హోం మంత్రిత్వ శాఖ
03.05.2023 నుంచి మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
కమిషన్‌కు అధ్యక్షత వహించనున్న గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా; ఇతర సభ్యులు విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ హిమాన్షు శేఖర్ దాస్, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ అలోక ప్రభాకర్
Posted On:
04 JUN 2023 6:11PM by PIB Hyderabad
03.05.2023 నుంచి మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 కింద, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా కమిషన్‌కు అధ్యక్షత వహిస్తారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ హిమాన్షు శేఖర్ దాస్, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ అలోక ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు.
మణిపూర్‌లో హింస చెలరేగడం, వ్యాప్తి చెందడానికి గల కారణాలు, ఇందుకు అధికారులు లేదా వ్యక్తుల వల్ల ఏవైనా తప్పులు జరిగాయా అనే కోణంలో కమిషన్ విచారణ చేస్తుంది.
మే 29 మే నుంచి జూన్ 1వ తేదీ వరకు మణిపూర్‌లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, అక్కడి పరిస్థిని పరిశీలించారు. ఆ తర్వాత విచారణ కమిషన్ నియామకం జరిగింది.
కమిషన్ తన నివేదికను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. కమిషన్ ప్రధాన కార్యాలయం ఇంఫాల్‌లో ఉంటుంది.
***
(Release ID: 1929765)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada