ప్రధాన మంత్రి కార్యాలయం

జి20 పర్యటన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం

Posted On: 21 JUN 2023 2:44PM by PIB Hyderabad

శ్రేష్ఠులు, మహిళలు మరియు సజ్జనులారా, నమస్కారం.

‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ లోకి మీ అందరి ని నేను ఇదే ఆహ్వానిస్తున్నాను. ప్రపంచవ్యాప్తం గా రెండు ట్రిలియన్ డాలర్ కు పైచిలుకు విలువ కలిగినటువంటి ఒక రంగాన్ని సంబాళి స్తున్నటువంటి పర్యటన మంత్రులు అయి ఉండి, మీకు స్వయం గా ఒక యాత్రికుడు అయ్యే అవకాశం దక్కడం అనేది ఎంతో అరుదైంది అని చెప్పాలి. అయితే, మీరు ప్రస్తుతం భారతదేశం లో ఒక ప్రధానమైన పర్యటన కేంద్రం అయినటువంటి గోవా లో ఉన్నారు. ఈ కారణం గా, గోవా లో ని ప్రాకృతిక శోభ తో పాటు గోవా యొక్క ఆధ్యాత్మిక పార్శ్వాన్ని సైతం దర్శించడానికని మీరు మీ యొక్క తీవ్ర చర్చ ల నుండి కొంత కాలాన్ని కేటాయించండి అంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

శ్రేష్ఠులారా,

మా ప్రాచీన గ్రంథాల లో ఒక లోకోక్తి ఉంది. అదే.. ‘‘అతిథి దేవో భవః’’. ఈ మాటల కు ‘‘అతిథి దైవం వంటి వారు’’ అని భావం. మరి, పర్యటన పట్ల మా యొక్క దృష్టి కోణం ఇది . మా దేశం లో పర్యటన అంటే స్థలాల సందర్శన ఒక్కటే కాదు; అది మనసుల ను మైమరపించేటటువంటి ఒక అనుభూతి. అది సంగీతం కావచ్చు, లేదా ఆహారం కావచ్చు, లేదా కళలు కావచ్చు, లేదా సంస్కృతి కావచ్చు.. భారతదేశం యొక్క భిన్నత్వం నిజాని కి వైభవోపేతం అయినటువంటిది గా ఉంది. సమున్నతం అయినటుంటి హిమాలయాలు మొదలుకొని దట్టమైన అరణ్య ప్రాంతాల వరకు; ఎడారి ప్రాంతాలు మొదలుకొని సుందరమైన సముద్ర తీర ప్రాంతాల వరకు; మరి అలాగే సాహసిక క్రీడలు మొదలుకొని, భావాతీత ధ్యానం సంబంధి అభ్యాసాల వరకు చూస్తే, భారతదేశం ప్రతి ఒక్కరి కి ఏదో ఒకటి ప్రసాదిస్తూ వస్తోంది. జి-20 కి మేం అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత తరుణం లో, భారతదేశం అంతటా 100 వేరు వేరు ప్రాంతాల లో దాదాపు గా 200 సమావేశాల ను మేము నిర్వహిస్తున్నాం. ఇప్పటికే భారతదేశాన్ని ఈ సమావేశాల కోసం సందర్శించిన మీ మిత్రుల తోను మీరు మాటల ను కలిపారా అంటే ఏ ఇద్దరి అనుభూతులు ఒకే మాదిరి గా ఉండబోవని నేను గట్టి గా చెప్పగలను.

