ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అల్‌-హకీమ్‌ మసీదును సందర్శించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 JUN 2023 4:04PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఈజిప్టు పర్యటనలో్ భాగంగా కైరో నగరంలోని ‘అల్‌-హకీమ్‌’ మసీదును సందర్శించారు.

   ఈజిప్టు పర్యాటక-పురావస్తుశాఖ మంత్రి డాక్టర్‌ ముస్తఫా వజీరి ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ ఫాతిమిడ్ శకానికి చెందిన ఈ షియా మసీదు నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్న బోహ్రా సమాజ నాయకులను కూడా ప్రధాని కలుసుకున్నారు. ఈ సమావేశంలో భారత, ఈజిప్టు ప్రజానీకం మధ్యగల బలమైన స్నేహ సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

*****


(రిలీజ్ ఐడి: 1935273) సందర్శకుల సూచీ సంఖ్య : : 221