సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార రంగంలో ఎఫ్ పి ఒ పై జాతీయ మెగా కాన్ క్లేవ్ ను ప్రారంభించిన కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా; పిఎసిఎస్ ద్వారా 1100 కొత్త ఎఫ్ పిఒల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను ఈ రోజు న్యూఢిల్లీలో విడుదల చేసిన శ్రీ అమిత్ షా


పిఎసిఎస్ ల ద్వారా ఏర్పాటైన
ఎఫ్ పి ఒ లకు ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మోదీ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది.

పిఎసిఎస్ ల ద్వారా ఎఫ్ పి ఒ లు రైతులను సుసంపన్నం చేసే అత్యున్నత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి; పిఎసిఎస్ లు, ఎఫ్ పి ఒ లు, స్వయం సహాయక సంఘాల ద్వారా మూడంచెల గ్రామీణాభివృద్ధి, సౌభాగ్యం అనే మంత్రంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, సహకార మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తాయి.

దేశంలోని సన్నకారు రైతులు సుభిక్షంగా ఉండాలంటే సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి; పిఎసిఎస్, ఎఫ్ పి ఒ దీనికి నాంది

వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగంలో సహకారోద్యమం ద్వారా ప్రతి వ్యక్తిని సుభిక్షంగా తీర్చిదిద్దవచ్చు, పెట్టుబడి లేని వారిని సంపన్నులుగా చేయడానికి ఇది ఒక గొప్ప మాధ్యమంగా మారుతుంది.

సహకార సంఘాల ద్వారా వ్యవసాయం, పశుపోషణ, చేపల పెంపకాన్ని బలోపేతం చేస్తే జీడీపీతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

వ్యవసాయం, పశుసంవర్ధక , మత్స్య ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక; ఈ మూడు రంగాలు కలిసి నేడు భారతదేశ జిడిపిలో 18% ఉన్నాయి, వాటిని బలోపేతం చేయడం అంటే దేశ ఆర్థ

Posted On: 14 JUL 2023 3:56PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో సహకార రంగంలో ఎఫ్ పిఒపై జాతీయ మెగా కాన్ క్లేవ్ ను ప్రారంభించారు పిఎసిఎస్ ద్వారా 1100 కొత్త ఎఫ్ పిఒల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బిఎల్ వర్మ, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జ్ఞానేష్ కుమార్ , వ్యవసాయ - రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా తదితరులు పాల్గొన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విభిన్న దార్శనికతతో ఒక ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని శ్రీ అమిత్ షా

తన ప్రసంగంలో తెలిపారు. మన దేశంలో సహకార ఉద్యమం చాలా పురాతనమైనదని, కానీ స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దేశంలో సహకార ఉద్యమం అనేక భాగాలుగా చీలిపోయినట్లు కనిపించిందని ఆయన అన్నారు. సహకార సంఘాల కోణం నుంచి దేశాన్ని-  సహకార ఉద్యమం ముందుకు సాగడంలో , బలోపేతం చేయడంలో విజయం సాధించిన రాష్ట్రాలు, సహకార ఉద్యమం ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు,  సహకార ఉద్యమం దాదాపు ఉనికి కోల్పోయిన రాష్ట్రాలు-  అని మూడు వర్గాలుగా విభజించవచ్చునని ఆయన పేర్కొన్నారు. సుమారు 65 కోట్ల మంది ప్రజలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న ఇంత పెద్ద దేశంలో, సహకార ఉద్యమాన్ని పునరుద్ధరించడం, ఆధునీకరించడం, పారదర్శకత తీసుకురావడం, కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే లక్ష్యం చాలా అవసరం అని శ్రీ షా అన్నారు. సహకార సంఘాల ద్వారానే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ప్రతి వ్యక్తిని సంపన్నులుగా తీర్చిదిద్దగలమన్నారు.

