ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ మే నెలలో రూ.1,57,090 కోట్ల స్థూల జిఎస్టి రాబడి; గత సంవత్సరం కన్నా 12% వృద్ధి

వరుసగా 14 నెలల పాటు నెలవారీ జిఎస్టి ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ, జిఎస్టి ప్రారంభమైనప్పటి నుండి 5వ సారి రూ.1.5 లక్షల కోట్లు దాటింది.

వస్తువుల దిగుమతి నుండి వచ్చే ఆదాయం గత సంవత్సరం కంటే 12% అధికం ; దేశీయ లావాదేవీలు (సేవల దిగుమతితో సహా) ఆదాయం గత ఏడాది కన్నా 11% ఎక్కువ

Posted On: 01 JUN 2023 4:32PM by PIB Hyderabad

మే నెలలో సేకరించిన స్థూల వస్తు, సేవల పన్ను (జిఎస్టి) ఆదాయం రూ.1,57,090 కోట్లు, ఇందులో సిజిఎస్టి రూ.28,411 కోట్లు, ఎస్జిఎస్టి రూ.35,828 కోట్లు, ఐజిఎస్టి రూ.81,363 కోట్లు (రూ. 41,772 కోట్ల వస్తువుల  దిగుమతి కలిపి) వసూలైన సెస్ రూ.11,489 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.1,057 కోట్ల తో సహా).
 

ప్రభుత్వం  ఐజిఎస్టి నుండి  సిజిఎస్టికి రూ.35,369 కోట్లు, ఎస్జిఎస్టికి రూ.29,769 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఈ మే నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సిజిఎస్టికి రూ.63,780 కోట్లు, ఎస్జిఎస్టి రూ.65,597 కోట్లు.

మే నెల రాబడి గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జిఎస్టి ఆదాయాల కంటే 12% ఎక్కువ. ఈ నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 12% ఎక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయం గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 11% ఎక్కువ.
 

దిగువ చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జిఎస్టి ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. 2022 మే నెలతో పోల్చితే 2023 మే నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన జిఎస్టి రాష్ట్రాల వారీ గణాంకాలను పట్టిక చూపుతుంది.

 

 

ఈ మే నెలలో రాష్ట్రాల వారీగా జిఎస్టి రెవిన్యూ వృద్ధి :

రాష్ట్రం/యూటీ 

మే-22

మే-23

వృద్ధి(%)

జమ్మూ కాశ్మీర్ 

372

422

14

హిమాచల్ ప్రదేశ్ 

741

828

12

పంజాబ్ 

1833

1744

-5

చండీగఢ్ 

167

259

55

ఉత్తరాఖండ్ 

1309

1431

9

హర్యానా 

6663

7250

9

ఢిల్లీ 

4113

5147

25

రాజస్థాన్ 

3789

3924

4

ఉత్తర ప్రదేశ్ 

6670

7468

12

బీహార్ 

1178

1366

16

సిక్కిం 

279

334

20

అరుణాచల్ ప్రదేశ్ 

82

120

47

నాగాలాండ్ 

49

52

6

మణిపూర్ 

47

39

-17

మిజోరాం 

25

38

52

త్రిపుర 

65

75

14

మేఘాలయ 

174

214

23

అస్సాం 

1062

1217

15

పశ్చిమ బెంగాల్ 

4896

5162

5

ఝార్ఖండ్ 

2468

2584

5

ఒడిశా 

3956

4398

11

ఛత్తీస్గఢ్ 

2627

2525

-4

మధ్యప్రదేశ్ 

2746

3381

23

గుజరాత్ 

9321

9800

5

దాద్రా నాగర్ హవేలీ , డామన్ అండ్ డయ్యు 

300

324

8

మహారాష్ట్ర 

20313

23536

16

కర్ణాటక 

9232

10317

12

గోవా 

461

523

13

లక్షద్వీప్ 

1

2

210

కేరళ 

2064

2297

11

తమిళనాడు 

7910

8953

13

పాండిచ్చేరి 

181

202

12

అండమాన్ నికోబర్ 

24

31

27

తెలంగాణ 

3982

4507

13

ఆంధ్రప్రదేశ్ 

3047

3373

11

లడఖ్ 

12

26

113

ఇతర ప్రాంతాలు 

185

201

9

కేంద్ర పరిథి 

140

187

34

మొత్తం 

102485

114261

11

 

****


(Release ID: 1929307) Visitor Counter : 166