భారత ఎన్నికల సంఘం

అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఎ-వెబ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు 11వ సమావేశంలో పాల్గొన్న సి ఇ సి రాజీవ్ కుమార్


ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే నకిలీ కథనాలు వంటి సవాళ్లపై పనిచేయడానికి ఎ-వెబ్ వంటి వేదికలు ఇఎంబి ల కోసం కీలక పాత్ర పోషిస్తా యి: సిఇసి రాజీవ్ కుమార్

Posted On: 12 JUL 2023 1:37PM by PIB Hyderabad

కొలంబియాలోని కార్టజెనా లో అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఎ-వెబ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు 11వ సమావేశానికి హాజరవుతున్న ముగ్గురు సభ్యుల భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ప్రతినిధి బృందానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలక్షన్ మేనేజ్ మెంట్ బాడీస్

 

(ఇ ఎం బి) ల అతిపెద్ద అసోసియేషన్, దీనిలో 119 ఇ ఎం బి లు సభ్యులుగా, 20 ప్రాంతీయ సంఘాలు/సంస్థలు అసోసియేట్ సభ్యులుగా ఉన్నాయి.

కొలంబియాలోని నేషనల్ సివిల్ రిజిస్ట్రీ 2023 జూలై 13న 'ప్రాంతీయ ఎన్నికల సవాళ్లపై ప్రపంచ దృక్పథం' అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును కూడా నిర్వహిస్తోంది.

 

చర్చల సందర్భంగా సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఇఎంబిల మధ్య సహకారాన్ని పెంపొందించడం,  తద్వారా ఒకరి అనుభవాలు ఉత్తమ పద్ధతుల నుండి నేర్చుకోవడానికి వీలు కల్పించడంలో గ్లోబల్ అసోసియేషన్ గా ఎ-వెబ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న నకిలీ కథనాలను ఎదుర్కోవడం వంటి సవాళ్లపై ఎ-వెబ్ వంటి వేదికల ద్వారా ఇఎంబి లు కలిసి పనిచేయగలవని ఆయన నొక్కి చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఎ-వెబ్ ఇండియా సెంటర్ తో సహా ఎ-వెబ్ , దాని ప్రాంతీయ కార్యాలయాల వార్షిక పురోగతి నివేదిక, బడ్జెట్ , సభ్యత్వ సంబంధిత విషయాలు, 2023-24లో ఏ-వెబ్ చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యకలాపాల తో సహా వివిధ అజెండా అంశాలపై చర్చించారు.

 

సమావేశంలోని ఇతర ఎజెండా అంశాలలో, సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ ఈసిఐ ప్రతిపాదనలను లేవనెత్తారు. అవి; (1) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలలో సభ్య ఇఎంబిలు తీసుకున్న ఎన్నికల ఉత్తమ పద్ధతులు చొరవలకు భాండాగారంగా ఉపయోగపడే ఎ-వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేయడం,(ii) ప్రజాస్వామిక ప్రక్రియలలో గణనీయమైన సహకారం అందించే, ముఖ్యమైన చొరవ తీసుకునే ఇఎంబి లకు ఎ-వెబ్ గ్లోబల్ అవార్డులను ఏర్పాటు చేయడం. ఈ రెండు ప్రతిపాదనలకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపింది.

  

సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ తో పాటు కొలంబియా నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సివిల్ రిజిస్ట్రీ శ్రీ అలెగ్జాండర్ వెగా రోచా, దక్షిణాఫ్రికా ఎన్నికల కమిషన్ చైర్ పర్సన్ శ్రీ మోసోతో మొపియా, సెంట్రల్ ఎలక్టోరల్ బోర్డ్ డొమినికన్ రిపబ్లిక్ లీడ్ మెంబర్ శ్రీమతి పాట్రిసియా లోరెంజో పానియాగువా, పనామా ఎలక్టోరల్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ మేజిస్ట్రేట్ శ్రీ ఆల్ఫ్రెడో జున్కా వెండెహాకే , ఈక్వెడార్ ఎన్నికల వివాదాల ట్రిబ్యునల్ అధ్యక్షుడు శ్రీ ఫెర్నాండో మినోజ్ బెనిటెజ్ పాల్గొన్నారు.

 

ఇ సి ఐ ప్రతినిధి బృందంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనోజ్ సాహూ, జాయింట్ డైరెక్టర్ అనుజ్ చందక్ ఉన్నారు. ఈ సమావేశంలో 2022-23లో ఇండియా ఎ-వెబ్ సెంటర్ కార్యకలాపాలపై డీఈసీ శ్రీ మనోజ్ సాహూ సంక్షిప్త ప్రజెంటేషన్ ఇచ్చారు.

