మంత్రిమండలి
భారతదేశాని కి మరియు ‘కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ (సిడిఆర్ఐ) కిమధ్య ప్రధాన కేంద్రం సంబంధి ఒప్పందం (హెచ్ క్యుఎ) అనుమోదాని కి ఆమోదాన్ని తెలిపినమంత్రిమండలి
Posted On:
28 JUN 2023 3:51PM by PIB Hyderabad
భారతదేశం ప్రభుత్వాని (జిఒఐ) కి మరియు ‘కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్’ (సిడిఆర్ఐ) కి మధ్య 2022 ఆగస్టు 22వ తేదీ నాటి ప్రధాన కేంద్రం సంబంధి ఒప్పందం (హెచ్ క్యుఎ) యొక్క అనుమోదాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.
ఐక్య రాజ్య సమితి జలవాయు సంబంధి కార్యాచరణ శిఖర సమ్మేళనం న్యూ యార్క్ లో 2019 వ సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీ నాడు జరిగిన సందర్భం లో సిడిఆర్ఐ ని భారతదేశం ప్రధాన మంత్రి ప్రారంభించడం జరిగింది. భారతదేశ ప్రభుత్వం నడుం కట్టిన ఒక ప్రధానమైన ప్రపంచ వ్యాప్త కార్యక్రమం ఇది. జలవాయు పరివర్తన ను మరియు విపత్తుల ను ఎదుర్కోవడాని కి సంబంధించిన అంశాల లో ప్రపంచ నాయకత్వాన్ని అందుకోవడానికి భారతదేశం చేస్తున్నటువంటి ప్రయాసల లో ఒక ప్రయాస గా ఈ కార్యక్రమాన్ని భావన చేస్తున్నారు.
సిడిఆర్ఐ స్థాపన తో పాటు ఆ కార్యక్రమాని కి ఊతాన్ని ఇచ్చేటటువంటి సెక్రటేరియట్ ను న్యూ ఢిల్లీ లో నెలకొల్పేందుకు మంత్రిమండలి 2019 వ సంవత్సరం ఆగస్టు 28 వ తేదీ నాడు తన ఆమోదాన్ని తెలియ జేసింది. అంతేకాకుండా, 2019-20 మొదలుకొని 2023-24 మధ్య అయిదు సంవత్సరాల కాలాని కి సిడిఆర్ఐ కి 480 కోట్ల రూపాయల మేరకు భారతదేశ ప్రభుత్వం పక్షాన ఆర్థిక సహాయం రూపం లో సమర్థన ను ఇచ్చేందుకు సైతం మంత్రిమండలి ఆమోదాన్ని తెలియ జేసింది.
అటు తరువాత, సిడిఆర్ఐ కి ఒక అంతర్జాతీయ సంస్థ గా గుర్తింపు ఇవ్వడాన్ని మరియు యుఎన్ (పి & ఐ) యాక్ట్, 1947 లో భాగం అయినటువంటి సెక్షన్-3 లో ఉద్దేశించిన విధం గా సిడిఆర్ఐ కి మినహాయింపు లు, రక్షణ లు మరియు ప్రత్యేక అధికారాల ను మంజూరు చేయడం కోసం లక్షించినటువంటి ప్రధాన కేంద్రం సంబంధి ఒప్పందం (హెచ్ క్యుఎ) పై సంతకాలు చేయడాన్ని మంత్రివర్గం 2022 వ సంవత్సరం జూన్ 29వ తేదీ నాడు ఆమోదించింది.
మంత్రిమండలి నిర్ణయం దరిమిలా, 2022 వ సంవత్సరం ఆగస్టు 22 వ తేదీ నాడు హెచ్ క్యుఎ పై భారతదేశం ప్రభుత్వం మరియు సిడిఆర్ఐ పక్షాల మధ్య సంతకాలు అయ్యాయి.
శీతోష్ణస్థితి మరియు విపత్తు సంబంధి నష్ట భయాల ను ఎదుర్కొనేందుకు తగిన మౌలిక సదుపాయాల సంబంధి వ్యవస్థ లు సమకూర్చుకోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థిర అభివృద్ధి కి పూచీపడడం కోసం జాతీయ ప్రభుత్వాలు, ఐరాస ఏజెన్సీ లు మరియు ప్రోగ్రాము లు, బహుపక్షీయ అభివృద్ధి బ్యాంకు లు, ఇంకా ఆర్థిక సహాయ ప్రధానమైనటువంటి వ్యవస్థ లు, ప్రైవేటు రంగం, ఆర్థిక మరియు జ్ఞాన ప్రదాన సంస్థల మధ్య కుదిరినటువంటి ఒక ప్రపంచ శ్రేణి భాగస్వామ్యమే సిడిఆర్ఐ అని చెప్పవచ్చును.
దీనిని ప్రారంభించిన నాటి నుండి ముప్పై ఒక్క దేశాలు, ఆరు అంతర్జాతీయ సంస్థల తో పాటు, రెండు ప్రైవేటు రంగ సంస్థ లు సిడిఆర్ఐ లో సభ్యత్వాన్ని స్వీకరించాయి. జలవాయు పరివర్తన ప్రభావం మరియు విపత్తుల ప్రభావం అధికం గా ఉన్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, ఆర్థికం గా ముందంజ వేసిన అటువంటి దేశాలు.. ఇలా వివిధ శ్రేణుల నుండి సిడిఆర్ఐ తన సభ్యత్వాన్ని నిరంతరాయం గా విస్తరించుకొంటోంది.
ప్రధాన కార్యాలయం ఒప్పందం పై భారతదేశ ప్రభుత్వాని కి మరియు సిడిఆర్ఐ కి మధ్య జరిగిన సంతకాల కు అనుమోదం ద్వారా యునైటెడ్ నేశన్స్ (ప్రివిలేజెస్ ఎండ్ ఇమ్యూనిటీస్) యాక్ట్, 1947 లోని సెక్షన్-3 లో లక్షించిన మేరకు మినహాయింపుల , రక్షణ ల మరియు విశేష అధికారాల మంజూరు కు మార్గం సుగమం అవుతుంది. ఇది సిడిఆర్ఐ కి ఒక స్వతంత్రమైనటువంటి మరియు అంతర్జాతీయ సమాజం దృష్టి లో ఒక చట్టబద్ధం అయినటువంటి అస్తిత్వాన్ని కట్టబెడుతుంది. తద్వారా సిడిఆర్ఐ తన విధుల ను అంతర్జాతీయ స్థాయి లో మరింత సమర్థం గా నెరవేర్చ గలుగుతుంది.
***
(Release ID: 1935959)
Visitor Counter : 186
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam