రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎయిర్ ఆఫీస‌ర్‌-ఇన్‌-ఛార్జ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఒఎ)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎయిర్ మార్ష‌ల్ రాజేష్ కుమార్ ఆనంద్, విఎస్ఎం

Posted On: 01 JUN 2023 11:42AM by PIB Hyderabad

విశిష్ఠ సేవా ప‌తక‌గ్ర‌హీత ఎయిర్ మార్ష‌ల్ రాజేష్ కుమార్ ఆనంద్ ఎయిర్ ఆఫీస‌ర్‌-ఇన్‌-చార్జ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఒఎ)గా  01 జూన్ 2023న బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ పూర్వ విద్యార్ధి అయిన ఎయిర్ మార్ష‌ల్ 13 జూన్ 1987న భార‌తీయ వైమానిక ద‌ళ పాల‌న శాఖలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్‌గా నియ‌మించారు.  ఆయ‌న సింగ‌పూర్ ఏవియేష‌న్ అకాడ‌మీకు చెందిన కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్ అండ్ కంట్రోల్ నుంచి హ‌య్య‌ర్ ఎయిర్ క‌మాండ్ కోర్సును పూర్తి చేశారు. 
దాదాపు 36 సంవ‌త్స‌రాల వృత్తిప‌ర‌మైన జీవితంలో ఎయిర్ మార్ష‌ల్ వివిధ క్షేత్ర, ప‌రిపాల‌నా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. ప్ర‌స్తుత నియామ‌కానికి ముందు న్యూఢిల్లీలోని వైమానిక కేంద్ర కార్యాల‌యంలో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (అడ్మినిస్ట్రేట‌ర్‌)గా ఉన్నారు. 
ఆయ‌న అందించిన విల‌క్ష‌ణ సేవ‌ల‌కు, 2022 జ‌న‌వ‌రిలో భార‌త రాష్ట్ర‌ప‌తి ఆయ‌న‌కు విశిష్ఠ సేవా ప‌త‌కాన్ని ప్ర‌దానం చేశారు. 

 

.
 



(Release ID: 1929028) Visitor Counter : 137