ప్రధాన మంత్రి కార్యాలయం
జి 20 విపత్తు ప్రమాదాల తగ్గింపు (డిజాస్టర్ రిస్క్ రిడక్షన్) వర్కింగ్ గ్రూప్ మూడవ సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ
'మార్పు కోసం చూసే సమయం దాటిపోయింది: స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వ్యవస్థల్లో మార్పు మనకు అవసరం‘‘
‘భారత్ లో మనం విపత్తు ప్రమాదాల తగ్గింపు విధానాన్ని పూర్తిగా మార్చివేశాం‘
'ప్రతిస్పందనకు సన్నద్ధత' మాదిరిగానే, ' కోలుకునే (రికవరీ) సంసిద్ధత'కు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Posted On:
24 JUL 2023 7:03PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి
శ్రీ ప్రమోద్ కుమార్ మిశ్రా ఈ రోజు చెన్నయ్ లో జరిగిన జి 20 విపత్తు ప్రమాదాల తగ్గింపు (డిజాస్టర్ రిస్క్ రిడక్షన్) వర్కింగ్ గ్రూప్ మూడవ ప్రసంగించారు.
ఈ ఏడాది మార్చిలో గాంధీనగర్ లో తొలిసారి సమావేశమైన విషయాన్ని ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తు చేశారు.అప్పటి నుంచి సంభవించిన అనూహ్య వాతావరణ మార్పులకు సంబంధించిన విపత్తులను ప్రస్తావించారు. ఉత్తరార్ధగోళం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న భారీ వడగాలులు, కెనడాలోని అడవి మంటలు, ఆ తర్వాత ఉత్తర అమెరికాలో వివిధ ప్రాంతాల్లోని నగరాలను ప్రభావితం చేసిన పొగమంచు, భారతదేశం తూర్పు, పశ్చిమ తీరాల్లో ప్రధాన తుఫాను కార్యకలాపాలకు ఆయన ఉదాహరణలు ఇచ్చారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీని వరదలు ముంచెత్తడంపై కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు.
వాతావరణ మార్పులకు సంబంధించిన విపత్తుల ప్రభావాలు అపారమైనవని, ప్రకృతిలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, అవి ఇప్పటికే మన తలుపులు తట్టాయని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్ఘాటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను, భూగోళంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రస్తావించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, జీ20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ బృందం ఎంతో పురోగతి సాధించి మంచి ఉత్తేజాన్ని సృష్టించినప్పటికీ, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిమాణంతో ఆకాంక్షలను సరిపోల్చాలని ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేశారు. మార్పుకు సమయం ఆసన్నమైందని, కొత్త విపత్తులు తలెత్తకుండా నిరోధించడానికి, ఉన్న వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి స్థానిక, జాతీయ, ప్రపంచ వ్యవస్థల పరివర్తనకు రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు.
తమ సమిష్టి ప్రభావాన్ని పెంచడానికి భిన్నమైన జాతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఏకీకృతం చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ, సంకుచిత సంస్థాగత దృక్పథాలతో నడిచే విచ్ఛిన్నమైన ప్రయత్నాలకు బదులుగా సమస్య పరిష్కార విధానాన్ని అవలంబించాలని ఆయన చెప్పారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి "అందరికీ ముందస్తు హెచ్చరిక" చొరవను ఆయన ప్రశంసించారు. అలాగే జి 20 "ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్" ను ఐదు ప్రాధాన్యతలలో ఒకటిగా గుర్తించిందని, దాని వెనుక తన పూర్తి బాధ్యత ను ఉంచిందని తెలియజేశారు.
విపత్తు హాని తగ్గించేందుకు నిధులు సమకూర్చే విషయంలో, సంబంధిత అన్ని అంశాలకు నిధులు సమకూర్చడానికి అన్ని స్థాయిలలో నిర్మాణాత్మక యంత్రాంగాలను అనుసరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ నొక్కి చెప్పారు. భారతదేశంలో గత కొన్నేళ్లుగా, విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి నిధులు అందించే విధానం పూర్తిగా మారిందని, విపత్తు ప్రతిస్పందన మాత్రమే కాకుండా విపత్తు ఉపశమనం, సంసిద్ధత , పునరుద్ధరణకు కూడా నిధులు సమకూర్చడానికి ఊహించదగిన యంత్రాంగం ఉందని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. ‘అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయవచ్చా‘ అని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశ్నించారు. విపత్తు ప్రమాదాలను తగ్గించడానికి అందుబాటులో ఉన్న వివిధ మార్గాల మధ్య మరింత సమన్వయం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. విపత్తు ప్రమాదాల తగ్గింపునకు ఫైనాన్సింగ్ లో క్లైమేట్ ఫైనాన్స్ అంతర్భాగంగా ఉండాలని ఆయన అన్నారు. విపత్తు రిస్క్ తగ్గింపు అవసరాల కోసం ప్రైవేటు నిధులను సమీకరించే సవాలును పరిష్కరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేశారు.విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రైవేట్ ఫైనాన్స్ ను ఆకర్షించడానికి ప్రభుత్వాలు ఎలాంటి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి?
