రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో 5&6 జూన్ 2023న యుఎస్ & జర్మన్ రక్షణ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్న రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్
రెండు దేశాలతో రక్షణ సహకారం పెంపు పై దృష్టి
Posted On:
03 JUN 2023 10:02AM by PIB Hyderabad
రక్షణమంత్రి శ్రీ రాజనాథ్ సింగ్‌తో ద్వైపాక్షిక చర్చలను నిర్వహించేందుకు యుఎస్ రక్షణ మంత్రి శ్రీ లాయిడ్ ఆస్టిన్, జర్మన్ రక్షణ మంత్రి శ్రీ బోరిస్ పిస్టోరియస్ న్యూఢిల్లీకి విచ్చేయనున్నారు. యుఎస్ రక్షణ మంత్రితో 05 జూన్, 2023న రోణ మంత్రి సమావేశం అవుతుండగా, జర్మన్ రక్షణ మంత్రితో జూన్ 06న చర్చలు జరుగనున్నాయి. పారిశ్రామిక సహకారంపై దృష్టితో రక్షణ సహకారానికి సంబంధించిన అనేక ద్వైపాక్షిక అంశాలను ఈ రెండు సమావేశాలలో చర్చించనున్నారు.
యుఎస్ రక్షణ మంత్రి 4జూన్ సింగపూర్ నుంచి రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వస్తున్నారు. ఇది మంత్రి ఆస్టిన్ భారత్ రెండవ పర్యటన. ఇంతకు ముందు మార్చి 2021లో ఆయన వచ్చారు.
జర్మన్ రక్షణ మంత్రి జూన్ 05 నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన ఇండొనేషియా పర్యటన ముగించుకొని వస్తారు. రక్షణ మంత్రితో సమావేశం మాత్రమే కాక శ్రీ బోరిస్ పిస్టోరియస్ న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ఇన్నొవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ( ఐడిఇఎక్స్ - రక్షణ సామర్ధ్యం కోసం ఆవిష్కరణలు) సందర్భంగా రక్షణకు సంబందించిన కొన్ని స్టార్టప్‌లను కలుసుకోనున్నారు. జూన్ 07వ తేదీన ఆయన ముంబైకి వెళ్లి, పశ్చిమ నావల్ కమాండ్, మజగాంవ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కేంద్రకార్యాలయాలను సందర్శించనున్నారు.
***
(Release ID: 1929712)
Visitor Counter : 161