శ్రేష్ఠులారా,

భారతదేశం లో, ఈ రంగం లో మా ప్రయాస లు మా యొక్క సంపన్న వారసత్వాన్ని పరిరక్షించుకోవడం అనే అంశం పైన కేంద్రీకృతం అయి ఉన్నాయి. అదే కాలం లో మేం పర్యటన రంగం కోసం ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ను కల్పిస్తున్నాం. ఆధ్యాత్మికత్వం ప్రధానమైనటువంటి పర్యటనల కు మెరుగులు దిద్దడం అనేది మేం శ్రద్ధ వహిస్తున్న అంశాల లో ఒక భాగం గా ఉంది. భారతదేశం ప్రపంచం లోని ప్రతి ఒక్క ప్రధాన ధర్మాని కి చెందిన యాత్రికుల ను ఇట్టే ఆకట్టుకొంటూ వస్తున్నది. మౌలిక సదుపాయాల ను ఉన్నతీకరించిన తరువాత వారాణసీ నగరం కేవలం ఒక ప్రధాన ఆధ్యాత్మిక నిలయం గా మాత్రమే కాకుండా, ప్రస్తుతం 70 మిలియన్ తీర్థయాత్రికుల ను ఆకర్షిస్తున్నది. ఇది మునుపటి తో పోలిస్తే పది రెట్లు అధికం అని చెప్పాలి. మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీవంటి సరిక్రొత్త పర్యటక ఆకర్షణ బిందువుల ను సైతం స్థాపిస్తున్నాం. ప్రపంచం లో అత్యంత పెద్దది అయినటువంటి విగ్రహం కొలువుదీరి ఒక సంవత్సరాని కంటే లోపే ఇంచుమించు 2.7 మిలియన్ ప్రజల దృష్టి ని తనవైపున కు తిప్పుకొంది. గడచిన తొమ్మిది సంవత్సరాల లో మేం దేశం లో అచ్చం గా పర్యటన ప్రధానం అయినటువంటి ఇకో-సిస్టమ్ ను అభివృద్ధి పరచడం పట్ల ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొన్నాం. రవాణా సంబంధి మౌలిక సదుపాయాల కల్పన మొదలుకొని ఆతిథ్య రంగం వరకు, మరి అలాగే నైపుణ్యాభివృద్ధి పరం గా కూడాను , అంతెందుకు మా వీజా వ్యవస్థల లో సైతం మేం మా యొక్క సంస్కరణ లలో పర్యటన రంగాని కి ఒక కేంద్రీయ స్థానాన్ని కట్టబెట్టాం. ఆతిథ్య రంగాని కి ఉద్యోగ కల్పన, సామాజిక పరమైనటువంటి మేళనం, ఇంకా ఆర్థిక పురోగతి ల తాలూకు ఘనమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ రంగం అనేక ఇతర రంగాల తో పోల్చి చూసినప్పుడు మరింత ఎక్కువ మంది మహిళల కు మరియు యువత కు బ్రతుకుదెరువు ను ప్రసాదిస్తున్నది. సతత అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి స్) ను త్వరితగతి న సాధించడం లో పర్యటన రంగం యొక్క ప్రాసంగికత ను కూడా ను మేం గుర్తిస్తున్నాము అని మీకు తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.

శ్రేష్ఠులారా,

ఒకదాని తో మరొకటి ముడిపడినటువంటి అయిదు ప్రాధాన్య రంగాల గురించి మీరు కసరత్తు చేస్తున్నారు. ఆ అయిదు ప్రాధాన్య రంగాలు ఏవేవి అంటే.. గ్రీన్ టూరిజమ్, డిజిటలైజేశన్, నైపుణ్యాభివృద్ధి, పర్యటన రంగానికి చెందినటువంటి సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ ) లు మరియు డెస్టినేశన్ మేనేజ్ మెంట్.. అనేవే. ఈ ప్రాధాన్యాలు భారతదేశం యొక్క ప్రాథమ్యాల ను, అలాగే అంతగా అభివృద్ధి చెందనటువంటి దేశాల యొక్క ప్రాధాన్యాల ను ప్రతిబింబిస్తున్నాయి. నూతన ఆవిష్కరణల కు జోరు ను జత చేయాలి అంటే గనక ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంకా అగ్ మెంటెడ్ రియాలిటీ ల వంటి సరిక్రొత్త గా తెర మీదకు వస్తున్న సాంకేతికతల ను ఎంతో ఎక్కువ గా మనం ఉపయోగించుకోవాలి. ఉదాహరణ కు తీసుకొంటే, భారతదేశం లో మేం దేశం లో మాట్లాడుతున్న అనేక భాషల అనువాదాన్ని వాస్తవ కాల ప్రాతిపదికన చేపట్టేటందుకు ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ ను వాడుకోవడం గురించి కసరత్తు చేస్తున్నాం. పర్యటన రంగం లో ఆ తరహా సాంకేతికత ను అమలు పరచడాన్ని ప్రభుత్వాల కు, నవపారిశ్రామికవేత్తల కు, ఇన్వెస్టర్ లకు మరియు విద్య రంగ ప్రముఖుల కు మధ్య సహకారం ఏర్పడటం అంటూ జరిగితే కార్యాన్ని వేగవంతం గా పూర్తి చేయవచ్చని నేను నమ్ముతున్నాను. మనం మన యొక్క పర్యటన రంగ కంపెనీ లు వాటికి అవసరపడే ఆర్థిక సహాయాన్ని విరివి గా అందుకోవడం కోసం, వ్యాపారపరమైన నిబంధనల ను సులభతరం గా తీర్చిదిద్దుకోవడం కోసం, మరి అలాగే, నైపుణ్యాల అభివృద్ధి ని అధికం చేసుకోవడం కోసం కూడాను కలసికట్టు గా శ్రమించాలి.