పెట్టుబడి ఉందా లేదా అన్నది ముఖ్యం కాదని, కష్టపడి పనిచేసే ధైర్యం, అభిరుచి, ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉంటే పెట్టుబడి లేని అలాంటి వారిని సుభిక్షంగా తీర్చిదిద్దడానికి సహకార ఉద్యమం ఒక గొప్ప మాధ్యమం అని శ్రీ షా అన్నారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న దేశంలోని 65 కోట్ల మంది ప్రజలను బలోపేతం చేయడానికి, సహకార సంఘాల ద్వారా వారి చిన్న పెట్టుబడిని కలిపి పెద్ద మూలదనంగా మార్చడం ద్వారా వారిని సంపన్నులుగా చేయడానికి సహకార ఉద్యమం ఎంతో దోహదం చేయగలదని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ

గత రెండు సంవత్సరాలుగా అనేక

కార్యక్రమాలను చేపట్టిందని కేంద్ర

సహకార శాఖ మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ల నేతృత్వంలో దేశంలో ఎఫ్ పి ఒ ల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని

ఆయన తెలిపారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, రైతులు సుభిక్షంగా

ఉండడానికి అనేక చర్యలు

తీసుకున్నారని, అందులో ఎఫ్ పి ఒ లు ఒకటి అని ఆయన అన్నారు. వీటి ద్వారా రైతులు ఎంతో ప్రయోజనం పొందారని, , కానీ సహకార రంగంలో, ఎఫ్ పిఒ , దాని ప్రయోజనాలు చాలా పరిమిత స్థాయికి చేరాయని, అసలు లక్ష్యాన్ని సాధించడానికి తాము లక్ష్యాలను నిర్ణయించకపోవడం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పి ఎ సి ఎస్ - ఎఫ్ పి ఒ గా మారితే - ఎఫ్ పి ఒ ఎఫ్ పి ఒ ప్రయోజనాలు పి ఎ సి ఎస్  లోని రైతులందరికీ అందుతాయని అన్నారు. పి ఎ సి ఎస్   ల ద్వారా ఏర్పాటైన ఎఫ్ పి ఒ లకు రైతులను సంపన్నులుగా మార్చే పూర్తి సామర్ధ్యం ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, సహకార మంత్రిత్వ శాఖ కలసి పీఏసీఎస్ లు, ఎఫ్ పీవోలు, స్వయం సహాయక సంఘాల ద్వారా మూడంచెల గ్రామీణాభివృద్ధి, సౌభాగ్యం అనే మంత్రంతో పనిచేస్తాయని తెలిపారు.

పీఏసీఎస్ లు ఎఫ్ పీవో కావాలనుకుంటే ఎన్ సీడీసీ వారికి సహాయం చేస్తుందని, దీనికి పరిమితి లేదని అన్నారు. ఈ సదస్సు దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు.

 

వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య ఆధారిత ఆర్థిక కార్యకలాపాలే భారత ఆర్థిక వ్యవస్థకు బలమని, కానీ దేశంలో వాటి గురించి ఎప్పుడూ చర్చించలేదని శ్రీ అమిత్ షా అన్నారు. నేడు ఈ మూడు రంగాలు కలిసి భారత జీడీపీలో 18 శాతం వాటాను కలిగి ఉన్నాయన్నారు. ఒకరకంగా వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యరంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని, వాటిని బలోపేతం చేయడమంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమేనని అమిత్ షా అన్నారు. ఉత్పాదక రంగం ద్వారా జీడీపీ పెరిగితే ఉపాధి గణాంకాలు అంతగా పెరగవని, సహకార సంఘాల ద్వారా వ్యవసాయం, పశుపోషణ, మత్స్యరంగం బలోపేతం అయితే జీడీపీతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.

 

భారతదేశంలో 65 శాతం మంది ప్రజలు నేరుగా వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని, అంటే శ్రామిక శక్తిలో 55 శాతం మంది వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో ఉన్నారని కేంద్ర హోం , సహకార మంత్రి తెలిపారు. ఇతర సేవలన్నీ కూడా పరోక్షంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయన్నారు. నేడు దేశంలో 86 శాతం మంది రైతులు ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులేనని శ్రీ షా అన్నారు. సన్నకారు రైతులను కూలీలుగా మారనివ్వని ఏకైక దేశం మొత్తం ప్రపంచంలో భారత్ ఒక్కటే అని, వారి భూములకు వారే యజమానులని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు పొందడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, సంప్రదాయ పద్ధతులను వదిలి నేటి సమకాలీన పద్ధతులను అవలంబించాలని, ఎఫ్పిఒలుగా ఈ పిఎసిఎస్ ఈ శ్రేణిలో కొత్త ప్రారంభం అని ఆయన అన్నారు.

 

వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న వారందరి జీవితం సేవా రంగంలో నిమగ్నమైన వారి జీవితాలతో సమానంగా సౌకర్యవంతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, సహకార రంగంపై ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో 2003లో యోగేంద్ర అలగ్ కమిటీ ఎఫ్ పి ఒ సిఫార్స్ చేసిందని, శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యాక ఎఫ్ పి ఒ సిఫార్సు  అమలు చేయాలని నిర్ణయించారని శ్రీ అమిత్ షా తెలిపారు.

