కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం తన కార్మిక శక్తికి సామాజిక భద్రతతో పాటు తగిన యోగ్యమైన పనిని అందించాలనే నిబద్ధతతో అమృత్‌కాల్ వైపు పయనిస్తోంది అన్న శ్రీ భూపేందర్ యాదవ్.
प्रविष्टि तिथि:
14 JUN 2023 12:14PM by PIB Hyderabad
జెనీవాలో 2023 జూన్ 13న జరిగిన 111వ అంతర్జాతీయ కార్మిక సదస్సులో కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్లీనరీ సెషన్‌లో ప్రసంగించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన శ్రామిక శక్తికి సామాజిక భద్రత, మంచి పనిని అందించాలనే నిబద్ధతతో అమృత్‌కాల్ దిశగా పయనిస్తోందని ఆయన అన్నారు.

భారతదేశం తన జి20 ప్రెసిడెన్సీ ద్వారా దేశాల మధ్య నైపుణ్యాల అంతరాలను మ్యాప్ చేయడానికి, నైపుణ్యాలు, అర్హతలను సమన్వయం చేయడం, పరస్పర సహకారం అందించే లక్ష్యం పెట్టుకుందని శ్రీ యాదవ్ చెప్పారు.

గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులతో సహా అందరికీ సార్వత్రిక, సమగ్రమైన సామాజిక భద్రతా కవరేజీని అందించడానికి స్థిరమైన ఫైనాన్సింగ్ మెకానిజమ్‌ల కోసం మార్గాలను కనుగొనడానికి ప్రపంచంతో కలిసి పనిచేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి చెప్పారు.


ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ సందర్భంగా శ్రీ యాదవ్ ఐఎల్ఓ డీజీ గిల్బర్ట్ హౌంగ్బోను కూడా కలిశారు. గ్లోబల్ స్కిల్ గ్యాప్స్, గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ ఎకానమీ, సోషల్ ప్రొటెక్షన్, సస్టైనబుల్ ఫైనాన్సింగ్ ఫర్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన ఈడబ్ల్యూజి ప్రాధాన్యతా ప్రాంతాల గురించి భారతదేశం జి 20 ప్రెసిడెన్సీలో చర్చించారు.

జెనీవాలో శ్రీ యాదవ్ అరియానా పార్క్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
(रिलीज़ आईडी: 1932473)
आगंतुक पटल : 161