శ్రేష్ఠులారా,

ఉగ్రవాదం ప్రజల లో చీలిక ను తీసుకు వస్తుందని, అదే పర్యటన రంగం ప్రజల ను ఏకం చేస్తుందని అంటారు. నిజాని కి, అన్ని రంగాల ప్రజల ను ఒక తాటి మీద కు తెచ్చి, సద్భావన తో నిండిన సమాజాన్ని ఆవిష్కరించే శక్తి పర్యటన రంగాని కి ఉంది. యుఎన్ డబ్ల్యు టిఒ భాగస్వామ్యం తో జి-20 టూరిజమ్ డాశ్ బోర్డు ను తయారు చేయడం జరుగుతోంది అని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. ఆ ప్రక్రియ ఉత్తమ అభ్యాసాల ను, సమగ్రమైనటువంటి అధ్యయనాల ను మరియు ప్రేరణ ను అందించేటటువంటి గాధల ను ఒక చోటు కు చేర్చగలుగుతుంది. అది దానికి అదే మొట్టమొదటి వేదిక వలె రుజువు చేసుకోగలుగుతుంది. దానిని మీరు చిరకాలం నిలచే వారసత్వం లా పరిగణించవచ్చును. మీ యొక్క చర్చోపచర్చలు మరియు ‘‘గోవా మార్గసూచి’’.. ఈ రెండూ పర్యటన రంగాని కి ఉన్నటువంటి పరివర్తనాత్మకమైన శక్తి ని పూర్తి గా సద్వినియోగ పరచుకొనేందుకు మన సమష్టి యత్నాల ను అనేక రెట్లు పెంచగలుగుతాయి అని నేను ఆశ పడుతున్నాను. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించడం లో ఉన్న పరమార్థమల్లా ‘‘వసుధైవ కుటుంబకం’’ అనేదే; ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అనే నినాదం ప్రపంచ పర్యటన రంగాని కి ఒక ధ్యేయం కాగలదు.

శ్రేష్ఠులారా,

భారతదేశం ఉత్సవాల గడ్డ అని చెప్పాలి. మేం దేశం లో ఏడాది పొడవునా అనేక ఉత్సవాల ను జరుపుకొంటూ ఉంటాం. గోవా లో, త్వరలో సావో జొవావోఉత్సవం జరుగనుంది. అయితే, మీరు తప్పక తిలకించవలసినటువంటి మరొక ఉత్సవం ఉంది. అది ప్రజాస్వామ్యాని కి జనని వంటి దేశం లో జరుగబోయే ప్రజాస్వామిక ఉత్సవం. రాబోయే సంవత్సరం లో, భారతదేశం తదుపరి సాధారణ ఎన్నికల ను నిర్వహించుకోనుంది. ఒక నెల రోజుల కు పైగా, సుమారు ఒక బిలియన్ మంది వోటర్ లు ఈ ఉత్సవం లో పాలుపంచుకొని, ప్రజాస్వామిక విలువల పట్ల వారికి ఉన్న దృఢ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తారు. ఒక మిలియన్ కు పైగా వోటింగ్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఈ ఉత్సవాన్ని- దాని తాలూకు బోలెడంత భిన్నత్వం తో సహా - దర్శించుకొనేందుకు మీకు ప్రాంతాల కొదువ అనేదే ఉండక పోవచ్చు. ప్రపంచ వ్యాప్తం గా జరుపుకొనే ఉత్సవాల లోకెల్లా అత్యంత ముఖ్యమైందైనటువంటి ఈ ఉత్సవాన్ని చూడడానికి భారతదేశాని కి తరలి రండి అంటూ మిమ్మల్ని అందరిని నేను ఆహ్వానిస్తున్నాను. మరి ఈ ఆహ్వానాన్ని అందించడం ద్వారా, మీ అందరికి మీ యొక్క చర్చోపచర్చల లో సాఫల్యం సిద్ధించాలి అని నేను కోరుకొంటున్నాను.

మీకు ఇవే ధన్యవాదాలు.

 

***



(Release ID: 1934169) Visitor Counter : 145