నేడు దేశంలో 11,770 ఎఫ్ పి ఒ లు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా దేశంలోని లక్షలాది మంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో విజయవంతమయ్యారని శ్రీ షా అన్నారు.

10,000 ఎఫ్ పి ఒ లను ఏర్పాటు చేస్తామని బడ్జెట్ లో ప్రకటించారని, 2027 నాటికి దీనిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రూ.6900 కోట్లు కేటాయించిందన్నారు. ఇన్ పుట్ నుండి అవుట్ పుట్ వరకు, తయారీ నుండి ప్రాసెసింగ్ - గ్రేడింగ్ వరకు , ప్యాకేజింగ్ నుండి మార్కెటింగ్ - స్టోరేజ్ వరకు మొత్తం వ్యవస్థ, అంటే వ్యవసాయ ఉత్పత్తి నుండి మార్కెటింగ్ వరకు మొత్తం వ్యవస్థ ఎఫ్ పిఒ కింద ఉండాలనే భావనతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందుకు వచ్చారని శ్రీ షా చెప్పారు.

ఇన్ పుట్ల సేకరణ, మార్కెట్ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల వ్యాప్తి, ఉత్పత్తికి అవసరమైన ఇన్ పుట్ల సమీకరణ, నిల్వ, ఎండబెట్టడం, క్లీనింగ్, గ్రేడింగ్ వంటి సౌకర్యాలను ఎఫ్ పీవోలు చేపట్టాయని చెప్పారు. బ్రాండ్ బిల్డింగ్ తో పాటు ప్యాకేజింగ్, లేబులింగ్, స్టాండర్డైజేషన్ ప్రక్రియలు, క్వాలిటీ కంట్రోల్, సంస్థాగత కొనుగోలుదారులు, కార్పొరేట్ సంస్థలతో కలిసి రైతుకు అధిక ధర లభించేలా కూడా ఎఫ్ పీవోలు ఏర్పాట్లు చేశాయి. అన్ని ప్రభుత్వ పథకాలను రైతులకు తెలియజేస్తూ పథకాలను వ్యాప్తి చేయడానికి ఎఫ్ పి ఓ లు మాధ్యమంగా కూడా మారాయి.

 

దేశంలోని అన్ని ఎఫ్ పి ఓ లు  ఇదే పద్ధతిలో పనిచేయాలని, అలాగే పీఏసీఎస్ లను సమన్వయం చేయాలని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పిలుపునిచ్చారు. పి ఎ సి ఎస్- ఎఫ్ పి ఒ ల మధ్య సర్దుబాటు ఆధారంగా సమాచార మార్పిడి, ప్రాఫిట్ షేరింగ్, మార్కెటింగ్ కోసం కంప్లీటర్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా కొత్త హైబ్రిడ్ మోడల్ ను రూపొందించాలన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటి వరకు ఎఫ్ పీ ఓ లకు రూ.127 కోట్లకు పైగా రుణాలు అందించిందని, ఇది రూ.6,900 కోట్లకు అదనం  అని శ్రీ షా తెలిపారు. గిరిజన జిల్లాలలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పనుల కోసం 922 ఎఫ్ పీ ఓ లను ఏర్పాటు చేశారు.

మోదీ ప్రభుత్వం, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఎంత సునిశితంగా ముందుకు సాగుతున్నాయో ఇది తెలియజేస్తుందని, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఎఫ్ పి ఓ ల రంగంలో అద్భుతమైన పనితీరును కనబరిచాయని శ్రీ అమిత్ షా చెప్పారు.

 

వ్యవసాయం లాభసాటి వ్యాపారమనే నమ్మకాన్ని మనం యువతలో

పెంపొందింప చేయాలని, సరైన మార్కెటింగ్ తో ఆధునిక పద్ధతిలో ఆచరించాల్సిన అవసరం ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. ఇలాంటి నమ్మకాన్ని దేశంలోని 12 కోట్ల మంది రైతుల్లో పెంపొందిస్తే వ్యవసాయోత్పత్తి పెరగడమే కాకుండా జీడీపీలో వ్యవసాయం వాటా కూడా పెరుగుతుందన్నారు. అలాగే ఇది ఈ 12 కోట్ల మంది రైతులను స్వయం సమృద్ధి కలిగిన వారిగా మార్చడమే కాకుండా దేశం స్వయం సమృద్ధి సాధించడానికి కూడా దోహదం చేస్తుంది. సాధిస్తుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ విషయంలో అనేక కార్యక్రమాలను చేపట్టారని, ఇప్పుడు

సహకారం -  ఎఫ్ పీఓ  ద్వారా రైతులను వ్యాపార వేత్తలుగా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మార్చే దిశలో మోదీ ప్ర భుత్వం ముందుకు సాగుతోందని  శ్రీ షా అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు 5.6 రెట్లు పెరిగాయని అమిత్ షా తెలిపారు. 2013-14లో వ్యవసాయ బడ్జెట్ రూ.21,000 కోట్లు కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2023-24లో అది రూ.1.15 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.