విపత్తు రిస్క్ తగ్గింపులో ప్రైవేటు పెట్టుబడులు కార్పొరేట్ సామాజిక బాధ్యత వ్యక్తీకరణ మాత్రమే కాకుండా సంస్థల ప్రధాన వ్యాపారంలో భాగమని జి 20 ఎలా నిర్ధారిస్తుంది? అని ప్రశ్నించారు.
అనేక జి 20 దేశాలు, ఐక్యరాజ్యసమితి, ఇతరులతో భాగస్వామ్యంతో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి ప్రయోజనాలను ప్రిన్సిపల్ సెక్రటరీ వివరించారు. చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహా దేశాలు తమ ప్రమాణాలను మెరుగుపరచడానికి మెరుగైన రిస్క్ మదింపులు , కొలమానాలు చేయడం గురించి ఇది తెలియజేస్తుందని, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరింత రిస్క్-ఇన్ఫర్మేషన్ పెట్టుబడులు పెడతామని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు.
ఈ ఆలోచనలకు పదును పెట్టేందుకు కృషి చేయాలని, కార్యక్రమాల రూపకల్పనలో ప్రయోగాలకు అతీతంగా ఆలోచించాలని ఆయన నొక్కి చెప్పారు.
విపత్తుల తర్వాత 'బిల్డింగ్ బ్యాక్ బెటర్' అనే కొన్ని మంచి పద్ధతులను వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. 'పునరుద్ధరణకు సంసిద్ధత'ను అవలంబించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు, ఆర్థిక ఏర్పాట్లు, సంస్థాగత యంత్రాంగాలు , సామర్థ్యాల ఆధారంగా 'ప్రతిస్పందనకు సంసిద్ధత' అవలంబించాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
వర్కింగ్ గ్రూప్ అనుసరిస్తున్న ఐదు ప్రాధాన్యాల్లో గణనీయమైన పురోగతిపై ప్రిన్సిపల్ సెక్రటరీ సంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే కొద్ది రోజుల్లో చర్చించనున్న ప్రకటన జీరో ముసాయిదా గురించి శ్రీ మిశ్రా మాట్లాడుతూ, జి 20 దేశాలకు విపత్తు ప్రమాద తగ్గింపుపై ఇది చాలా స్పష్టమైన , వ్యూహాత్మక ఎజెండాను ముందుకు తెస్తుందని తెలియజేశారు.
గత నాలుగు నెలలుగా ఈ కార్యవర్గ చర్చల్లో చోటు చేసుకున్న సమన్వయం, ఏకాభిప్రాయం, సహసృష్టి స్ఫూర్తి వచ్చే మూడు రోజులు, అంతకు మించి కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ప్రయత్నంలో విజ్ఞాన భాగస్వాముల నుండి లభించిన నిరంతర మద్దతుకు ప్రిన్సిపల్ సెక్రటరీ కృతజ్ఞతలు తెలిపారు ఈ బృందం పనికి మద్దతు ఇవ్వడంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రతినిధి శ్రీమతి మామి మిజుటోరి వ్యక్తిగత నిమగ్నతను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వర్కింగ్ గ్రూప్ ఎజెండాను రూపొందించడంలో ట్రోయికా భాగస్వామ్యం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇండోనేషియా, జపాన్, మెక్సికో వంటి గత ప్రెసిడెన్సీలు వేసిన పునాదులపై భారత్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లిందని, బ్రెజిల్ దీనిని ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెజిల్ నుంచి సెక్రటరీ వోల్నీని సమావేశానికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ముందుకు సాగేందుకు భారత్ పూర్తి మద్దతు, నిమగ్నత ఉంటుందని హామీ ఇచ్చారు.
భారత్ జి-20 అధ్యక్ష పదవి చేపట్టిన గత ఎనిమిది నెలల్లో యావత్ దేశం ఎంతో ఉత్సాహంగా పాల్గొందని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 56 ప్రాంతాల్లో 177 సమావేశాలు జరిగాయని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. చర్చల్లో ప్రతినిధులు చురుగ్గా పాల్గొనడంతోపాటు భారతదేశ సామాజిక, సాంస్కృతిక, సహజ వైవిధ్యాన్ని కళ్లారా చూశారని ఆయన పేర్కొన్నారు. 'జీ20 ఎజెండాలోని మౌలిక అంశాల్లో చాలా పురోగతి సాధించాం.
మరో నెలన్నరలో జరిగే సమ్మిట్ మీటింగ్ ఒక మైలురాయిగా నిలుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ ఫలితానికి మీ అందరి సహకారం గణనీయంగా ఉంటుంది" అని ప్రిన్సిపల్ సెక్రటరీ తన ప్రసంగం ముగించారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి మామి మిజుటోరి; భారతదేశ జి 20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్; జీ-20 సభ్యదేశాలు, అతిథి దేశాలసభ్యులు; . అంతర్జాతీయ సంస్థల అధికారులు; వర్కింగ్ గ్రూప్ చైర్మన్ శ్రీ కమల్ కిశోర్; నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1942391)
Visitor Counter : 144
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam