వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గోధుమల ధరలు తగ్గుదల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా చూడడానికి రాష్ట్ర అధికారులతో సమావేశమైన - కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి
పారదర్శకత, మెరుగైన పర్యవేక్షణ కోసం నిల్వల పరిమితి ఆదేశాల ప్రకారం టోకు వ్యాపారులు, చిల్లర వ్యాప్రారలు, బిగ్ చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లు ఇప్పుడు గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలి
సంబంధిత వాటాదారులందరూ పోర్టల్ లో క్రమం తప్పకుండా గోధుమ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలి
Posted On:
13 JUN 2023 4:29PM by PIB Hyderabad
గోధుమల ధరలను తగ్గించి, మార్కెట్‌లో సులభంగా లభ్యమయ్యేలా చూసేందుకు, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా వివిధ రాష్ట్రాల ఆహార శాఖ కార్యదర్శులతో సమావేశమయ్యారు. 2023 జూన్ 12వ తేదీన ప్రకటించిన గోధుమ నిల్వల పరిమితి ఆదేశాల గురించి, దాని సమ్మతి గురించి, ఈ సమావేశంలో వివరంగా చర్చించారు. టోకు వ్యాపారులు, చిల్లర వ్యాప్రారలు, బిగ్ చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లకు వర్తించే విధంగా గోధుమలపై కేంద్ర ప్రభుత్వం నిల్వలపై పరిమితులను విధించిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. బహిరంగ మార్కెట్లో విక్రయ పథకం (దేశీయ) - ఓ.ఎం.ఎస్.ఎస్.(డి) కింద గోధుమలు, బియ్యాన్ని విడుదల చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు తగ్గించడం, నిల్వలను, ఊహాగానాలను నిరోధించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టడం జరిగింది.
టోకు వ్యాపారులు, చిల్లర వ్యాప్రారలు, బిగ్ చైన్ రిటైలర్లు, ప్రాసెసర్ల వద్ద ఉన్న గోధుమ నిల్వల వివరాలను బహిర్గతం చేయాలని, ఏ రకమైన అనుచిత పద్ధతులు అవలంబించకుండా తనిఖీ చేయాలనీ, గోధుమ లభ్యతలో పారదర్శకతను తీసుకురావాలని, కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖకు చెందిన (https://evegoils.nic.in/wsp/login) పోర్టల్ లో సమాచారాన్ని సులభంగా పూరించడానికి, నిల్వల వివరాలను సమర్పించడానికి సంబంధించిన వినియోగదారుల మాన్యువల్ ను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం జరిగింది. ఒకవేళ వారి వద్ద ఉన్న నిల్వలు నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఈ ప్రకటన జారీ చేసిన 30 రోజులలోపు వారు దానిని నిర్దేశించిన నిల్వ పరిమితులకు తీసుకురావలసిఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం 2023 జూన్, 12వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అన్ని సంబంధిత సంస్థలు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా నిల్వ పరిమితులకు లోబడి గోధుమ నిల్వల వివరాలు ప్రకటించి, ఎప్పటికప్పుడు తాజా వివరాలను సంబంధిత పోర్టల్ లో పొందుపరచడం తో పాటు, నిల్వ పరిమితులను ఖచ్చితంగా పాటించడం కోసం వెంటనే తగిన సూచనలు జారీ చేయవలసిందిగా, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిల్వలను బహిర్గతం చేయడానికి వీలుగా ఈ సంస్థలకు సంబంధిత పోర్టల్ వినియోగించుకునే విధంగా అనుమతి ఇవ్వడంతో పాటు, ఆ పోర్టల్ లో వెల్లడించిన నిల్వ వివరాలను పర్యవేక్షించేందుకు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా అవకాశం ఉంటుంది.
మొదటి దశలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలతో పాటు ఓ.ఎం.ఎస్.ఎస్.(డి) కింద బియ్యం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి కూడా ఈ సమావేశం తెలియజేసింది. గోధుమలు, బియ్యం ధరలతో పాటు వాటి నుండి ఉత్పన్నమైన ఉత్పత్తుల ధరల పెరుగుదలను ఈ చర్య మరింత తగ్గించగలదని భావిస్తున్నారు. గోధుమలు, బియ్యం వంటి ఆహార ధాన్యాలు వినియోగదారులకు సరసమైన ధరలకు లభించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.
*****
(Release ID: 1932227)
Visitor Counter : 156