బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు, లిగ్నైట్ గనుల స్టార్ రేటింగ్ నమోదుల కోసం చివరి తేదీ పొడిగింపు
Posted On:
19 JUL 2023 3:18PM by PIB Hyderabad
బొగ్గు, లిగ్నైట్ గనుల స్టార్ రేటింగ్ & స్వీయ-మూల్యాంకనం కోసం నమోదు చేసుకునే చివరి తేదీని ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పొడిగించింది. స్టార్ రేటింగ్ కార్యక్రమంలో ఎక్కువ గనులు పాల్గొనేలా చూడడానికి, ఖచ్చితమైన స్వీయ-మూల్యాంకనాన్ని నిర్ధరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
2022-23 ఆర్థిక సంవత్సరం కోసం, అన్ని బొగ్గు & లిగ్నైట్ గనులు స్టార్ రేటింగ్ కోసం నమోదు చేసుకునేందుకు ఈ ఏడాది 30వ తేదీన మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. నమోదుల కోసం స్టార్ రేటింగ్ పోర్టల్ జూన్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. దీనికి వస్తున్న స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. ఈ నెల 14వ తేదీ నాటికి పోర్టల్‌లో 377 గనులు నమోదయ్యాయి. మరింత ఎక్కువ భాగస్వామ్యం కోసం తుది గడువును పొడిగించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
బొగ్గు, లిగ్నైట్ గనుల్లో స్థిరమైన తవ్వకం పద్ధతులను ప్రోత్సహించడంలో, మొత్తం పనితీరును మెరుగుపరచడంలో స్టార్ రేటింగ్ వ్యవస్థ ప్రాముఖ్యతను బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పర్యావరణ సుస్థిరత, భద్రత, సామాజిక బాధ్యత విషయాల్లో తమ నిబద్ధతను చాటి చెప్పేందుకు తేదీ పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అర్హత గల గనులను ఇది ప్రోత్సహిస్తుంది.
***
(Release ID: 1940901)
Visitor Counter : 135