ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ 42 వ వ్యవస్థాపక దినోత్సవంలో కీలక ఉపన్యాసం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ రూపొందించిన 9 కార్యక్రమాలను ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
నీట్ పీజీ, ఎండిఎస్ టాపర్లు, నారీ శక్తి అవార్డు గ్రహీతలు,కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రహీతలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అవార్డు పొందిన వారిని సన్మానించిన డాక్టర్ మాండవీయ, ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్
వైద్య విద్యా రంగంలో సాధిస్తున్న అభివృద్ధి వైద్య విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు అందించి, దేశ ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలు, నిపుణులైన వైద్యులు ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన దేశానికి దారితీసే దేశ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
భారతదేశం వైద్య విద్య స్వర్ణయుగంలో ఉంది: ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్
దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 704 కి పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 52 కొత్త కళాశాలలు ప్రారంభం అయ్యాయి.: డా. వి.కె. పాల్
ఎన్ బి ఈ ఎం ఎస్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ అందుకున్న నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్
Posted On:
29 JUN 2023 9:18AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) 42 వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది.కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్, నీతి ఆయోగ్ సభ్యుడు( ఆరోగ్యం) డాక్టర్వి.కే. పాల్ పాల్గొన్న సమావేశంలో డాక్టర్ మాండవీయ కీలకోపన్యాసం చేశారు.
నూతన కార్యక్రమాలు, కోర్సులు ప్రారంభించిన పాలక మండలిని డాక్టర్ మాండవీయ అభినందించారు. గత రెండు సంవత్సరాల కాలంలో సంస్థ 25 నూతన కోర్సులు ప్రారంభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ' వైద్య విద్యలో సాధించిన అభివృద్ధి విద్యార్థులకు నూతన అవకాశాలు అందిస్తుంది. భారతదేశంలో వైద్య సేవలు మెరుగు పడతాయి. ప్రజలకు నిపుణులు అయిన వైద్యులు, వైద్య సేవలు అందుబాటులోకి వస్తారు. ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అని ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో వైద్య రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని, రాబోయే కాలంలో భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని ఆయన సూచించారు.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ రూపొందించిన 9 కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.
1. వైద్యశాస్త్రంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ 11 కొత్త ఫెలోషిప్ కోర్సులు
2. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్
3. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ పరీక్ష కమాండ్ సెంటర్
4. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ కేంద్రం
5. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ క్లినికల్ ప్రాక్టీస్ మార్గదర్శకాలు (2వ ఎడిషన్)
6. జాయింట్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ మరియు స్టాండ్-అలోన్ ల్యాబ్స్ మరియు డయాగ్నస్టిక్ సెంటర్ల అక్రిడిటేషన్
7. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ నైపుణ్యాలు, వర్చువల్ శిక్షణా కార్యక్రమం
8. ఉపాధ్యాయులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ ఫ్యాకల్టీ శీర్షిక ప్రారంభం
9. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ మెడికల్ లైబ్రరీ
ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్ తో కలిసి డాక్టర్ మాండవీయ కలిసి ఈ క్రింది విభాగాలలో ఆరోగ్య సంరక్షణ నిపుణులకు అవార్డులు ప్రదానం చేశారు.
1. నారీ శక్తి అవార్డు
2. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్
3. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అవార్డు
4. ప్రెసిడెంట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్
డాక్టర్ V.K పాల్‌కు ప్రెసిడెంట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ లభించింది.
విధి నిర్వహణలో వైద్య సిబ్బంది చూపిస్తున్న ధైర్య సాహసాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్ ప్రశంసించారు. భారతదేశ అభివృద్ధిలో వైద్య సిబ్బంది భాగంగా వున్నారనున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వసుధైక కుటుంబం స్ఫూర్తితో పనిచేసి ఆరోగ్యకరమైన భారతదేశం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం కృషి జరగాలన్నారు.
భారతదేశానికి చెందిన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్ అన్నారు. ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఒక భారతీయ వైద్యుడు సేవలో ఉంటారని అన్నారు. . స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం సాధించిన అభివృద్ధిలో అభ కార్డు అత్యంత ముఖ్యమైనదని మంత్రి అన్నారు. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్య విద్య స్వర్ణయుగంలో ఉందని పేర్కొన్న ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ భాగెల్ విద్యలో అగ్ర స్థానంలో నిలిచిన వారు ఇతరులకు స్ఫూర్తి కలిగించాలని మంత్రి కోరారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కే. పాల్ వైద్య విద్య , సంబంధిత సంస్థలు సాధించిన అభివృద్ధిని ప్రశంసించారు. గత ఎనిమిదేళ్ల కాలంలో వైద్య రంగంలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. వ్యవస్థలో మేలు చేస్తున్న మార్పుల వల్ల వైద్య విద్యా రంగం అభివృద్ధి సాధించడానికి ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ పాల్ అన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 4000 నుంచి 13000 పెరిందన్నారు. జాతీయ వైద్య కమిషన్‌ను కొత్త రెగ్యులేటర్‌గా చేర్చడం, యోగ్యత ఆధారిత పాఠ్యాంశాలను కలిగి ఉన్న నీట్‌ను అలాగే రెండవ సంవత్సరం పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందించాలని ఆదేశించే జిల్లా రీజెన్సీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడాన్ని ఉదహరించారు. జిల్లా ఆసుపత్రుల్లో ఒక్కొక్కరికి 3 నెలల పాటు వారి సేవలు, వెనుకబడిన వారికి సేవ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
వైద్య కళాశాలలు 387 నుంచి 704కు పెరిగాయని, ఈ ఏడాది 52 కొత్త కళాశాలలు జోడించడం ఒక రికార్డు అని, డాక్టర్ పాల్ అన్నారు. వైద్య విద్యార్థుల సీట్లు కూడా 52000 నుండి 107,000 వరకు అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ కోసం 32,000 నుండి 67,000 పెరిగాయన్నారు.వైద్య విద్యకు ఇది స్వర్ణయుగమని పేర్కొన్న డాక్టర్ పాల్ రాబోయే వైద్యులు, నిపుణులు దీనికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో ఆధునిక వైద్య రంగంలో పరీక్షలు నిర్వహించే బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గత 04 దశాబ్దాలుగా వైద్య విద్య రంగం అభివృద్ధి కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ పని చేస్తోంది. నాణ్యమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ , పోస్ట్‌డాక్టోరల్ శిక్షణను అందించడానికి వివిధ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఉపయోగించుకుంది. నీట్ పీజీ, నీట్ ఎస్ ఎస్, నీట్ ఎండిఎస్ పరీక్షలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విజయవంతంగా నిర్వహిస్తోంది. వివిధ స్పెషాలిటీ లో 12,000 కంటే ఎక్కువ పీజీ సీట్లతో 1100 కంటే ఎక్కువ ఆసుపత్రులకు గుర్తింపు పొందింది.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు,నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధ్యక్షుడు అభిజాత్ సేథ్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్‌పాయ్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
****
(Release ID: 1936228)
Visitor Counter : 145