ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంసహా ఈశాన్యమంతటా పెట్రో రసాయనాల రంగం వృద్ధి దిశగా కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి

Posted On: 03 JUL 2023 8:49PM by PIB Hyderabad

      అస్సాం పెట్రో రసాయనాల ప్లాంటు నుంచి బంగ్లాదేశ్‌కు తొలిసారి మిథనాల్ ఎగుమతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు పెట్రో రసాయనాల రంగంలో అస్సాంను ప్రధాన ఎగుమతిదారుగా నిలిపే దిశగా సాగుతున్న కృషిని ఆయన ప్రశంసించారు.

ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శ‌ర్మ ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

 “అస్సాంసహా ఈశాన్య భారతమంతటా పెట్రో రసాయనాల రంగం వృద్ధికి మరింత ఉత్తేజమిచ్చే కృషికి ఈ పరిణామం నిదర్శనం” అని ప్రధానమంత్రి కొనియాడారు.


(Release ID: 1937195) Visitor Counter : 135