 

11వ ఎ-వెబ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం సందర్భంగా ఇ సి ఐ ల ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ పై రిపబ్లిక్ ఆఫ్ కొరియా జాతీయ ఎన్నికల సంఘంతో ద్వైపాక్షిక సమావేశం కూడా జరిగింది. 2012లో భారత్, దక్షిణ కొరియాలు ఎన్నికల నిర్వహణ రంగంలో పరస్పర సహకార సంబంధాలను ఏర్పరచుకునేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

సెమినార్లు, కాన్ఫరెన్స్ లు , అబ్జర్వర్ కార్యక్రమాల కోసం క్రమం తప్పకుండా అధికారుల సందర్శనల ద్వారా రెండు ఇఎంబిలు చురుకైన ద్వైపాక్షిక మార్పిడి, కార్యకలాపాలు కలిగి ఉంటాయి. 2023 మార్చిలో 'డెమోక్రసీ కోహోర్ట్ ఆన్ ఎలక్షన్స్ ఇంటిగ్రిటీ' ఆధ్వర్యంలో ఇ సి ఐ నిర్వహించిన 'సమ్మిళిత ఎన్నికలు, ఎన్నికల సమగ్రత' అనే అంశంపై జరిగిన 3వ అంతర్జాతీయ సదస్సులో ఎన్ ఇ సి పాల్గొంది.

 

నేపథ్యం: ఇ సిఐ అండ్ ఎ-వెబ్

 

సభ్య దేశాలలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుస్థిర ప్రజాస్వామ్యాన్ని సాధించాలనే భాగస్వామ్య దార్శనికతకు అనుగుణంగా 2013 అక్టోబరులో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని సియోల్ లో ఎ-వెబ్ ను ఏర్పాటు చేశారు. 2011-12 నుండి ఎ-వెబ్ ఏర్పాటు ప్రక్రియతో ఇసిఐ చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది.  అక్టోబర్ 2013 లో ప్రారంభమైనప్పటి నుండి వరుసగా రెండు పర్యాయాలు (2013-15 , 2015-17) దాని ఎగ్జిక్యూటివ్ బోర్డు లో సభ్యుడిగా ఉంది. 2017-19 కాలానికి ఎ-వెబ్ వైస్ చైర్ పర్సన్ గా ఇ సి ఐ బాధ్యతలు చేపట్టింది. 2019-22 టర్మ్ కు చైర్మన్ గా, ప్రస్తుతం 2022-24 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉంది. కరోనా మహమ్మారి (2019-2022) సమయంలో ఇ ఎం బి లను విజయవంతంగా నడిపించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ 2022 నవంబర్ లో కేప్ టౌన్ లో జరిగిన ఎ-వెబ్ 5వ సర్వసభ్య సమావేశంలో ఇ సి ఐ నుంచి ఎ-వెబ్ చైర్మన్ పదవిని దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘానికి అందజేశారు.

 

ఎ- వెబ్  తన సభ్య ఇ ఎమ్ బిల కోసం సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  ఎన్నికల నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేయడానికి, ఇతర సభ్య ఇఎమ్ బిలతో విజ్ఞానాన్ని పంచుకోవడానికి వివిధ దేశాలలో ఎన్నికల సందర్శన, అధ్యయన కార్యక్రమాలను చేపట్టింది.

 

ఇండియా- ఎ వెబ్ సెంటర్

 

2019 సెప్టెంబర్ లో బెంగళూరులో జరిగిన ఎ-వెబ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఎ-వెబ్ సభ్య దేశాల అధికారుల ఉత్తమ పద్ధతులు,  శిక్షణ , సామర్థ్యాన్ని పెంపొందించడానికి డాక్యుమెంటేషన్ , పరిశోధన కోసం న్యూఢిల్లీలో ఇండియా ఎ-వెబ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ‘ఎ-వెబ్ ఇండియా జర్నల్ ఆఫ్ ఎలక్షన్స్' పేరుతో ప్రపంచ స్థాయి జర్నల్ సహా పలు ప్రచురణలు, డాక్యుమెంట్లను కేంద్రం విడుదల చేస్తోంది. ఇండియా ఎ-వెబ్ సెంటర్ కు అవసరమైన అన్ని వనరులను ఇ సి ఐ సమకూరుస్తోంది.

 

*****(Release ID: 1938953) Visitor Counter : 184