ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గుజరాత్‌లో ‘బైపార్జోయ్’ తుఫానుపై సన్నద్ధత చర్యలను సమీక్షించారు.
తుఫాను సంసిద్ధత లో గుజరాత్‌కు కేంద్రం సహాయం చేస్తుంది
రాష్ట్రాలు మరియు ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్ల్యు ప్రాంతీయ కార్యాలయాలతో కలిసి తుఫాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు
కేంద్ర వైద్య సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
Posted On:
13 JUN 2023 3:04PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు గుజరాత్‌లోని భుజ్‌లో గుజరాత్ ఆరోగ్య మంత్రి శ్రీ రుషికేష్ గణేష్‌భాయ్ పటేల్‌తో కలిసి ‘బైపార్జోయ్’ తుఫానుపై కేంద్రం మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సన్నద్ధత చర్యలను సమీక్షించారు.
తుఫాను బిపార్జోయ్, "చాలా తీవ్రమైన తుఫాను", జూన్ 15 న గుజరాత్ తీరం దాటుతుందని భావిస్తున్నారు.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పశ్చిమ తీరంలోని అన్ని రాష్ట్రాల్లోని (గుజరాత్‌తో సహా) ప్రాంతీయ కార్యాలయాలతో తుఫాను సంసిద్ధతలో ఉన్న రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సూచనలతో నిరంతరంగా సమాచారంతో అప్రమత్తం చేస్తోంది. ఇప్పటివరకు, అటువంటి అభ్యర్థన ఏదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేయబడలేదు.
డా. ఆర్ ఎం ఎల్ హాస్పిటల్ న్యూ ఢిల్లీ, ఎల్ హెచ్ ఎం సీ, న్యూఢిల్లీ; సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీ; ఎయిమ్స్ (న్యూఢిల్లీ); ఎయిమ్స్ (జోధ్‌పూర్) మరియు ఎయిమ్స్ (నాగ్‌పూర్) ల నుండి ఆరు మల్టీ-డిసిప్లినరీ సెంట్రల్ క్విక్ రెస్పాన్స్ మెడికల్ టీమ్‌లు సిద్ధం చేయబడ్డాయి. అత్యవసర సంరక్షణ మరియు సేవలను అందించడానికి ఏవైనా అవసరాలు ఉంటే సమీకరించడానికి సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా, బాధితులకు మానసిక, సామాజిక సంరక్షణ మరియు సహాయాన్ని అందించడానికి బెంగళూరులోని నిమ్హాన్స్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
తుఫాను తర్వాత ఏదైనా అంటువ్యాధులు ప్రబలితే సకాలంలో గుర్తించడం కోసం విపత్తు అనంతర వ్యాధి నిఘా నిర్వహించడానికి అన్ని రాష్ట్రాల్లోని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) రాష్ట్ర/జిల్లా నిఘా విభాగాల ద్వారా చర్యలు చేపట్టింది. రాష్ట్రాలకు ఏదైనా లాజిస్టిక్ అవసరం ఉన్నట్లయితే హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సరఫరా చేస్తుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తుఫాను పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది మరియు ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
***
(Release ID: 1932053)
Visitor Counter : 205