సహకార మంత్రిత్వ శాఖ

'ప్రాథమిక వ్యవసాయ సంఘాల (పీఏసీఎస్) ల ద్వారా సీఎస్ఈ సేవలు' అనే అంశంపై ఏర్పాటైన జాతీయ సదస్సును 2023 జూలై 21న ప్రారంభించనున్న కేంద్ర సహకార, హోం సహక మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా పీఏసీఎస్ లను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న సహకార మంత్రిత్వ శాఖ
దేశంలో సహకార సంఘాలకు పీఏసీఎస్ వెన్నెముక, గ్రామీణ ప్రాంతాల్లో పీఏసీఎస్ ద్వారా సీఎస్‌సీ సేవలను అందించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

సహకార ఉద్యమానికి ఆధారం అయిన పీఏసీఎస్ ల సామర్థ్యం ఎక్కువ చేయడానికి చర్యలు అమలు చేస్తున్న సహకార మంత్రిత్వ శాఖ

సంబంధిత వర్గాలతో సంప్రదించిన తర్వాత సహకార మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాల ద్వారా 25కి మించి విభిన్న ఆర్థిక కార్యకలాపాలను చేపట్టి కార్యకలాపాలు విస్తరించనున్న పీఏసీఎస్ లు

సాధారణ సేవా కేంద్రాలుగా పనిచేయడం, ఎఫ్‌పిఓ లను ఏర్పాటు చేయడం, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడం, రిటైల్ పెట్రోల్/డీజిల్ పంప్ అవుట్‌లెట్‌లు, జన్ ఔషధి కేంద్రాలు, ఎరువుల పంపిణీ కేంద్రాలు తెరవడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్న పీఏసీఎస్

సీఎస్‌సీ సేవలను అందించడం ద్వారా మరింత బలోపేతం కానున్న పీఏసీఎస్ లు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కో

Posted On: 19 JUL 2023 5:10PM by PIB Hyderabad

'ప్రాథమిక వ్యవసాయ సంఘాల (పీఏసీఎస్) ల ద్వారా సీఎస్ఈ సేవలు' అనే అంశంపై ఏర్పాటైన జాతీయ సదస్సును  2023 జూలై 21న కేంద్ర సహకార, హోం సహకార  మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సదస్సు జరుగుతుంది.  కేంద్ర ఎలక్ట్రానిక్స్,ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్  కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎస్‌సీ సహకారంతో సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సదస్సు  నిర్వహిస్తోంది. కార్యక్రమంలో  పీఏసీఎస్ ద్వారా  సీఎస్ఈ   సేవలకు సంబంధించిన వివిధ అంశాలు సదస్సులో చర్చకు రానున్నాయి. . ఇప్పటి వరకు,17,000  పీఏసీఎస్  లు  సీఎస్‌సీ   పోర్టల్‌లో అనుసంధానం అయ్యాయి.  6,000  పీఏసీఎస్ ల ద్వారా త్వరలో సీఎస్ఈ సేవలు అందించనున్నాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వం, కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో  దేశవ్యాప్తంగా పీఏసీఎస్ లను బలోపేతం చేయడానికి  సహకార మంత్రిత్వ శాఖ  అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. 

దీనివల్ల  ఇది దేశంలో కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. సహకార రంగానికి వెన్నుముక గా  పిఎసిఎస్‌లు ఉన్నాయి.  గ్రామీణ ప్రాంతాల్లో పిఎసిఎస్ ద్వారా సిఎస్‌సి సేవలను అందించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దేశ సహకార ఉద్యమాన్ని పీఏసీఎస్ మరింత బలోపేతం చేస్తాయి. దీనిని గుర్తించిన మోడీ ప్రభుత్వం  పీఏసీఎస్ ల సామర్ద్యాన్ని పెంపొందించడానికి పటిష్ట చర్యలు అమలు చేస్తోంది. గ్రామీణులకు రుణ సౌకర్యం కల్పిస్తున్న పీఏసీఎస్ లు  సహకార మంత్రిత్వ శాఖ నియంత్రణలో పని చేస్తున్నాయి. 

మోదీ ప్రభుత్వం తొలిసారిగా దేశంలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణపై కసరత్తు చేస్తోంది. సహకార  వ్యవస్థ లో పారదర్శకతను తీసుకు వచ్చి పీఏసీఎస్  ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపరచడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.  పీఏసీఎస్‌ను బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ, కోఆపరేటివ్ డేటాబేస్‌ను రూపొందిస్తోంది. పీఏసీఎస్‌ను బహుళ ప్రయోజనకరంగా మార్చడం ద్వారా, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రధాని మోదీ ఒక ముఖ్యమైన అడుగు వేశారు. విత్తనాలు, సేంద్రియ వ్యవసాయ మార్కెటింగ్,  రైతుల ఉత్పత్తుల ఎగుమతి కోసం బహుళ రాష్ట్ర సహకార సంఘాలు  ఏర్పడ్డాయి.

