నీతి ఆయోగ్

ఐదేళ్లలో 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం కి సంబంధించిన బహుప్రమాణాల సూచికల నుంచి బయటకు వచ్చారు


2015-16 మరియు 2019-21 మధ్య బహుమితీయ పేదల సంఖ్య 24.85% నుండి 14.96%కి బాగా తగ్గింది.

గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59% నుండి 19.28%కి వేగంగా క్షీణించింది.

2030 గడువు కంటే చాలా ముందుగానే ఎస్ డీ జీ 1.2 లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం సరైన దిశ లో ఉంది.

క్షేత్ర స్థాయిలోని మొత్తం 12 ఎం పీ ఐ సూచికలలో గణనీయమైన మెరుగుదలలు.

పేదల సంఖ్య 3.43 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా క్షీణించగా, బీహార్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

పోషకాహారంలో మెరుగుదలలు, పాఠశాల విద్య, పారిశుద్ధ్యం మరియు వంట ఇంధనం పేదరికాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

Posted On: 17 JUL 2023 1:38PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ నివేదిక ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ రివ్యూ 2023’ ప్రకారం 2015-16 మరియు 2019-21 మధ్య రికార్డు స్థాయిలో 13.5 కోట్ల మంది ప్రజలు బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి కె పాల్ మరియు డాక్టర్ అరవింద్ వీరమణి మరియు నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ బి వి ఆర్ సుబ్రహ్మణ్యం సమక్షంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బేరీ ఈ రోజు నివేదికను విడుదల చేశారు.

 

తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే [NFHS-5 (2019-21)] ఆధారంగా, జాతీయ బహుమితీయ పేదరిక సూచిక (MPI) యొక్క ఈ రెండవ ఎడిషన్ రెండు సర్వేలు, ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 4 (2015-16) మరియు ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-5 (2019-21)మధ్య బహుమితీయ పేదరికాన్ని తగ్గించడంలో భారతదేశం యొక్క పురోగతిని సూచిస్తుంది.  ఇది నవంబర్ 2021బేస్‌లైన్ పై  ప్రారంభించబడిన భారతదేశపు జాతీయ ఎం పీ ఐ నివేదిక.  ప్రపంచ వ్యాప్తంగాఅనుసరించిన విస్తృత పద్దతి కి అనుగుణంగా ఈ నివేదిక రూపొందించబడింది. 

 

జాతీయ ఎం పీ ఐ 12 ఎస్డీజీ-సమలేఖన సూచికల కు ప్రాతినిధ్యం వహించే ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణాల యొక్క మూడు సమానమైన ప్రమాణాలు అంతటా ఏకకాలం లో కష్టాలను కొలుస్తుంది. వీటిలో పోషకాహారం, పిల్లలు మరియు కౌమారదశ మరణాలు, తల్లి ఆరోగ్యం, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, గృహాలు, ఆస్తులు మరియు బ్యాంకు ఖాతాలు వంటి మొత్తం 12 సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించింది.

 

2015-16 మరియు 2019-21 మధ్య, ఎం పీ ఐ విలువ 0.117 నుండి 0.066కి దాదాపు సగానికి పడిపోయింది. పేదరికం యొక్క తీవ్రత 47% నుండి 44%కి తగ్గింది, తద్వారా భారతదేశం ఎస్ డీ జీ లక్ష్యం 1.2 (బహుళ పేదరికాన్ని తగ్గించడం) నిర్దేశించిన కాలం 2030 కంటే ముందే సాధించే దిశలో పయనిస్తోంది.  ఇది సుస్థిరమైన మరియు సమానమైన అభివృద్ధిని నిర్ధారించడం ద్వారా ఎస్ డీ జీ లక్ష్యం సాధించే మార్గంలో నిలిచింది. ఇది 2030 నాటికి కనీసం సగానికి పైగా పేదరికాన్ని నిర్మూలించడంపై ప్రభుత్వ వ్యూహాత్మక దృష్టిని ప్రదర్శిస్తుంది, తద్వారా ఎస్ డీ జీ ల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు కట్టుబడి ఉండటాన్ని సూచిస్తుంది.

 

పారిశుధ్యం, పోషకాహారం, వంట ఇంధనం, ఆర్థిక సమ్మిళితం, తాగునీరు మరియు విద్యుత్‌ వినియోగం ను మెరుగుపరచడంపై ప్రభుత్వం అంకితభావంతో దృష్టి సారించడం ఈ రంగాలలో గణనీయమైన పురోగతికి దారితీసింది. ఎం పీ ఐ  మొత్తం 12 పారామీటర్‌లలో గుర్తించదగిన మెరుగుదలలను చూపించాయి. పోషణ్ అభియాన్ మరియు రక్తహీనత ముక్త్ భారత్ వంటి ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు ఆరోగ్య రంగంలో కష్టాల తగ్గింపులకు దోహదపడ్డాయి. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పారిశుధ్యాన్ని మెరుగుపరిచాయి. పారిశుద్ధ్యసమస్య పై వేగంగా 21.8 శాతం పాయింట్ల మెరుగుదలలో ఈ ప్రయత్నాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా సబ్సిడీతో కూడిన వంట ఇంధనాన్ని అందించడం వల్ల జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి, వంట ఇంధనం కొరతలను  తగ్గించడంలో14.6 శాతం పాయింట్లు మెరుగుపడ్డాయి. సౌభాగ్య, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, మరియు సమగ్ర శిక్ష వంటి కార్యక్రమాలు కూడా దేశంలో బహుమితీయ పేదరికాన్ని గణనీయంగా తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా విద్యుత్తు, బ్యాంకు ఖాతాలు మరియు త్రాగునీటి సమస్య లో చాలా తక్కువ  రేట్ల ద్వారా సాధించిన అద్భుతమైన పురోగతి, పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. బలమైన ఇంటర్‌లింకేజ్‌లతో విభిన్నమైన ప్రోగ్రామ్‌లు మరియు కార్యక్రమాలలో స్థిరమైన అమలు ద్వారా బహుళ సూచికల అంతటా సమస్యలను గణనీయంగా తగ్గించడానికి దారితీసింది.

 

నివేదికను www.niti.gov.inలో చదవవచ్చు.

 

 

 

 

భారతదేశం యొక్క బహుమితీయ నివేదిక ప్రకారం పేదల సంఖ్య 2015-16లో 24.85% నుండి 2019-2021లో 14.96%కి 9.89 శాతం పాయింట్ల గణనీయమైన క్షీణతను నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59% నుండి 19.28%కి వేగంగా క్షీణించింది. అదే సమయంలో, పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.65% నుండి 5.27%కి తగ్గింది. ఉత్తరప్రదేశ్ పేదల సంఖ్యలో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది, 3.43 కోట్ల మంది బహుమితీయ పేదరికం నుండి తప్పించుకున్నారు. 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు 707 అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలకు బహుమితీయ పేదరిక అంచనాలను అందిస్తూ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో బహుమితీయ పేదల నిష్పత్తిలో వేగంగా తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.

***



(Release ID: 1940263) Visitor Counter : 989