వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ జోక్యంతో దిగొచ్చిన టమాటా టోకు ధర


నేటి నుంచి టమోటాలను రూ.80కి విక్రయించనున్న ప్రభుత్వం

Posted On: 16 JUL 2023 11:10AM by PIB Hyderabad

దేశంలో టమాటా ధరలు మండిపోతున్న నేపథ్యంలో, టమాటా రేట్లు ఎక్కువగా ఉన్న వివిధ ప్రాంతాల్లో కిలోకు 90 రూపాయల చొప్పున రాయితీపై విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, టొమాటా టోకు ధరలు తగ్గాయి.

దేశంలోని 500 పైగా ప్రాంతాల్లో పరిస్థితిని మరోసారి అంచనా వేసిన తర్వాత, ఈ రోజు (ఆదివారం, జూలై 16, 2023) నుంచి టామాటాలను కిలోకు 80 రూపాయల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీ, నోయిడా, లఖ్‌నవూ, కాన్పుర్, వారణాసి, పట్నా, ముజఫర్‌పూర్, అరా ప్రాంతాల్లో ఈ రోజు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌ ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మార్కెట్ ధరలను బట్టి, రేపటి నుంచి ఈ విక్రయాలను మరిన్ని నగరాలకు విస్తరిస్తారు.

దేశంలోని వినియోగదార్లకు ఉపశమనం కల్పించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

*******


(Release ID: 1940087) Visitor Counter : 173