ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్-19 నిబంధనలను సరళీకరించిన కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
Posted On:
19 JUL 2023 1:07PM by PIB Hyderabad
దేశంలో కొవిడ్-19 పరిస్థితిని, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల వినియోగంలో వృద్ధిని దృష్టిలో పెట్టుకుని; భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కొవిడ్-19 నిబంధనలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సరళంగా మార్చింది.
భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల్లో 2% మందికి ర్యాండమ్‌గా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయాలన్న మునుపటి నిబంధన తొలగించారు. కొత్త మార్గదర్శకాలు ఈ నెల 20వ తేదీ 0000 గంటల (ఐఎస్‌టీ) నుంచి అమలులోకి వస్తాయి.
కొవిడ్-19 నేపథ్యంలో అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై గతంలో జారీ చేసిన సూచనలను మాత్రం విమానయాన సంస్థలు, అంతర్జాతీయ ప్రయాణికులు పాటించాలి.
కొత్త మార్గదర్శకాలను ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.mohfw.gov.in/) ఉంచారు.
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొవిడ్-19 పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.
****
(Release ID: 1940860)
Visitor Counter : 176