సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

2021 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు

Posted On: 18 JUN 2023 4:02PM by PIB Hyderabad

2021 సంవత్సరానికిగాను గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌కు  గాంధీ శాంతి బహుమతి

గాంధీ పీస్ ప్రైజ్ అనేది మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్షిక పురస్కారం. ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది.

ఈ అవార్డు కింద రూ. 1 కోటి నగదుతో పాటు ఒక ప్రశంసా పత్రం, ఒక ఫలకం మరియు ఒక అద్భుతమైన సాంప్రదాయ హస్తకళ/చేనేత వస్తువును అందిస్తారు.

గత అవార్డు గ్రహీతలలో ఇస్రో, రామకృష్ణ మిషన్, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్, వివేకానంద కేంద్రం, కన్యాకుమారి, అక్షయ పాత్ర, బెంగళూరు, ఏకల్ అభియాన్ ట్రస్ట్, ఇండియా మరియు సులభ్ ఇంటర్నేషనల్, న్యూఢిల్లీ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ అవార్డు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు దివంగత డాక్టర్ నెల్సన్ మండేలా, టాంజానియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ జూలియస్ నైరెరే, డాక్టర్ ఎ.టి. అరియరత్నే, శ్రీలంక సర్వోదయ శ్రమదన వ్యవస్థాపక అధ్యక్షుడు,  ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, డాక్టర్ గెర్హార్డ్ ఫిషర్, బాబా ఆమ్టే, డాక్టర్ జాన్ హ్యూమ్, ఐర్లాండ్, శ్రీ వాక్లావ్ హావెల్, చెకోస్లోవేకియా మాజీ అధ్యక్షుడు, దక్షిణాఫ్రికా ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు, శ్రీ. చండీ ప్రసాద్ భట్ మరియు జపాన్‌కు చెందిన శ్రీ యోహెయ్ ససకవాకు అందించబడింది.

ఇటీవలి అవార్డు గ్రహీతలలో సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్ అల్ సైద్, ఒమన్ (2019) మరియు బంగ్లాదేశ్‌లోని బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ (2020) ఉన్నారు.

గౌరవప్రదమైన ప్రధానమంత్రి నేతృత్వంలోని జ్యూరీ, 18 జూన్, 2023న చర్చల అనంతరం అహింసా మరియు ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, రాజకీయ పరివర్తన, ఆర్థిక రంగాలలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2021 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి గ్రహీతగా గీతా ప్రెస్, గోరఖ్‌పూర్‌ను ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.

1923లో స్థాపించబడిన గీతా ప్రెస్ 16.21 కోట్ల శ్రీమద్ భగవద్గీతతో సహా 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించిన ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణకర్తలలో ఒకటి. సంస్థ ఆదాయ ఉత్పత్తి కోసం దాని ప్రచురణలలోని ప్రకటనలపై ఎన్నడూ ఆధారపడలేదు. గీతా ప్రెస్ దాని అనుబంధ సంస్థలతో పాటు అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తుంది.

శాంతి మరియు సామాజిక సామరస్యానికి సంబంధించిన గాంధేయ ఆదర్శాలను ప్రచారం చేయడంలో గీతా ప్రెస్ అందించిన సహకారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. గీతా ప్రెస్ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ శాంతి బహుమతి ప్రదానం చేయడం సమాజ సేవలో సంస్థ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన తెలిపారు.

గాంధీ శాంతి బహుమతి 2021, మానవాళి యొక్క సామూహిక అభ్యున్నతికి తోడ్పడడంలో గీతా ప్రెస్ యొక్క ముఖ్యమైన మరియు అసమానమైన సహకారాన్ని గుర్తిస్తుంది. ఇది నిజమైన అర్థంలో గాంధేయ జీవితాన్ని వ్యక్తీకరిస్తుంది.


 

****



(Release ID: 1933263) Visitor Counter : 297