బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 223.36 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి అయిన బొగ్గు


2023 ఏప్రిల్-జూన్ లో 9.85% పెరిగిన కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి

2023 జూన్ చివరి నాటికి 37.62% వృద్ధి చెందిన బొగ్గు నిల్వలు

Posted On: 21 JUL 2023 1:35PM by PIB Hyderabad

భారతదేశ బొగ్గు రంగం 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 223.36 మిలియన్ టన్నుల (ఎంటి) బొగ్గు ఉత్పత్తి చేసి ఉత్పత్తి రంగంలో మరో  మైలురాయిని సాధించింది,  2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో దేశంలో 205.76 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి  8.55% మేరకు పెరిగింది. 

కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) 2023 ఏప్రిల్ మరియు జూన్ మధ్య 175.48 మెట్రిక్ టన్నుల బొగ్గు  ఉత్పత్తి చేసింది.  అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో  159.75 మెట్రిక్ టన్నుల బొగ్గును కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఉత్పత్తితో పోల్చి చూస్తే కోల్ ఇండియా లిమిటెడ్ 9.85%  వృద్ధి రేటు నమోదు చేసింది.  తన ఇంధన అవసరాలు  తీర్చడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి  భారతదేశం పటిష్ట చర్యలు అమలు చేస్తోందని బొగ్గు ఉత్పత్తి గుణకాలు తెలియజేస్తున్నాయి. 

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 ఏప్రిల్- మే మధ్య కాలంలో బొగ్గు దిగుమతులు 16.76 శాతం పెరిగాయి. 2023 ఏప్రిల్ నుంచి 2023 మే వరకు బొగ్గు దిగుమతులు 16.76 శాతం పెరగడానికి కారణం  ప్రధానంగా బొగ్గు దిగుమతి ధరలు గణనీయంగా తగ్గడమే అని  గుర్తించాల్సి ఉంటుంది. . 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బొగ్గు దిగుమతి ధరలు 60 శాతానికి పైగా తగ్గాయి. దీనివల్ల   నోటిఫైడ్ ధరలపై కోల్ ఇండియా లిమిటెడ్ నిర్వహించిన  ప్రీమియం ఈ  -వేలం గణనీయమైన తగ్గింపును చూసింది.దిగుమతి ధరలు గణనీయంగా తగ్గడంతో  జూన్ 2022 లో 357% ఉన్న ప్రీమియం  జూన్ 2023 నాటికి  54% కు తగ్గింది, బొగ్గు వేలంపై ప్రీమియం పరిశ్రమ నాడి తెలియజేస్తుంది. ప్రీమియం బొగ్గు వేలం  గణనీయంగా తగ్గడం దేశీయ మార్కెట్లో తగినంత బొగ్గు లభ్యతను సూచిస్తుంది. ఈ దిగుమతి ధరల క్షీణత బొగ్గు దిగుమతి సరళిని  రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

బొగ్గు లభ్యత విషయానికొస్తే  జూన్ 23 చివరి నాటికి దేశంలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి.  దేశంలో  107.15 మెట్రిక్ టన్నుల (బొగ్గు కంపెనీల వద్ద 67 మెట్రిక్ టన్నులు, టిపిపి (డిసిబి) వద్ద 33.61 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ వాషరీస్ / గుడ్ షెడ్ సైడింగ్ / పోర్టులలో 6.54 మెట్రిక్ టన్నులు) మేరకు బొగ్గు నిల్వలు ఉన్నాయి, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే బొగ్గు నిల్వలు  37.62% వరకు పెరిగాయి. బొగ్గు నిల్వలు సంతృప్తికరంగా ఉండడంతో  బొగ్గుపై ఆధారపడిన వివిధ రంగాలకు స్థిరమైన సరఫరా జరుగుతోంది. దీనివల్ల దేశంలో  ఇంధన భద్రత కు భరోసా కలుగుతుంది. 

 బొగ్గు పరిశ్రమ అమలు చేసిన  సంఘటిత ప్రయత్నాలు,  పెరుగుతున్న ఇంధన అవసరాలు తీర్చడానికి జరుగుతున్న ప్రయత్నాల వల్ల దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.. రికార్డు స్థాయి గణాంకాలు పరిశ్రమ స్థితిస్థాపకతను ప్రదర్శించడమే కాకుండా స్థిరమైన వృద్ధి కోసం కృషి చేస్తూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తాయి. 

 

***


(Release ID: 1941526) Visitor Counter : 186