గతంలో ఉమ్మడి బడ్జెట్ రూ.21 వేల కోట్లు కాగా, ఇప్పుడు వ్యవసాయ శాఖ బడ్జెట్ రూ.1.15 లక్షల కోట్లుగా ఉందన్నారు. వ్యవసాయానికి ప్రధాని, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు.

 

దేశంలో 2013-14లో 26.5 కోట్ల టన్నులు, 2022-23లో 32.4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని అమిత్ షా తెలిపారు. కొంతమంది రైతులు

ఎం ఎస్ పి గురించి మాట్లాడాలను కుంటున్నారని, దానిపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 10 సంవత్సరాలలో వరి ఎంఎస్ పిలో 55%, గోధుమల ఎంఎస్ పిలో 51% పెరుగుదల ఉందని శ్రీ షా చెప్పారు. స్వాతంత్య్రానంతరం రైతులు చేసిన ఖర్చు కంటే కనీసం 50 శాతం ఎక్కువ లాభాన్ని నిర్ణయించిన తొలి ప్రభుత్వం మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ధాన్యం సేకరణను 88% పెంచిందని, అంటే దాదాపు రెట్టింపు ధాన్యం సేకరించామని, గోధుమల సేకరణ మూడింట రెండు వంతులు అంటే 72% పెరిగిందని ఆయన అన్నారు. 251 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే పనిని మోదీ ప్రభుత్వం చేసిందని, లబ్ధిదారుల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందన్నారు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు.

వీటితో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, 60 లక్షల మంది రైతులకు 72 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ఫండ్ ఏర్పాటు, నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఏర్పాటు, రూ.24,000 కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణకు నిధి ఏర్పాటు, ఈ-నామ్ ద్వారా 1260 మండీలను అనుసంధానం చేసే పనిని కూడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిందని

వివరించారు.

 

మోదీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు వచ్చాయని, ఇప్పుడు సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని, దాని ప్రయోజనాలు రైతులకు చేరేలా చేశామని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. సహకార మంత్రం ప్రకారం, ఆయా రంగాలలో కష్టపడి పనిచేసే వారికే లాభం వెళ్తుందని, దీనిని సహకార మంత్రిత్వ శాఖ నిర్ధారించిందని ఆయన అన్నారు.

 

సహకార రంగంలో మోదీ ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందని శ్రీ అమిత్ షా అన్నారు. పి ఎ సి ఎస్ ల  బైలాస్ రూపొందించామని, వాటిని 26 రాష్ట్రాలు ఆమోదించాయని తెలిపారు. ఇకపై పి ఎ సి ఎస్ లు డెయిరీ, మత్స్యకారుల కమిటీగా పనిచేస్తాయని, అలాగే , పెట్రోల్ పంపు, గ్యాస్ ఏజెన్సీ, సీఎస్ సీ, చౌక ధాన్యాల , చౌక మందుల దుకాణాలు, స్టోరేజీ నిర్వహణ పనులు కూడా చేసుకోవచ్చన్నారు. అంతే కాదు గ్రామంలోని హర్ ఘర్ జల్ కమిటీ ఆధ్వర్యంలో పి ఎ సి ఎస్ లు  నీటి నిర్వహణలో వాణిజ్యపరమైన పనులు నిర్వహించగలవు. 22 వేర్వేరు పనులను పి ఎ సి ఎస్  లతో అనుసంధానం చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పి ఎ సి ఎస్  లు బలంగా లేకపోతే ఎ పి ఎ సి లు ఎప్పటికీ బలపడలేవన్నారు. ఎఫ్ పిఓలు, పి ఎ సి ఎస్ లు, స్వయం సహాయక సంఘాలు ఒకదానికొకటి సహకరించుకుంటే రానున్న రోజుల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధిలో కొత్త శకం ప్రారంభమవుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.

 

****


(Release ID: 1939655) Visitor Counter : 212