ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

జి20 డెవలప్ మెంట్ మినిస్టర్స్ మీటింగ్ సందర్భం లో ప్రధాన మంత్రి వీడియో సందేశం యొక్కపాఠం

Posted On: 12 JUN 2023 10:03AM by PIB Hyderabad

శ్రేష్ఠులు, మహిళలు మరియు సజ్జనులారా,

 

మీలో ప్రతి ఒక్కరి ని ప్రజాస్వామ్యాని కి తల్లి వంటి అత్యంత ప్రాచీన నగరానికి స్నేహపూర్వకం గా ఆహ్వానిస్తున్నాను. ఇది జి20 డెవలప్ మెంట్ మినిస్టర్స్ మీటింగ్కు చక్కగా సరిపోయేటటువంటి స్థానం గా ఉంది. కాశీ నగరం వందల ఏళ్ళు గా జ్ఞానాని కి, చర్చ కు,వాదోపవాదాల కు, సంస్కృతి కి మరియు ఆధ్యాత్మికత కు కేంద్రం గా ఉంటూ వచ్చింది. ఈ నగరం భారతదేశం యొక్క వైవిధ్య భరితం అయినటువంటి వారసత్వాని కి నిలయం గా ఉండి, దేశం లో అన్ని ప్రాంతాల ప్రజానీకం ఒక చోటు లో గుమికూడేందుకు తగిన స్థానం గా ఉంటూ వస్తున్నది. జి20 అభివృద్ధి కార్యసూచి కాశీ నగరాని కి సైతం చేరుకొన్నందుకు నేను ప్రసన్నం గా ఉన్నాను.

 

శ్రేష్ఠులారా,

 

 

అభివృద్ధి అనేది ప్రపంచం లో అంతగా అభివృద్ధి చెందని అటువంటి దేశాల (గ్లోబల్ సౌథ్) కు ఒక ముఖ్యమైనటువంటి అంశం గా ఉన్నది. కోవిడ్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తం గా వల్ల తలెత్తినందువల్ల ఏర్పడ్డ సమస్య లు గ్లోబల్ సౌథ్ దేశాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపెట్టాయి. భౌగోళిక పరమైనటువంటి, రాజకీయ సంబంధమైనటువంటి ఉద్రిక్తతలు ఆహారం, శక్తి, ఇంకా ఎరువుల కు సంబంధించిన సంకటాల కు దారి ని తీశాయి. ఈ తరహా పరిస్థితుల లో మీరు తీసుకొనేటటువంటి నిర్ణయాలు యావత్తు మానవ జాతి కి గొప్ప అర్థవంతమైనవిగా మారుతాయి. సస్ టేనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్ డిజి స్) వెనుకపట్టు న ఉండిపోకుండా చూడడం మన అందరి సామూహిక బాధ్యత అని నేను దృఢం గా విశ్వసిస్తున్నాను. ఏ ఒక్కరు చిన్నచూపున కు గురి కాకుండా మనం పూచీపడవలసి ఉన్నది. దీనిని సాధించడం కోసం మన దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంది అనే విషయాన్ని ప్రపంచాని కి ఒక బలమైన సందేశం గా అందించడం ఈ కూటమి కి తప్పనిసరి.

 

శ్రేష్ఠులారా,

 

మన ప్రయాస లు సంపూర్ణమైనవి గా, అన్ని వర్గాలు కలుపుకొని పోయేవి గా, న్యాయమైనవి గా మరియు ఆచరణీయమైనవి గా తప్పక ఉండాలి. మనం ఎస్ డిజి స్ లక్ష్య సాధన కై పెట్టుబడి ని పెంచాలి. అంతేకాకుండా అనేక దేశాలు రుణం పరం గా ఎదుర్కొంటున్న నష్ట భయాల ను తొలగించడాని కి తగిన పరిష్కార మార్గాల ను వెదకాలి. ఆర్థిక సహాయం అనేది అవసరార్థుల కు అందుబాటు లోకి వచ్చే లాగున అర్హత ప్రమాణాల ను విస్తరించడాని కి బహుపక్షీయ ఆర్థిక సహాయ సంస్థల ను సంస్కరించాలి. భారతదేశం లో, అంత గా అభివృద్ధి కి నోచుకోనటువంటి వంద కు పైచిలుకు ఆకాంక్షయుక్త జిల్లాల లో ప్రజా జీవనాన్ని మెరుగు పరచడాని కి మేం నడుం బిగించాం. అవి ప్రస్తుతం దేశం లో వృద్ధి ఉత్ప్రేరకాలు గా నిలచాయి అని మాకు అనుభవం లోకి వచ్చింది. అభివృద్ధి తాలూకు ఈ నమూనా ను అధ్యయనం చేయండి అంటూ జి20 డెవలప్ మెంట్ మినిస్టర్స్ ను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అజెండా 2030 దిశ లో సాగిపోయేందుకు పాటుపడుతున్న మీకు ప్రాసంగికం గా ఉండవచ్చును.

