ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా లో రైలు దుర్ఘటన జరిగిన దరిమిలా తలెత్తిన స్థితి ని పరిశీలించడం కోసం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
స్థితి ని సమీక్షించడం కోసం ఒడిశా కు వెళ్తున్న ప్రధాన మంత్రి
Posted On:
03 JUN 2023 1:12PM by PIB Hyderabad
ఒడిశా లో రైలు దుర్ఘటన దరిమిలా అక్కడ తలెత్తిన స్థితి యొక్క గుణదోషాలు పరిశీలించడం కోసం నిర్వహించినటువంటి ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్థితి ని సమీక్షించడానికని శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా కు బయలుదేరి వెళ్తున్నారు కూడాను.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ఒడిశా లో రైలు దుర్ఘటన దరిమిలా అక్కడ తలెత్తిన స్థితి ని పరిశీలించడం కోసం నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. దుర్ఘటన లో బాధితుల ను కాపాడడం, అవసరమైన సహాయాన్ని చేయడం మరియు వైద్య చికిత్స ను అందించడం లకు సంబంధించిన అంశాల ను సమీక్ష సమావేశం లో చర్చించడం జరిగింది.’’
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఒడిశా కు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జరిగిన రైలు దుర్ఘటన అనంతరం ఏర్పడ్డ స్థితి ని ఆయన సమీక్షించనున్నారు.’’ అని తెలిపింది.
***
DS/TS
(Release ID: 1929617)
Visitor Counter : 191
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam