బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు ధరల్లో భారీ తగ్గుదల; 33.8 శాతం క్షీణించిన జాతీయ బొగ్గు సూచీ


సమృద్ధిగా ఉన్న బొగ్గు నిల్వలతో వివిధ రంగాలకు సరఫరా భరోసా

प्रविष्टि तिथि: 26 JUL 2023 11:20AM by PIB Hyderabad

జాతీయ బొగ్గు సూచీ (ఎన్‌సీఐ), 2023 మే నెలలో 33.8% భారీ తగ్గుదలతో 157.7 పాయింట్ల వద్దకు దిగి వచ్చింది. 2022 మే నెలలో అది 238.3 పాయింట్ల వద్ద ఉంది. మార్కెట్‌లో బొగ్గు సరఫరాను ఈ సూచిక ప్రతిబింబిస్తుంది, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగల బొగ్గు లభ్యతను నిర్ధరిస్తుంది.

నాన్-కోకింగ్ కోల్‌ విషయంలో, ఎన్‌సీఐ 2023 మే నెలలో 147.5 పాయింట్ల వద్ద ఉంది, 2022 ఇది మే నెలతో పోలిస్తే 34.3% క్షీణించింది. కోకింగ్ కోల్ సూచీ 2023 మే నెలలో 32.6% తగ్గుదలతో 187.1 పాయింట్ల వద్ద ఉంది. 2022 జూన్‌లో 2022లో 238.8 పాయింట్లకు చేరుకున్న ఎన్‌సీఐ, రికార్డ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాతి నెలల్లో సూచీ క్షీణించింది. ఇది భారత మార్కెట్‌లో సమృద్ధిగా ఉన్న బొగ్గు నిల్వలను సూచిస్తుంది.

ప్రకటించిన బొగ్గు ధరలు, వేలం ధరలు, దిగుమతి ధరలు సహా అన్ని రకాల అమ్మకాల మార్గాల నుంచి బొగ్గు ధరలను కలిపే ధరల సూచిక ఈ జాతీయ బొగ్గు సూచీ. 2017-18 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన దీనిని ప్రారంభించారు. ఇది విశ్వసనీయ సూచికగా పని చేస్తుంది, బొగ్గు ధరల్లో హెచ్చుతగ్గులపై విలువైన గణాంకాలను అందిస్తుంది.

 

  
 

దీనికి అదనంగా, బొగ్గు వేలంలో పలికే అధిక ధర, పరిశ్రమ నాడి తెలుపుతుంది. బొగ్గు వేలంలో ధరలు తగ్గితే, మార్కెట్‌లో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని అర్ధం. బొగ్గుపై ఆధారపడిన వివిధ రంగాలకు స్థిరమైన సరఫరాకు ఈ నిల్వలు భరోసా ఇస్తాయి. ఇది భారతదేశ మొత్తం ఇంధన భద్రతకు దోహదపడుతుంది.

ఎన్‌సీఐ ఎంత తగ్గితే, అంత సమతౌల్య మార్కెట్‌ ఉన్నట్లు గుర్తు. సరఫరా, డిమాండ్‌ను ఇది సమం చేస్తుంది. తగినంత బొగ్గు లభ్యతతో, దేశంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, దీర్ఘకాలిక ఇంధన అవసరాలకు మద్దతుగా నిలుస్తుంది. తద్వారా, స్థిరమైన బొగ్గు పరిశ్రమను నిర్మిస్తుంది.

***


(रिलीज़ आईडी: 1943091) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Odia , Tamil , Kannada