మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

సరిహద్దు ప్రాంతాల్లో పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో సహాయం చేస్తుంది.


788 మానవ అక్రమ రవాణా నిరోధ యూనిట్లు (AHTUలు) 30 సరిహద్దు కాపలా దళాలు పనిచేస్తున్నాయి

Posted On: 11 JUL 2023 2:00PM by PIB Hyderabad

అక్రమ రవాణా బాధితులకు ప్రత్యేకించి మైనర్ బాలికలు మరియు యువతుల రక్షణ కోసం మరియు పునరావాస గృహాలను ఏర్పాటు చేసేందుకు సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహాలు ఆశ్రయం, ఆహారం, దుస్తులు, కౌన్సెలింగ్, ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు మరియు ఇతర రోజువారీ అవసరాలు వంటి సేవలను అందిస్తాయి.

 

మిషన్ వాత్సల్య పథకం మార్గదర్శకాల ప్రకారం స్పాన్సర్‌షిప్ అందించడానికి ఫిట్ ఫెసిలిటీని ప్రకటించడానికి బాధిత బాలికలను సీ డబ్ల్యు సీ  ముందు హాజరుపరుస్తారు, తదనుగుణంగా, రాష్ట్రాలు/ యూ టీ లను అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా అభ్యర్థిస్తారు.

 

దేశంలోని ప్రతి జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధ యూనిట్లను ఏర్పాటు చేయడానికి/ బలోపేతం చేయడానికి నిర్భయ ఫండ్ కింద ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు అందించింది. అదనంగా, బీ ఎస్ ఎఫ్ మరియు ఎస్ ఎస్ బీ వంటి బోర్డర్ గార్డింగ్ ఫోర్సెస్‌లోని ఏ హెచ్ టీ యూ లకు కూడా నిధులు అందించబడ్డాయి. ఇప్పటి వరకు 788  ఏ హెచ్ టీ యూ లు 30 బోర్డర్ గార్డింగ్ దళాలతో సహా పనిచేస్తున్నాయి.

 

భారతదేశం వ్యక్తుల అక్రమ రవాణాకు మూలం అలాగే గమ్యస్థాన దేశం. నేపాల్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్ మూల దేశాలు, భారతదేశంలో మెరుగైన జీవితం, ఉద్యోగాలు మరియు మంచి జీవన స్థితిని ఆశచూపి ఆ ముసుగులో మహిళలు మరియు బాలికలు అక్రమ రవాణా చేయబడుతున్నారు. వారిలో ఎక్కువ మంది మైనర్ బాలికలు/ చిన్న వయస్సు గల మహిళలు, వారిని భారతదేశానికి వచ్చిన తర్వాత విక్రయిస్తారు, లైంగిక వ్యాపారం లోకి వారిని బలవంతంగా నెట్టేస్తారు.

 

ఈ అమ్మాయిలు/మహిళలు తరచుగా ముంబై ఢిల్లీ, హైదరాబాద్ మొదలైన ప్రధాన నగరాలకు చేరుకుంటారు, అక్కడి నుండి వారు ప్రధానంగా మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేయాసియాలోకి తీసుకువెళతారు. ఈ కారణంగానే, మూల దేశాలకు సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలి అలాగే అక్రమ రవాణా బాధితులకు ఉపశమనం మరియు పునరావాస సేవలను అందించడానికి తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.

 

జే జే చట్టం, 2015లోని సెక్షన్ 51 ప్రకారం (2021లో సవరించిన విధంగా), బోర్డు లేదా కమిటీ తగిన విచారణ తర్వాత ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం పిల్లల బాధ్యతను తాత్కాలికంగా తీసుకోవడానికి  ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం నమోదు చేయబడిన ప్రభుత్వ సంస్థ లేదా స్వచ్ఛంద లేదా ప్రభుత్వేతర సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న సౌకర్యాన్ని గుర్తిస్తుంది. సదుపాయం యొక్క అనుకూలత నిర్ధారణ  తర్వాత సంస్థ నిర్దేశించిన విధంగా పిల్లల సంరక్షణను చూసుకోవాలి (2) బోర్డు లేదా కమిటీ వ్రాతపూర్వకంగా కారణాలను నమోదు చేసి  సబ్-సెక్షన్ (1) కింద గుర్తింపును ఉపసంహరించుకోవచ్చు.

 

****



(Release ID: 1938734) Visitor Counter : 142