ప్రధాన మంత్రి కార్యాలయం

‘జి20 డెవలప్ మెంట్ మినిస్టర్స్ మీటింగును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘కాశీ శతాబ్దాల తరబడి జ్ఞానానికి, చర్చ కు, సంస్కృతి కి మరియు ఆధ్యాత్మికత కు కేంద్రం గా ఉంటూ వచ్చింది’’

‘‘సతత అభివృద్ధి లక్ష్యాలు వెనుకపట్టు పట్టకుండాచూసుకోవడం అనేది ప్రజల యొక్క సామూహిక బాధ్యత అని చెప్పాలి’’
‘‘అంతగా అభివృద్ధి కి నోచుకోని అటువంటి వంద కు పైచిలుకుఆకాంక్ష యుక్త జిల్లా ల ప్రజల జీవనాన్ని మెరుగు పరచడం  కోసం మేం పాటు పడ్డాం’’
‘‘డిజిటలైజేశన్ ఒక క్రాంతికారి మార్పు ను తీసుకువచ్చింది, ప్రజల కుసాధికారిత ను కల్పించడాని కి, సమాచారాన్ని చెంతకు చేర్చడాని కి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటట్లుచూడటాని కి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతున్నది’’
‘‘భారతదేశం లో, మేము నదుల కు, వృక్షాల కు, పర్వతాల కు మరియు ప్రకృతి లోని అన్ని అంశాల కు గొప్ప ఆదరణ ను కట్టబెడుతున్నాం’’
‘‘భారతదేశం మహిళల కు సాధికారిత కల్పన కే పరిమితం కాలేదు; భారతదేశం మహిళ లుకేంద్ర స్థానం లో నిలచినటువంటి అభివృద్ధి కి కూడా ఆలవాలమవుతోంది’’

Posted On: 12 JUN 2023 10:03AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘జి20 డెవలప్ మెంట్ మినిస్టర్స్ మీటింగ్’ ను ఉద్దేశించి వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాని కి తల్లి వంటిది అయిన అతి ప్రాచీన నగరం వారాణసీ కి మిమ్మల్ని అందరి ని ఆహ్వానిస్తున్నానన్నారు. కాశీ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ఈ నగరం జ్ఞానాని కి, చర్చ కు, వాదోపవాదాల కు, సంస్కృతి కి మరియు ఆధ్యాత్మికత కు వందల సంవత్సరాలు గా స్థానం గా ఉంటూ వచ్చింది. భారతదేశం లో వైవిధ్య భరిత వారసత్వాని కి నిలయం గా ఉంటూనే ఈ నగరం దేశం లో అన్ని ప్రాంతాల కు చెందిన ప్రజలు ఒక చోట గుమి కూడేందుకు తగినది గా ఉంటూ వస్తోంది అని ప్రదాన మంత్రి అన్నారు. జి20 అభివృద్ధి కార్యసూచీ కాశీ నగరాని కి సైతం చేరుకోవడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘అభివృద్ధి అనేది ప్రపంచం లో అంతగా అభివృద్ధి చెందని అటువంటి దేశాల కు ఒక కీలకమైన అంశం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచం లో తలెత్తిన కోవిడ్ మహమ్మారి కారణం గా ఏర్పడిన సమస్యలు గ్లోబల్ సౌథ్ దేశాల పై తీవ్ర ప్రభావాన్ని ప్రసరించాయి. మరో ప్రక్క భౌగోళిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి ఉద్రిక్తతలు ఆహార పరమైనటువంటి, శక్తి సంబంధమైన మరియు ఎరువుల సంబంధమైన సంకటాల కు దారితీశాయి అని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితుల లో మీరు తీసుకొనే నిర్ణయాలు మానవాళి అంతటికీ ముఖ్యమైనవి అవుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. సతత అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి స్) సాధన లో వెనుకపట్టున ఉండిపోకుండా చూడడం ప్రజల సామూహిక బాధ్యత గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనిని సాధించడాని కి కావలసిన కార్యాచరణ ప్రణాళిక విషయం లో ప్రపంచాని కి ఒక బలమైనటువంటి సందేశాన్ని గోబ్లల్ సౌథ్ అందించవలసి ఉంది అని కూడా ఆయన అన్నారు.

 

మన ప్రయాస లు సంపూర్ణమైనవి గా, అన్ని వర్గాల ను కలుపుకొని పోయేవిగా , పక్షపాతాని కి తావు ఉండనటువంటి మరియు నాలుగు కాలాల పాటు నిలబెట్టుకొనేవిగా ఉండి తీరాలి అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. ఎస్ డిజి స్ సాధన లో పెట్టుబడి ని అధికం చేయడం కోసం యత్నాలు జరగాలి, మరి అనేక దేశాలు రుణం పరం గా ఎదుర్కొంటున్నటువంటి నష్ట భయాల ను తొలగించడాని కి తగిన పరిష్కార మార్గాల ను కూడా వెదకాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అవసరం ఉన్న దేశాల కు ఆర్థిక సహాయాన్ని అందుబాటు లోకి తీసుకు రావడం కోసం, అర్హత ప్రమాణాల ను విస్తరించడం కోసం బహు పక్షీయ ఆర్థిక సహాయ సంస్థల ను సంస్కరించవలసి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో మేం అంతగా అభివృద్ధి కి నోచుకోనటువంటి వంద కు పైగా ఆకాంక్ష యుక్త జిల్లాల లో ప్రజా జీవనాన్ని మెరుగు పరచడం కోసం యత్నించాం అని ప్రధాన మంత్రి వివరించారు. ఆకాంక్ష యుక్త జిల్లాలు ప్రస్తుతం దేశం లో వృద్ధి కి ఊతాన్ని ఇస్తున్నాయి అని ఆయన చెప్పారు. ఈ తరహా అభివృద్ధి నమూనా ను అధ్యయనం చేయవలసిందని జి20 డెవలప్ మెంట్ మినిస్టర్స్ ను ఆయన కోరారు. ‘‘అజెండా 2030 వైపు చురుకు గా పయనిస్తున్న తరుణం లో ఇది మీకు ప్రాసంగికం గా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

 

డేటా లభ్యత పరం గా వ్యత్యాసం అనేది పెరిగిపోతూ ఉన్న అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, విధాన రూపకల్పన కు, వనరుల కేటాయింపున కు, సార్వజనిక సేవ ల అందజేత కు అధిక నాణ్యత కలిగిన డేటా అతి ముఖ్యమైంది గా ఉందన్నారు. డేటా లభ్యత పరం గా ఉన్న అంతరాన్ని తొలగించడం లో సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రజాస్వామ్యీకరణ ఒక ముఖ్యమైన ఉపకరణం అని ఆయన అన్నారు. భారతదేశం లో డిజిటలైజేశన్ ఒక విప్లవాత్మకమైనటువంటి పరివర్తన ను తీసుకు వచ్చింది. ప్రజల కు సాధికారిత ను కల్పించడం కోసం, డేటా ను అందరికీ అందుబాటు లోకి తీసుకు రావడం కోసం మరియు అన్ని వర్గాల కు డేటా అందేటట్లు చూడడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఒక ఉపకరణం తరహా లో ఉపయోగించుకోవడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి వివరించారు. భారతదేశం తన అనుభవాల ను భాగస్వామ్య దేశాల కు వెల్లడి చేయడాని కి సుముఖం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల లో ఆచరణ, అభివృద్ధి మరియు లభ్యత ల పరం గా డేటా ను ప్రోత్సహించడాని కి స్పష్టమైన కార్యక్రమాల ను ఈ చర్చ లు సూచించ గలగుతాయన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.

 

‘‘భారతదేశం లో మేం నదుల కు, వృక్షాల కు, పర్వతాల కు మరియు ప్రకృతి తాలూకు అన్ని అంశాల కు ఎక్కడ లేని గౌరవాన్ని కట్టబెడుతున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ సాంప్రదాయిక ఆలోచన విధానం భూ గ్రహాని కి మిత్ర పూర్వకం గా ఉండేటటువంటి జీవన సరళి ని ప్రోత్సహిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. కిందటి సంవత్సరం లో ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జనరల్ తో కలసి మిశన్ లైఫ్ ను ప్రారంభించడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఈ గ్రూపు ఉన్నత స్థాయి సిద్ధాంతాల ను రూపొందించడం కోసం శ్రమిస్తూ ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘శీతోష్ణ స్థితి సంబంధి కార్యాచరణ కు ఇది ఒక సార్థక తోడ్పాటు కాగలుగుతుంది’’ అని ఆయన అన్నారు.

 

మహిళలు, పురుషుల మధ్య సమానత్వం మరియు మహిళల కు సాధికారిత కల్పన.. వీటికి ఎస్ డిజి స్ సాధన లో ప్రాముఖ్యం ఉందన్న సంగతి ని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, భారతదేశం మహిళ ల సశక్తీకరణ కు పరిమితం కాలేదు, భారతదేశం మహిళలు కేంద్ర స్థానం లో ఉండేటటువంటి అభివృద్ధి దిశ గా పయనిస్తోంది అన్నారు. అభివృద్ధి కి సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన లో మహిళలు కీలకమైన పాత్ర ను పోషిస్తున్నారు అని శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, వారు వృద్ధి కి మరియు పరివర్తన కు ప్రతినిధులు గా కూడాను ఉంటున్నారన్నారు. మహిళ లు కేంద్ర స్థానం లో నిలచేటటువంటి అభివృద్ధి సాధన కు గాను ఒక మేలైనటువంటి కార్యచరణ ప్రణాళిక ను అవలంబించవలసిందిగా ప్రతి ఒక్కరి కి ఆయన విజ్ఞప్తి చేశారు.

 

కాశీ యొక్క స్ఫూర్తి భారతదేశం లో చిరకాలిక సంప్రదాయాల నుండి బలాన్ని అందిపుచ్చుకొంటోందని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో పేర్కొన్నారు. సమావేశం లో పాలుపంచుకొంటున్న ఉన్నతాధికారులు వారి కాలాన్ని సమావేశ మందిరం లోనే పూర్తిగా వెచ్చించడాని కంటే కాశీ నగరం యొక్క ఉత్సాహాన్ని గమనించడం లో, ఆ ఉత్సాహం లో పాలుపంచుకోవడం లో ముందుకు రావాలి అని శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ‘‘గంగా హారతి మరియు సార్ నాథ్ సందర్శన.. ఇవి మీరు మీ యొక్క ఆకాంక్షిత ఫలితాల ను సాధించడం లో ప్రేరణ ను అందిస్తాయన్న నమ్మకం నాలో ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అజెండా 2030 ని ముందుకు తీసుకు పోయేందుకు మరియు గ్లోబల్ సౌథ్ యొక్క ఆకాంక్షల ను నెరవేర్చేందుకు వాదోపవాదాలు సఫలం కావాలి అని పేర్కొంటూ శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

*****

DS/TS



(Release ID: 1931685) Visitor Counter : 171