పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

హెలి 2023 , ఉడాన్ 5.2 సమ్మేళనాన్ని ఖజురహోలో ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


హెలి 2023 సమ్మేళనం ముఖ్యాంశం చిట్టచివరి ప్రాంతం వరకు హెలికాప్టర్లు, చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా విమానయాన సేవలు అందించడం.

ఉడాన్ 5.2 లక్ష్యం కేటగిరీ 1ఎ(9 సీట్ల కంటే తక్కువ), కేటగిరీ 1 (20 సీట్ల కంటే తక్కువ) ద్వారా చిట్టచివరి ప్రాంతం వరకు విమానయాన సేవల అసుసంధానత కల్పించడంపై దృష్టిపెట్టడం.

Posted On: 25 JUL 2023 4:15PM by PIB Hyderabad

 

కేంద్ర పౌర  విమానయాన, ఉక్కు  శాఖ మంత్రి  శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లోని ఖజురహోలో హెలి 2023 సమ్మేళనాన్ని ప్రారంభించారు. అలాగే  ఆర్.ఎస్.సి. ఉడాన్ 5.2 ను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు.
5వ హెలికాప్టర్, చిన్న విమానాల సమ్మేళనం (హెలి సమ్మిట్ 2023) ని కేంద్ర పౌరవిమానయాన శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వ పవన్ హాన్స్ లిమిటెడ్, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి)ల సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు.
ఈ స మ్మేళనం థీమ్ , చిట్టచివరి మైలు వరకు సేవలు : హెలికాప్టర్ ,చిన్న విమానాల ద్వారా ప్రాంతీయ అనుసంధానత. ఈ ఈవెంట్ లో సమ్మేళనం ప్రారంభ కార్యక్రమంతోపాటు, టెక్నికల్  సెషన్ నిర్వహించారు. ఈ సమ్మేళనం స్థూల లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.

• భారత హెలికాప్టర్ పరిశ్రమ, చిన్న విమానాల పరిశ్రమ అభివృద్ధి గాథను పరిశ్రమకుచెందిన అందరు స్టేక్హోల్డర్లు, విధాన  నిర్ణేతలతో చర్చించడం.
 ఇందుకు సంబంధించి ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటు.
• ఉడాన్ పథకం పరిథిని మారుమూల, కొండప్రాంతాలకు  విస్తరింపచచేయడం, దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంపు.
• ప్రస్తుత పర్యాటక ప్రాంతాలు,భవిష్యత్తులో పర్యాటకంగా కీలకం కానున్నప్రాంతాలకు నిరంతరాయంగా హెలికాప్టర్ ద్వారా, చిన్న విమానాల ద్వారా  అనుసంధానత కల్పించి సేవలు అందించడం.
ఉడాన్ 5.2 ను మారుమూల ప్రాంతాలు , ప్రాంతీయంగా వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానతను కల్పించేందుకు ప్రారంభించారు. దీని ద్వారా చిట్ట చివరి ప్రాంతానికి కూడా అనుసంధానత కల్పించడం దీని లక్ష్యం.
 1ఎ కేటగిరీ ( 9 సీట్ల కంటే తక్కువ), కేటగిరీ 1 (20 సీట్ల కంటే తక్కువ) కింద చిన్న విమానాల ద్వారా ఈ అనుసంధానత కల్పిస్తారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలలో పౌరవిమానయాన రంగం ప్రజాస్వామీకరణ అయిందని, ఎన్నో విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయని, విమానాల సంఖ్య వాటి
 మార్కెట్ విస్తృతమైందని అన్నారు.  ఈ విస్తరణలో భాగంగా భారీ మెట్రో విమానాశ్రయాల విస్తరణతోపాటు చిన్న విమానాశ్రయాలు, చిన్న విమానాలు, హెలికాప్టర్లపై కూడా శ్రద్ధ చూపడం జరిగిందన్నారు.
.‘‘ఇవాళ మనం హెలికాప్టర్లకు సంబంధించి ఉడాన్ 5.2ను ప్రారంభించుకున్నామని,  దీనికింద మనం విజిఎఫ్ను పెంచామని, ధరల క్యాప్ను తగ్గించామని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీనితోపాటు మనం హెలి సేవా పేరుతో సింగిల్ విండో
సేవల ప్లాట్ఫారం ప్రారంభించామన్నారు. దీనిద్వారా మొబైల్ ద్వారా ఎటిసి అనుమతులు పొందవచ్చని అన్నారు. ఇవాళ మనం 22 రూట్లు కేటాయించాం . దీనిద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణ సౌకర్యం మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తున్నది అని మంత్రి అన్నారు.హెలి సేవా మొబైల్ అప్లికేషన్ను కూడా శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. హెలిసేవా పోర్టల్ను డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
హెలికాప్టర్ ఆపరేటర్లు, జిల్లా యంత్రాంగానికి మధ్య అనుసంధాన కర్తగా ఒక ఉమ్మడి ప్లాట్ఫారంను ఇది కల్పిస్తుంది.ఇండియాలో  అధునాతనచిన్న విమానాలు అధునాతన హెలికాప్టర్ల ను తీసుకువచ్చేందుకు పవన్ హాన్స్కు జెట్సెర్వ్ సంస్థకు మధ్య అవగాహనా ఒప్పందం కుదరింది.

***(Release ID: 1943030) Visitor Counter : 93