సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కర్ణాటకలోని హంపిలో మూడో జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ (సి డబ్ల్యూజి ) సాంస్కృతిక సదస్సు ప్రారంభోత్సవం


సంస్కృతి మన గుర్తింపులో ఒక భాగం మాత్రమే కాకుండా, సుస్థిర అభివృద్ధి, సామాజిక సమ్మిళితం , ప్రపంచ సామరస్యానికి చోదక శక్తిగా ఉన్న భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడానికి ఈ రోజు మన పని చేద్దాం: శ్రీ ప్రహ్లాద్ జోషి

లంబానీ ఎంబ్రాయిడరీ దుస్తులు, అలంకార వస్తువులతో అతిపెద్ద ప్రదర్శనను ఏర్పాటు చేయడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలని సిడబ్ల్యుజి లక్ష్యంగా పెట్టుకుంది

Posted On: 10 JUL 2023 12:45PM by PIB Hyderabad

కర్ణాటకలోని హంపిలో ఆదివారం మొదలైన మూడో జీ20 సాంస్కృతిక  వర్కింగ్ గ్రూప్ (సీడబ్ల్యూజీ) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రసంగించారు.

 

‘ నాలుగు ప్రాధాన్యతలను గుర్తించడం,  చర్చించడం నుండి కార్యాచరణ ఆధారిత సిఫార్సులపై ఏకాభిప్రాయాన్ని కోరడం వరకు మనం  పురోగతి సాధించాము, ఇది విధాన రూపకల్పనలో సంస్కృతిని కేంద్ర బిందువుగా ఉంచడంలో ఒక ముఖ్యమైన దశ’  అని ప్రహ్లాద్ జోషి తమ ప్రసంగం లో అన్నారు. 4 ప్రాధాన్యతా రంగాలు: సాంస్కృతిక సంపద పరిరక్షణ-  పునరుద్ధరణ; సుస్థిర భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించు కోవడం;  సాంస్కృతిక,  సృజనాత్మక పరిశ్రమలు , సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం; సంస్కృతి పరిరక్షణ , ప్రోత్సాహం కోసం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం.

 

తాము కేవలం సమావేశానికి మాత్రమే హాజరుకావడం లేదని, ప్రపంచ సాంస్కృతిక మార్పులో చురుగ్గా పాల్గొంటున్నామని చెప్పారు.

 

శ్రీ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, "సమ్మిళిత,  సుస్థిర భవిష్యత్తు దార్శనికతలో మూలస్తంభాలుగా ఉన్న నాలుగు ప్రాధాన్యతా రంగాలతో కూడిన  మంత్రిత్వ (మినిస్టీరియల్) ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి నిర్మించడానికి మేము ప్రయత్నిస్తాము" అని అన్నారు.

 

ఈ నాలుగు ప్రాధాన్యతల గురించి మాట్లాడుతూ, ప్రాధాన్యతలు సాంస్కృతికంగా వైవిధ్యమైన,  ఏకీకృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తాయని, సాంస్కృతిక వారసత్వం గతానికి మూలస్తంభం , భవిష్యత్తుకు ఒక మార్గం అని ఆయన అన్నారు.

 

జి 20 సభ్య దేశాల అమూల్యమైన సేవలను వివరిస్తూ, " మినిస్టీరియల్ ప్రకటన ప్రాథమిక ముసాయిదాపై  సభ్య దేశాల అంతర్దృష్టులు, వ్యాఖ్యలు , ఫీడ్ బ్యాక్ మన భాగస్వామ్య దార్శనికతను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయి" అని అన్నారు. భిన్నత్వంతో నిండిన ప్రపంచంలో మన భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వమే మనందరినీ కట్టిపడేసే ఆధారం  అని ఆయన అన్నారు.

 

సంస్కృతి  వారధులను నిర్మిస్తుందని, అవగాహన , సహానుభూతిని పెంపొందిస్తుందని, మన విభేదాలను అధిగమించడానికి , మనం కలసి చేసే భాగస్వామ్య మానవ ప్రయాణాన్ని సుగమం చేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

శ్రీ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఐక్యత కు గల శక్తి, భిన్నత్వంలో గల అందం,  మానవ అభివృద్ధి లో సంస్కృతి కి గల భారీ సామర్థ్యాన్ని గుర్తుంచుకోవాలని సభ్య దేశాలను కోరారు .  "మనం ఒకే కలలు, ఒకే అభిరుచులతో ఏకమయ్యాం. అదే ఆశల తో ప్రేరణ పొందాము" అని అన్నారు.

 

సంస్కృతి మన గుర్తింపులో ఒక భాగం మాత్రమే కాకుండా, సుస్థిర అభివృద్ధి, సామాజిక సమ్మిళితం , ప్రపంచ సామరస్యానికి చోదక శక్తిగా ఉన్న భవిష్యత్తుకు ఈ రోజు మనం చేస్తున్న పని ద్వారా మార్గాన్ని మార్గం సుగమం చేద్దామని ఆయన అన్నారు.

 

లంబానీ ఎంబ్రాయిడరీ ప్యాచెస్ తో భారీ ప్రదర్శన నిర్వహణ ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలని సిడబ్ల్యుజి లక్ష్యంగా పెట్టుకుంది. సండూర్ కుశాల కళా కేంద్రం తో కలసి లంబానీ కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా మహిళా హస్తకళాకారులు తయారు చేసిన సుమారు 1300 లంబానీ ఎంబ్రాయిడరీ దుస్తులు, అలంకార వస్తువులను జి 20 సమావేశం సందర్భంగా ప్రదర్శించారు.

 

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ కు చెందిన విజయ విఠల ఆలయం, రాయల్ ఎన్ క్లోజర్, ఏడూరు బసవన్న కాంప్లెక్స్ వంటి వారసత్వ ప్రదేశాలకు ప్రతినిధులను విహారయాత్రకు తీసుకెళ్తున్నారు. ప్రతినిధులను తుంగభద్ర నదిపై కొరాకిల్ రైడ్ కు కూడా తీసుకెళ్తున్నారు. శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో జరిగే యోగా సెషన్ లో ప్రతినిధులు పాల్గొంటారు.

 

***



(Release ID: 1938437) Visitor Counter : 141