ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎస్ఎఅధ్యక్షుని తో ప్రధాన మంత్రి సమావేశం
Posted On:
23 JUN 2023 7:31AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ లో ఆధికారిక పర్యటన లో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఈ రోజు న ఉదయం పూట వైట్ హౌస్ ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు ఆయన కు సంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి కి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ లు వేల సంఖ్య లో తరలివచ్చారు.
ప్రధాన మంత్రి తదనంతరం, అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో కలసి పరిమిత మరియు ప్రతినిధి వర్గం స్థాయి సమావేశాల లో ఉపయోగకరమైన చర్చ లో పాల్గొన్నారు. నేతలు ఇద్దరూ రెండు దేశాల మధ్య దీర్ఘకాలం గా కొనసాగుతూ వస్తున్న మైత్రి, వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ, శక్తి, జలవాయు పరివర్తన మొదలుకొని ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి రంగాల వరకు విస్తరిస్తున్న సహకారాన్ని గురించి చర్చించారు.
ఇరువురు నేత లు సంబంధాల ను ఒక నూతన శిఖరానికి చేర్చడ కోసం ఒక బలమైనటువంటి ప్రాతిపదిక ను అందించేటటువంటి ఉభయ దేశాల మధ్య గల పరస్పర విశ్వాసం మరియు అవగాహనల తో పాటు ఉమ్మడి విలువల ను గురించి కూడా చర్చించారు. వారు క్రిటికల్ ఎండ్ ఇమర్జింగ్ టెక్నాలజీ స్ (ఐసిఇటి) వంటి కార్యక్రమాల మాధ్యం ద్వారా శ్రీఘ్ర పురోగతి చోటుచేసుకొంటూ ఉండడాన్ని మరియు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాటి ని తట్టుకొని నిలబడగలిగేటటువంటి సరఫరా వ్యవస్థల ను నిర్మించడం కోసం వ్యూహాత్మకమైన సాంకేతిక విజ్ఞాన సంబంధి సహకారాన్ని పెంపొందించుకోవాలన్న ప్రగాఢమైన అభిలాష పట్ల ప్రశంస ను వ్యక్తపరచారు. వారు మహత్వపూర్ణ ఖనిజాలు మరియు అంతరిక్ష రంగం లలో సహకారం పెంపొందుతూ ఉండడాన్ని స్వాగతించారు.
జలవాయు పరివర్తన ను ఎదుర్కోవాలన్న మరియు ఒక స్థిరమైనటువంటి భవిష్యత్తు సాధన సంబంధి లక్ష్యాన్ని దక్కించుకోవడం కోసం తమ వచనబద్ధత ను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు. వారు స్వచ్ఛమైనటువంటి మరియు అక్షయమైనటువంటి శక్తి ని పెంపొందింప చేయగల మార్గాల ను గురించి మరియు జలవాయు కార్యక్రమం లో సహకరించుకోగల మార్గాల ను గురించి చర్చించారు.
నేతలు ఇద్దరు వారి వారి ప్రజానీకాని కి మరియు ప్రపంచ సముదాయాని కి కూడా హితకరం అయ్యేలా భారతదేశం, ఇంకా యుఎస్ఎ ల మధ్య బహుముఖీన మైన విస్తృత ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గాఢం గా మలచాలన్న దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్చల లో పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాలు మరియు ప్రపంచ అంశాలు కూడా ప్రస్తావన కు వచ్చాయి.
అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ మరియు ప్రథమ మహిళ గారు లు తనకు అందించినటువంటి స్నేహపూర్ణ స్వాగతాని కి గాను ప్రధాన మంత్రి వారిని ప్రశంసించారు. 2023 వ సంవత్సరం సెప్టెంబరు లో జి20 దేశాల నేతల శిఖర సమ్మేళనం జరిగే సందర్భం లో న్యూఢిల్లీ లో అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు స్వాగతం పలకాలని ఉంది అంటూ ప్రధాన మంత్రి తన ఉత్సుకత ను వ్యక్తం చేశారు.
***
(Release ID: 1934792)
Visitor Counter : 130
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam