ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
01 జూన్ నుంచి సవిరించిన సెమికాన్ ఇండియా ప్రోగ్రాం ప్రకారం సెమికండక్టర్ & డిస్ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ప్రభుత్వం
ఇండియా సెమికండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి
Posted On:
31 MAY 2023 11:33AM by PIB Hyderabad
భారత్‌లో మాడిఫైడ్ సెమికాన్ ఇండియా ప్రోగ్రాం కింద సెమికండక్టర్ ఫ్యాబ్‌లను ( ముడిసిలికాన్ పొరలను ఏకీకృత సర్క్యూట్‌లుగా మార్చే తయారీ కర్మాగారం), డిస్ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు నూతన దరఖాస్తులను 01 జూన్ 2023 నుంచి ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంఓ సెమికండక్టర్ల అభివృద్ధి, డిస్ప్లే తయారీ పర్యావరణ వాతవరణాన్ని అభివృద్ది చేసేందుకు ఉద్దేశించిన మాడిఫైడ్ సెమికాన్ ఇండియా ప్రోగ్రాంను అమలు చేసే బాధ్యతను అప్పగించిన భారత్ సెమికండక్టర్ మిషన్ ఈ దరఖాస్తులను స్వీకరిస్తుంది.
మాడిఫైడ్ ప్రోగ్రామం కింద, ఏదైనా నోడ్ ( పాత పద్ధతులలో తయారీ అవసరమైన మెచ్యూర్ నోడలు) లకు సంబంధించిన సెమికండక్టర్ ఫ్యాబ్‌లను భారత్ లో ఏర్పాటు చేసేందుకు కంపెనీలు/ కన్సోర్షియా/ జాయింట్ వెంచర్ల ప్రాజెక్టు విలువలో 50 శాతం ఆర్థిక ప్రోత్సాహకాలను అందుబాటులో ఉంది. అలాగే, నిర్దేశిత సాంకేతికతలకు సంబంధించి డిస్ప్లే ఫ్యాబ్‌లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు కూడాప్రాజెక్టు విలువలో 50 శాతం ఆర్థిక ప్రోత్సాహకం అందుబాటులో ఉంది.
సమ్మిళిత సెమికండక్టర్లు (అర్థవాహకాలు)/ సిలికాన్ ఫోటోనిక్స్(ఫోటాన్లకు సంబంధించిన సాంకేతికత)/ సెన్సార్స్ ఫ్యాబ్/ డిస్క్రీట్ సెమీకండక్టర్స్ ఫ్యాబ్, సెమీకండక్టర్ ఎటిఎంపి/ ఒఎస్ఎటి సౌకర్యాలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సవరించిన పథకానికి సంబంధించి దరఖాస్తుల గవాక్షం డిసెంబర్ 2024వరకు తెరిచే ఉంటుంది. రూపకల్పన అనుసంధానిత ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు గవాక్షం కూడా డిసెంబర్ 2024వరకు తెరిచే ఉంటుంది. డిఎల్ఐ పథకం కింద నేటి వరకూ 26 దరఖాస్తులను అందుకోగా, అందులో ఐదు దరఖాస్తులకు ఆమోదాన్ని తెలిపారు.
భారత దేశంలో సెమికండక్టర్లను, డిస్ప్లే తయారీ వాతావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకుక ప్రభుత్వం సెమికాన్ ఇండియా ప్రోగ్రాంను డిసెంబర్ 2021లో రూ. 76,000 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. ఈ పథకం కింద సెమికండక్టర్ ఫ్యాబ్‌లను , డిస్ప్లే ఫ్యాబ్ (ముందు పథకాలు) ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అందరు దరఖాస్తు దారులును సెమికండర్ ఫ్యాబ్‌ల ఏర్పాటు కోసం సవరించిన పథకం కింద తమ తరఖాస్తులను సమర్పించేందుకు అనుమతించారు. దీనితో పాటు, తమ ప్రతిపాదనలలో తగిన మార్పు చేర్పులను పొందుపరిచి డిస్ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటు కోసం సవరించిన పధకం కింద చేసుకోవచ్చు.
***
(Release ID: 1928634)