సంబంధిత వర్గాలతో  సంప్రదించిన తర్వాత సహకార మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ బైలాస్ వల్ల పీఏసీఎస్ లు  పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, గోడౌన్లు, కస్టమ్ నియామక కేంద్రాలు, చౌక  ధరల దుకాణాలు, ఎల్పీజీ సరఫరా, డీజిల్/పెట్రోల్ డిస్ట్రిబ్యూటర్‌షిప్ లాంటి దాదాపు 25  ఆర్థిక కార్యకలాపాలను చేపట్టి తమ కార్యకలాపాలు విస్తరించడానికి అవకాశం కలుగుతుంది. 

సంబంధిత మంత్రిత్వశాఖలతో సంప్రదింపుల జరిపిన తర్వాత పీఏసీఎస్‌ల ద్వారా   సాధారణ సేవా కేంద్రాలు ,ఎఫ్పీఓ లను ఏర్పరచడం,ఎల్పీజీ   డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడం, రిటైల్ పెట్రోల్/డీజిల్ పంపు అవుట్‌లెట్‌లు, జన ఔషధి కేంద్రాలను తెరవడం, ఎరువుల పంపిణీ కేంద్రాలుగా పనిచేయడం వంటి కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సీఎస్ఈ   సేవలను అందించడం ద్వారా  పీఏసీఎస్ లు మరింత బలోపేతం అవుతాయి. దీనివల్ల  దేశంలో ఉమ్మడి సేవా కేంద్రం వంటి సౌకర్యాలు పీఏసీఎస్ లలో అందుబాటులోకి వస్తాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది.  గ్రామ-స్థాయి సహకార పరపతి సంఘాలు,  రాష్ట్ర సహకార బ్యాంకులు  నేతృత్వంలోని మూడు-స్థాయి సహకార క్రెడిట్ నిర్మాణంలో చివరి  లింక్‌గా పీఏసీఎస్ లు పనిచేస్తాయి. వివిధ వ్యవసాయ,వ్యవసాయ కార్యకలాపాల కోసం రైతులకు స్వల్పకాలిక , మధ్యకాలిక వ్యవసాయ రుణాలను పీఏసీఎస్ లు అందిస్తున్నాయి. 

 సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.. వర్మ, సహకార కార్యదర్శి శ్రీ జ్ఞానేష్ కుమార్, ఎలక్ట్రానిక్స్,ఐటీ  మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, సిఎస్‌సి  -ఎస్పీవీ  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ రాకేష్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.   ఈ కార్యక్రమంలో ‘పిఎసిఎస్‌ ద్వారా సిఎస్‌సి సేవల పంపిణీ’పై లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు.

సిఎస్‌సి వ్యవస్థలోకి పీఏసీఎస్‌లను తీసుకురావడానికి 2019లో సిఎస్‌సి  - ఎస్పీవీ  ఒడిషా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.   పిఎసిఎస్ యూనియన్ అభ్యర్థన మేరకు సిఎస్‌సి సేవలను అందించడానికి అస్సాం , తమిళనాడులోని పిఎసిఎస్‌లకు శిక్షణ ఇచ్చారు. 2021 సెప్టెంబర్, 01 న, జార్ఖండ్ ప్రభుత్వం నుంచి అభ్యర్ధన మేరకు సిఎస్‌సి వ్యవస్థలోకి పీఏసీఎస్‌లను   ఏకీకృతం చేయడానికి జార్ఖండ్ సహకార సంఘాలతో  సిఎస్‌సి  -ఎస్పీవీ  రిజిస్ట్రార్, ఒప్పందం  కుదుర్చుకుంది.  కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ సమక్షంలో పీఏసీఎస్‌లకు సిఎస్‌సి సేవలను అందించడానికి కుదిరిన ఒక ఒప్పందంపై 2023 ఫిబ్రవరి 1న సంతకాలు జరిగాయి.  మొదటి దశలో 63,000 మంది పీఏసీఎస్‌లకు సీఎస్‌సీలుగా పని చేసేందుకు శిక్షణ ఇచ్చారు. రెండో దశలో మరో 30 వేల మంది పీఏసీఎస్‌లకు శిక్షణ ఇస్తారు. 

మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న  డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రధాన కార్యక్రమంగా  కామన్ సర్వీసెస్ సెంటర్‌లు (సిఎస్‌సి) కార్యక్రమం అమలు జరుగుతోంది.  దేశవ్యాప్తంగా 5,20,000 పైగా సిఎస్‌సిలు గ్రామీణ, సెమీ-అర్బన్  పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ, ప్రజా సేవల డెలివరీ పాయింట్‌లుగా పనిచేస్తున్నాయి. కార్యక్రమం అమలు, పర్యవేక్షణ  కోసం సిఎస్‌సి  ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ను కేంద్ర  ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  2009లో కంపెనీల చట్టం, 1956 ప్రకారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. 

 

***(Release ID: 1940904) Visitor Counter : 122