సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ రోజు సందర్భంగా 'ఎంఎస్‌ కనెక్షన్స్‌' కార్యక్రమం నిర్వహణ


ఎంఎస్‌ ప్రభావిత వ్యక్తులను సామాజికంగా ఒంటరిని చేసే ఇబ్బందులను సవాల్‌ చేసే ఎంఎస్‌ కనెక్షన్స్‌

Posted On: 31 MAY 2023 12:25PM by PIB Hyderabad

ప్రపంచ మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ (ఎంఎస్‌) రోజు సందర్భంగా ఎంఎస్‌ సమాజం ఒకచోటకు చేరింది, మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ (ఎంఎస్‌) బారిన పడిన ప్రతి ఒక్కరి ద్వారా అవగాహన పెంచుకుంది. ప్రపంచ ఎంఎస్‌ రోజు 2020-23 ప్రచారాంశం 'కనెక్షన్స్'. ఎంఎస్‌ కనెక్షన్స్‌ కార్యక్రమం ఉద్దేశం సామాజిక సంబంధాలు, స్వీయ-సంబంధం, సంరక్షణను నిర్మించడం. ప్రచార కార్యక్రమం ఉప శీర్షిక 'ఐ కనెక్ట్, వి కనెక్ట్'. సామాజిక మాధ్యమాల్లో ప్రచార హ్యాష్‌ట్యాగ్ ఎంఎస్‌ కనెక్షన్స్‌. ఎంఎస్‌ ప్రభావిత వ్యక్తులను సామాజికంగా ఒంటరిని చేసే ఇబ్బందులను ఎంఎస్‌ కనెక్షన్స్‌ సవాల్‌ చేస్తాయి. మెరుగైన సేవల కోసం గొంతెత్తి అడగడానికి, సహాయక వ్యవస్థలకు కృతజ్ఞత తెలపడానికి, స్వీయ సంరక్షణలో విజేతగా నిలిచేందుకు ఇది ఒక అవకాశం.

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే దివ్యాంగుల సాధికారత విభాగం దేశంలోని దివ్యాంగుల కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే బాధ్యతాయుత సంస్థ. మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో, దేశంలోని 40కి పైగా ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. ఎంఎస్‌ రోజు ప్రచార కార్యక్రమం కోసం ఎంచుకున్న రంగు నారింజ. మే 30న, సంబంధిత సంస్థలు తమ భవనాల్లో నారింజ రంగు దీపాలు వెలిగించాయి.

30 మే 2023న, ప్రపంచ మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కింది కార్యక్రమాలు నిర్వహించారు:

1. అవగాహన కల్పన కార్యక్రమాలు

2. సదస్సులు & కార్యశాలలు

3. క్విజ్ పోటీలు, పోస్టర్ తయారీ

4. టీఎల్‌ఎం కిట్‌లు పంపిణీ

5. "సెల్ఫ్‌ అడ్వొకసీ అండ్‌ స్కీమ్స్‌ & బెనిఫిట్స్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్ స్ల్కెరోసిస్‌" అంశంపై ఎంఎస్‌SI సహకారంతో సదస్సు

6. "మల్టిపుల్ స్ల్కెరోసిస్‌‌ - అవేర్‌నెస్ & సెన్సిటైజేషన్"పై జాతీయ సదస్సు

7. గడప గడప వద్దకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహణ

8. "మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ & ఇంపార్టెన్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ కేర్" అనే అంశంపై సదస్సు

9. "ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇన్ స్కిజోఫ్రెనియా- ఒక సైకాలజిస్ట్ & సైకియాట్రిస్ట్ పెర్స్పెక్టివ్" అంశంపై సదస్సు

10. సహాయ పరికరాలు పంపిణీ

11. మల్టిపుల్ స్ల్కెరోసిస్‌పై అవగాహన పెంచే నాటిక

 

***


(Release ID: 1928632) Visitor Counter : 157