ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 5 కోట్ల ఆసుపత్రి ప్రవేశాలు కల్పించబడినవి


ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇప్పటి వరకు రూ. 61,501 కోట్ల విలువైన ఉచిత చికిత్స చేయడం జరిగింది.

Posted On: 31 MAY 2023 3:04PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద చికిత్స చేయడానికి  దేశవ్యాప్తంగా 28,351 ఆస్పత్రులు జాబితాలో చేర్చడం జరిగింది. వీటిలో ఏదైనా  ఆస్పత్రిలో ఒక్కొక్క కుటుంబానికి  రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స చేయడానికి 23.39 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించారు

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఐదు కోట్ల  ఆసుపత్రి ప్రవేశాల మైలు రాయిని దాటింది.  ఈ పథకం కింద కల్పించిన ఉచిత ప్రవేశాలు విలువ రూ. 61,501 కోట్లు.    జాతీయ ఆరోగ్య అధికార సంస్థ (ఎన్ హెచ్ ఎ) అమలు చేస్తున్న ప్రధాన పథకం కింద ప్రతి కుటుంబానికి  ఏడాదికి రూ. 5 లక్షల వరకు ద్వితీయ,  తృతీయ ఆస్పత్రిలో ప్రవేశాలు కల్పించి ఆరోగ్య చికిత్సలు చేస్తారు.   ఈ పథకం ద్వారా 12 కోట్ల లబ్ధిదారుల కుటుంబాలకు ఆస్పత్రి ప్రవేశాలు లభిస్తాయి.  

      ఈ పథకం ద్వారా సాధించిన ఫలితాల గురించి వివరిస్తూ జాతీయ ఆరోగ్య అధికార సంస్థ (ఎన్ హెచ్ ఎ)  ముఖ్య కార్యనిర్వహణ అధికారి --"  ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి -- జన ఆరోగ్య యోజన పథకాన్ని సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించాలనే దార్శనికతతో ప్రారంభించడం జరిగింది.  ఈ పథకం ప్రారంభించి అమలు చేయడం ఇప్పటికి ఇది ఐదవ సంవత్సరం.  ఈ పథకం అమలు ద్వారా పేద, దుర్బల కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు  చేతి నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా చికిత్స చేయడం జరుగుతోంది. అమలుకు నిలకడగా ప్రయత్నాలు సాగుతుండటం వల్ల ఈ ఏడాది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ఈ ఏడాది (2022-23) అనేక మైలురాళ్లు దాటింది.  పథకం లబ్ధిదారులకు 9.28 కోట్ల ఆయుష్మాన్ కార్డుల జారీ జరిగింది.  సంపూర్ణంగా  100% నిధుల వినియోగం జరిగింది.  మొత్తం 1.65 కోట్ల ఆసుపత్రి ప్రవేశాలు చేశారు.  పథకం కింద పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరింది" అని తెలిపారు.  

      జన ఆరోగ్య యోజన పథకాన్ని ఢిల్లీ, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ మినహా 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.  ఈ పథకం కింద ఇప్పటి వరకు  ఉచిత చికిత్స చేయడానికి 23.39 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించి ఆయుష్మాన్ కార్డు జారీ చేయడం జరిగింది. లబ్ధిదారులకు AB PM-JAY కింద లబ్ధిదారులకు కో-బ్రాండెడ్ ఆయుష్మాన్ కార్డులు జారీచేశారు.

    ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద చికిత్స చేయడానికి  దేశవ్యాప్తంగా 28,351 ఆసుపత్రులను (12,824 ప్రైవేటు ఆసుపత్రులు కలిపి)  జాబితాలో చేర్చడం జరిగింది. వీటిలో ఏదైనా  ఆస్పత్రిలో ఒక్కొక్క కుటుంబానికి  రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స చేయడానికి 23.39 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించారు.

      2022-23 సంవత్సరంలో దాదాపు మొత్తం ఆసుపత్రి ప్రవేశాలు 56% (సొమ్ము విలువ ప్రాతిపదికన) ప్రైవేటు ఆసుపత్రులలో,  మిగిలిన 44% ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్చేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది.

      జన ఆరోగ్య యోజన లబ్ధిదారుల 27 ప్రత్యేక చికిత్సలకు సంబందించి మొత్తం 1,949 రకాల ప్రక్రియలలో చికిత్స పొందవచ్చు.
ఇప్పటివరకు లబ్ధిదారులు పొందిన తృతీయ స్థాయి ప్రత్యేక చికిత్సలు క్యాన్సర్ చికిత్స, అత్యవసర సంరక్షణ, శల్య వైద్య సంబంధ, మూత్రపిండాల సంబంధ రుగ్మతలకు చికిత్స పొందారు.

       అంతే కాకుండా ఈ పథకం కింద ఆరోగ్య సేవలు అందించడంలో స్త్రీ పురుష సమానత్వం కోసం చేతనతో ప్రయత్నం చేయడం జరిగింది.   సానుకూల విధానాల అమలు వల్ల ఆయుష్మాన్ కార్డు పొందిన లబ్ధిదారులలో  దాదాపు 49% మంది మహిళలు.  ఆసుపత్రి ప్రవేశాలు 48% మహిళలు పొందారు.  అంతేకాక  జన ఆరోగ్య యోజన కింద 141 రకాల వైద్య ప్రక్రియలు మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి సంబంధించిన అదనపు సమాచారం కోసం https://dashboard.pmjay.gov.in/ వెబ్ సైట్ సందర్శించండి.  


 

****


(Release ID: 1929439) Visitor Counter : 181