 

శ్రేష్ఠులారా,

 

మీ ముందు ఉన్న ముఖ్యమైన అంశాల లో డేటా పరం గా తలెత్తిన అంతరాలు అంతకంత కు పెరిగి పోతుండడం అనేది ఒక అంశం గా ఉంది. అర్థవంతమైనటువంటి విధానాల రూపకల్పన, వనరుల ను సమర్థవంతమైన రీతి లో కేటాయించడం, మరి అలాగే సార్వజనిక సేవ ల అందజేత ను ప్రభావయుక్తమైంది గా మలచడం లో హై- క్వాలిటీ డేటా కీలకం. కొన్ని వర్గాల కు డేటా లభ్యం కావడానికి మరి కొన్ని వర్గాల కు డేటా అవసరమైనంత గా అందుబాటులో లేక పోవడానికి (డిజిటల్ డివైడ్) ఉన్న అంతరాన్ని భర్తీ చేయడం లో సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రజాస్వామ్యీకరణ ఒక ముఖ్యమైనటువంటి ఉపకరణం గా తోడ్పాటు ను అందించ గలుగుతుంది. భారతదేశం లో డిజిటలైజేశన్ ఒక క్రాంతికారి పరివర్తన ను తీసుకు వచ్చింది. ప్రజల కు సాధికారిత ను కల్పించడాని కి, డేటా ను అందుబాటు లోకి తీసుకు రావడాని కి మరియు ప్రజల లోని అన్ని వర్గాల కు డేటా చేరేటట్లు గా చూడటాని కి సాంకేతిక విజ్ఞానాన్ని ఒక పనిముట్టు గా వాడడం జరుగుతోంది. భారతదేశం తన అనుభవాన్ని భాగస్వామ్య దేశాల కు వెల్లడించడాని కి సుముఖం గా ఉంది. డేటా ను పాలన లో, అభివృద్ధి లో, సేవ ల అందజేత లో విరివి గా ఉపయోగించుకొనేందుకు స్పష్టమైన కార్యాచరణల ను మీ చర్చ లు ప్రసాదిస్తాయి అని నేను ఆశ పడుతున్నాను.

 

శ్రేష్ఠులారా,

 

భారతదేశం లో నదులన్నా, వృక్షాలన్నా, పర్వతాలన్నా, ఇంకా ప్రకృతి లోని ప్రతి ఒక్క అంశమన్నా మేం ఎక్కడ లేని గౌరవాన్ని చాటుకొంటూ ఉంటాం. భూ గ్రహం తో మైత్రి పూర్వకం గా ఉండే జీవన సరళి ని సాంప్రదాయిక భారతదేశ భావజాలం ప్రోత్సహిస్తున్నది. ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జనరల్ తో కలసి నేను కిందటి ఏడాది లో మిశన్ లైఫ్-లైఫ్ స్టయిల్ ను ప్రారంభించాను. ఎల్ఐఎఫ్ఇ కి సంబంధించి ఉన్నత స్థాయి సిద్ధాంతాల ను రూపొందించడం కోసం ఈ గ్రూపు శ్రమించడాన్ని గమనించి నేను సంతోషిస్తున్నాను. ఇది శీతోష్ణ సంబంధి కార్యాచరణ కు ఒక ముఖ్యమైన తోడ్పాటు కాగలదు.

 

శ్రేష్ఠులారా,

 

ఎస్ డిజి స్ సాధన లో మహిళల కు సాధికారిత కల్పన మరియు మహిళ లు, పురుషుల మధ్య సమానత్వం అనేవి కీలకం గా ఉన్నాయి. భారతదేశం లో మేం మహిళల కు సాధికారిత కల్పన వరకే గిరి గీసుకొని ఉండడం లేదు. మా దేశం లో అభివృద్ధి అనేది మహిళ లు కేంద్ర స్థానం లో నిలచే విధం గా ఉంటున్నది. అభివృద్ధి కి దారి తీసేటటువంటి కార్యక్రమాల ను మహిళ లు నిర్దేశిస్తున్నారు. అంతేకాదు, వారు వృద్ధి కి మరియు మార్పున కు ప్రతినిధులు గా కూడా నిలుస్తున్నారు. మహిళ లు కేంద్ర స్థానం లో ఉండేటటువంటి అభివృద్ధి సాధన కై మేలు మలుపు కాదగినటువంటి కార్యాచరణ ప్రణాళిక ను అనుసరించవలసిందంటూ మిమ్మల్ని నేను కోరుతున్నాను.

 

శ్రేష్ఠులారా,

 

కాశీ నగరం యొక్క స్ఫూర్తి అనేది భారతదేశం యొక్క చిరకాలిక సంప్రదాయాల నుండి శక్తి ని పుంజుకొన్నది. మీరు మీ కాలాన్నంతటినీ సమావేశ మందిరం లో వెచ్చించకూడదు అని నేను తలుస్తున్నాను. మీరు బయటకు వెళ్ళండి, కాశీ నగరం యొక్క స్ఫూర్తి ఎలాంటిది అన్నది గమనించి, అందులో భాగం పంచుకోండి అంటూ మీకు నేను సూచన ను చేస్తున్నాను. నేను ఈ మాటల ను ఎందుకు చెబుతున్నాను అంటే కాశీ నా నియోజకవర్గం అనే కారణం వల్ల మాత్రం కాదు. గంగా ఆరతి ని వీక్షించడం, సార్ నాథ్ ను సందర్శించడం వల్ల మీరు కోరుకొంటున్నటువంటి ఫలితాల ను సాధించడం లో తగిన ప్రేరణ ను మీరు పొందగలరన్న విశ్వాసం నాలో ఉన్నది. అజెండా 2030 ని వ్యాప్తి చేయడం కోసం మీరు జరిపే సంప్రదింపుల లో విజయం లభించాలి. అలాగే, గ్లోబల్ సౌథ్ దేశాల ఆకాంక్ష లు నెరవేరాలి అని నేను మీకు నా యొక్క శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.

 

 

**



(Release ID: 1931684) Visitor Counter : 188