగా నాణ్యమైన   సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సేవల నాణ్యతకు సంబంధించి  డయల్-అప్ ,లీజుకు తీసుకున్న లైన్ ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీస్, 2001 అమలు చేయాల్సిన అవసరం ఉండదు. 

పైన పేర్కొన్న అంశాలను పరిశీలించిన తర్వాత  భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు నిబంధనలు, 2023 ముసాయిదాను 2023 ఏప్రిల్ 03న  ట్రాయ్ జారీ చేసింది. 2023 ఏప్రిల్ 17 వరకు అభిప్రాయాలు అందించాలని సంబంధిత వర్గాలను ట్రాయ్ కోరింది. అన్ని వర్గాలు, సులభతరం వ్యాపార నిర్వహణ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని   టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు నిబంధనలు,  2001 (4 ఆఫ్ 2001)ను  రద్దు చేయాలని అథారిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి జారీ అయిన  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రిపీలింగ్  రెగ్యులేషన్స్, 2023 (02 ఆఫ్ 2023)   అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన వెంటనే అమలు లోకి వస్తుంది. .

 

****



(Release ID: 1943174) Visitor Counter : 118